ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی سوره: سوره حج   آیه:

సూరహ్ అల్-హజ్

از اهداف این سوره:
تعظيم الله سبحانه وتعالى وشعائره والتسليم لأمره.
పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ను,ఆయన ఆచారాలను గౌరవించడం మరియు ఆయన ఆజ్ఞకు లొంగిపోవటం.

یٰۤاَیُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْ ۚ— اِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَیْءٌ عَظِیْمٌ ۟
ఓ ప్రజలారా మీరు మీ ప్రభువుకు ఆయన మీకు ఆదేశించిన వాటిని పాటించి, మిమ్మల్ని ఆయన వారించిన వాటిని విడనాడి భయపడండి. నిశ్చయంగా ప్రళయదినానికి తోడుగా జరిగే భూ ప్రకంపనలు,ఇతర భయాందోళనలు పెద్ద విషయము. అల్లాహ్ కి ఇష్టమైన కార్యలను చేసి దాని కొరకు సిద్ధం కావటం తప్పనిసరి.
تفسیرهای عربی:
یَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّاۤ اَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَی النَّاسَ سُكٰرٰی وَمَا هُمْ بِسُكٰرٰی وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِیْدٌ ۟
ఆ రోజున భయము యొక్క తీవ్రత వలన మీరు ప్రతీ పాలు త్రాపించే స్త్రీ తను పాలు త్రాపించే బిడ్డను మరచిపోవటమును,ప్రతీ గర్భిణీ తన గర్భమును పడవేయటమును చూస్తారు. మరియు మీరు ప్రజలను స్థానము యొక్క భయాందోళనల తీవ్రత వలన మత్తులో ఉన్న వారి మాదిరిగా తమ మతిని కోల్పోవటమును మీరు చూస్తారు. వాస్తవానికి వారు మధ్యం సేవించటం వలన మత్తులో లేరు. కానీ అల్లాహ్ శిక్ష తీవ్రమైనది. నిశ్చయంగా అది వారి బుద్దులను కోల్పోయేటట్లు చేసింది.
تفسیرهای عربی:
وَمِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّیَتَّبِعُ كُلَّ شَیْطٰنٍ مَّرِیْدٍ ۟ۙ
మరియు ఆధారితమైన జ్ఞానం లేకుండా మృతులను మరణాంతరం లేపటంలో ఉన్న అల్లాహ్ యొక్క సామర్ధ్యం విషయంలో తగువులాడే వారు, తన విశ్వసించటంలో,తన పలకటంలో తన ప్రభువుకు వ్యతిరేకంగా ప్రతీ ధిక్కారి అయిన షైతానును,మార్గ విహీనులైన ఇమాములను అనుసరించే వారు ప్రజల్లోంచి ఉన్నారు.
تفسیرهای عربی:
كُتِبَ عَلَیْهِ اَنَّهٗ مَنْ تَوَلَّاهُ فَاَنَّهٗ یُضِلُّهٗ وَیَهْدِیْهِ اِلٰی عَذَابِ السَّعِیْرِ ۟
మానవుల్లోంచి,జిన్నుల్లోంచి ధిక్కరించబడిన ఈ షైతానుల గురించి వ్రాయబడినదేమిటంటే ఎవరైతే అతడిని అనుసరించి,అతనిని నమ్ముతాడో అతడు అతనిని సత్య మార్గము నుండి తప్పిస్తాడు. అవిశ్వాసము,పాప కార్యల్లోంచి అతని విధేయతలో అతను చేసిన వాటి ద్వారా అతడు అతనిని నరకాగ్ని శిక్ష వైపునకు తీసుకుని పోతాడు.
تفسیرهای عربی:
یٰۤاَیُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّنَ الْبَعْثِ فَاِنَّا خَلَقْنٰكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَّغَیْرِ مُخَلَّقَةٍ لِّنُبَیِّنَ لَكُمْ ؕ— وَنُقِرُّ فِی الْاَرْحَامِ مَا نَشَآءُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی وَمِنْكُمْ مَّنْ یُّرَدُّ اِلٰۤی اَرْذَلِ الْعُمُرِ لِكَیْلَا یَعْلَمَ مِنْ بَعْدِ عِلْمٍ شَیْـًٔا ؕ— وَتَرَی الْاَرْضَ هَامِدَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ وَاَنْۢبَتَتْ مِنْ كُلِّ زَوْجٍ بَهِیْجٍ ۟
ఓ ప్రజలారా ఒక వేళ మరణాంతరం మీ లేపబడటం పై మా సామర్ధ్యం విషయంలో మీకు ఎటువంటి సందేహము ఉంటే మీరు మీ పుట్టుక విషయంలో యోచన చేయండి. నిశ్ఛయంగా మేము మీ తండ్రి ఆదంను మట్టితో సృష్టించాము. ఆ తరువాత ఆయన సంతానమును మనిషి స్త్రీ గర్భములో విసిరే వీర్యముతో సృష్టించాము. ఆ తరువాత ఆ వీర్యపు బిందువు ఒక రక్తపు ముద్దగా మారుతుంది. ఆ తరువాత ఆ రక్తపు ముద్ద నమిలివేయబడిన మాంసపు ముక్కను పోలిన ఒక మాంసపు ముక్కగా మారుతుంది. ఆ తరువాత మాంసపు ముక్క మారి జీవం ఉన్నపిల్ల వాడి స్థితిలో బయటకు వచ్చేంత వరకు గర్భములో పూర్తి రూపమును దాల్చే వరకు ఉండవచ్చు లేదా పూర్తి రూపము దాల్చకుండానే గర్భము పడవేయవచ్చు. మీ పుట్టుకను రకరకాల స్థితుల నుండి జరపటం ద్వారా మేము మా సామర్ధ్యమును మీ కొరకు స్పష్టపరచటానికి. మేము గర్భకోశాలలో శిశువల్లోంచి మేము కోరుకున్న వారిని ఒక నిర్ణీత కాలము అది తొమ్మిది నెలల్లో జన్మించే వరకు స్థిరంగా ఉంచుతాము. ఆ తరువాత మేము మీ తల్లుల గర్భముల నుంచి మిమ్మల్ని పిల్లల రూపములో బయటకి తీస్తాము. ఆ తరువాత మీరు పరిపూర్ణ బలము, బుద్ధికి చేరుకోవటానికి (మీరు యవ్వనమునకు చేరుకోవటం కొరకు). మరియు మీలో నుండి దాని కన్న ముందే చనిపోయే వారు ఉంటారు. మీలో నుండి బలము,బుద్ధి బలహీనమయ్యే స్థితి వృధ్ధాప్య వయస్సునకు చేరుకునేంత వరకు జీవించే వారు ఉంటారు. చివరికు పరిస్థితి పిల్లవాడి పరిస్థితి అయిపోతుంది. అతనికి తెలిసిన వాటిని గురించి తెలియని వాడైపోతాడు.మరియు మీరు భూమిని ఎటువంటి మొక్కలు లేకుండా ఎండిపోయినగా మీరు చూస్తారు. మేము ఎప్పుడైతే దానిపై వర్షపు నీటిని కురిపిస్తామో అది మొక్కలతో వికసించిపోతుంది. దాని మొక్కలు పెరగటం కారణంగా అది ఎత్తుగా అవుతుంది. మరియు అది అందమైన దృశ్యం కల అన్నిరకాల మొక్కలను వెలికితీస్తుంది.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• وجوب الاستعداد ليوم القيامة بزاد التقوى.
దైవభీతి సామగ్రి ద్వారా ప్రళయ దినం కొరకు సిద్ధం కావటం తప్పనిసరి.

• شدة أهوال القيامة حيث تنسى المرضعة طفلها وتسقط الحامل حملها وتذهب عقول الناس.
పాలు త్రాపించే స్త్రీ తన పిల్లవాడిని మరిచిపోయే,గర్భిణీ తన గర్భమును పడవేసే,ప్రజల మతిపోయే స్థితి ప్రళయంయొక్క భయాందోళనల తీవ్రత.

• التدرج في الخلق سُنَّة إلهية.
సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సాంప్రదాయం.

• دلالة الخلق الأول على إمكان البعث.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన.

• ظاهرة المطر وما يتبعها من إنبات الأرض دليل ملموس على بعث الأموات.
వర్షము యొక్క బహిర్గతం,దానిని అనుసరించిన భూమి అంతరోత్పత్తి మృతులు మరల లేపబడటంపై ధృడమైన ఆధారము.

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّهٗ یُحْیِ الْمَوْتٰی وَاَنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟ۙ
మీ పుట్టుక మొదటినుండి,దాని దశలు,మీలో నుండి జన్మించే వారి స్థితులను మీకు మేము తెలియపరచినది - మిమ్మల్ని సృష్టించిన అల్లాహ్ సత్యమని,అందులో ఎటువంటి సందేహం లేదని మీరు విశ్వసించటానికి,దానికి విరుద్ధంగా మీరు ఆరాధించే మీ విగ్రహాలు. మరియు ఆయన మృతులను జీవింపజేస్తాడని,ఆయన ప్రతీది చేయగల సమర్ధుడని,ఆయనను ఏది అశక్తుడు చేయదని మీరు విశ్వసించటానికి.
تفسیرهای عربی:
وَّاَنَّ السَّاعَةَ اٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ۙ— وَاَنَّ اللّٰهَ یَبْعَثُ مَنْ فِی الْقُبُوْرِ ۟
మరియు ప్రళయం రాబోతుందని ,దాని రావటంలో ఎటువంటి సందేహము లేదని,మరియు అల్లాహ్ మృతులను వారి కర్మల పరంగా వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి వారి సమాధుల నుండి మరల లేపుతాడని మీరు విశ్వసించటానికి.
تفسیرهای عربی:
وَمِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّلَا هُدًی وَّلَا كِتٰبٍ مُّنِیْرٍ ۟ۙ
మరియు అవిశ్వాసపరుల్లోంచి అల్లాహ్ ఏకత్వం విషయంలో ఎటువంటి జ్ఞానము లేకుండా తగవులాడేవారు, దాన్ని తీసుకుని వెళ్ళి సత్యముతో జతకలిపే వారు వారిలో నుంచి ఉన్నారు. దానిపై వారిని సూచించటానికి ఏ మార్గదర్శకుడిని అనుసరించేవారు లేరు. దాని వైపునకు వారిని మార్గనిర్దేశకం చేసే అల్లాహ్ వద్ద నుండి అవతరిపబడిన జ్యోతిర్మయమైన ఏ గ్రంధము లేదు.
تفسیرهای عربی:
ثَانِیَ عِطْفِهٖ لِیُضِلَّ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— لَهٗ فِی الدُّنْیَا خِزْیٌ وَّنُذِیْقُهٗ یَوْمَ الْقِیٰمَةِ عَذَابَ الْحَرِیْقِ ۟
ప్రజలను విశ్వాసము నుండి,అల్లాహ్ ధర్మంలో ప్రవేశము నుండి మరల్చటానికి తన మెడను గర్వంతో త్రిప్పుతుంటాడు. ఈ గుణం ఎవరిలో ఉంటుందో అతనికి ఇహలోకంలో సంభవించే శిక్ష ద్వారా అవమానముంటుంది. మరియు మేము అతనికి పరలోకములో దహించివేసే అగ్ని శిక్ష రుచి చూపిస్తాము.
تفسیرهای عربی:
ذٰلِكَ بِمَا قَدَّمَتْ یَدٰكَ وَاَنَّ اللّٰهَ لَیْسَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟۠
మరియు అతనితో ఇలా పలకబడుతుంది : నీవు రుచి చూసిన ఈ శిక్ష నీవు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యముల వలనే. మరియు అల్లాహ్ తన సృష్టితాల్లోంచి ఏదైన పాపము వలన తప్ప శిక్షించడు.
تفسیرهای عربی:
وَمِنَ النَّاسِ مَنْ یَّعْبُدُ اللّٰهَ عَلٰی حَرْفٍ ۚ— فَاِنْ اَصَابَهٗ خَیْرُ ١طْمَاَنَّ بِهٖ ۚ— وَاِنْ اَصَابَتْهُ فِتْنَةُ ١نْقَلَبَ عَلٰی وَجْهِهٖ ۫ۚ— خَسِرَ الدُّنْیَا وَالْاٰخِرَةَ ؕ— ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِیْنُ ۟
మరియు ప్రజల్లోంచి అయోమయంలో పడి ఉన్న కొందరు సందేహంలో ఉండి అల్లాహ్ ఆరాధన చేస్తున్నారు. ఒక వేళ అతనికి ఆరోగ్యము,సంపద లో నుండి మేలు వారికి కలిగితే అతడు అల్లాహ్ కొరకు తన విశ్వాసముపై,తన ఆరాధన పై కొనసాగుతాడు. ఒక వేళ అతనికి ఏదైన అనారోగ్యము,పేదరికం ద్వారా సంక్షోభం తలెత్తితే అతడు తన ధర్మము నుండి విసిగిపోయి దాని నుండి తిరిగిపోతాడు. తన ఇహలోకమును నష్టపోతాడు. అతని అవిశ్వాసం అతనికి ఇహలోకమును అధికం చేయదు,అతని కొరకు ఏమీ వ్రాయదు. మరియు అతను తాను పొందిన అల్లాహ్ శిక్ష నుండి తన పరలోకమును నష్టపోతాడు. ఇదే స్పష్టమైన నష్టము.
تفسیرهای عربی:
یَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَضُرُّهٗ وَمَا لَا یَنْفَعُهٗ ؕ— ذٰلِكَ هُوَ الضَّلٰلُ الْبَعِیْدُ ۟ۚ
అతడు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నాడు. ఒక వేళ అతను వాటి అవిధేయతకు పాల్పడితే అవి అతన్ని నష్టం కలిగించవు, ఒక వేళ అతను వాటికి విధేయత చూపితే అవి అతనికి లాభం చేకూర్చవు. నష్టం కలిగించని,లాభం చేకూర్చని ఈ కొన్ని విగ్రహాలను మొరపెట్టుకోవటం సత్యం నుండి దూరం తీసుకుని వెళ్ళే మార్గ భ్రష్టత ఇదే.
تفسیرهای عربی:
یَدْعُوْا لَمَنْ ضَرُّهٗۤ اَقْرَبُ مِنْ نَّفْعِهٖ ؕ— لَبِئْسَ الْمَوْلٰی وَلَبِئْسَ الْعَشِیْرُ ۟
ఈ అవిశ్వాసపరుడు విగ్రహాలను ఆరాధించే వాడిని వేడుకుంటున్నాడు నిరూపితమైన అతని నష్టము కనిపించని అతని లాభము కన్న దగ్గరగా ఉన్నది. ఎవరి లాభము కన్న నష్టము దగ్గరగా ఉన్నదో ఆ ఆరాధించబడేవాడు ఎంతో చెడ్డవాడు. అతడు తనను సహాయమును అర్ధించే వాడి కొరకు సహాయకుడిగా ఎంతో చెడ్డవాడు మరియు తోడు ఉండేవాడి కొరకు సహవర్తిగా ఎంతో చెడ్డవాడు.
تفسیرهای عربی:
اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— اِنَّ اللّٰهَ یَفْعَلُ مَا یُرِیْدُ ۟
నిశ్ఛయంగా అల్లాహ్ తనపై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసిన వారిని స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు వాటి భవనముల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తుంటాయి. నిశ్చయంగా అల్లాహ్ తాను ఎవరిపైనైతే కరుణిస్తాడో కారుణ్యములో నుండి,తాను ఎవిరిని శిక్షిస్తాడో శిక్షలో నుండి తాను కోరుకున్నది చేస్తాడు. పరిశుద్ధుడైన ఆయనను బలవంతం చేసేవాడు ఎవడూ ఉండడు.
تفسیرهای عربی:
مَنْ كَانَ یَظُنُّ اَنْ لَّنْ یَّنْصُرَهُ اللّٰهُ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ فَلْیَمْدُدْ بِسَبَبٍ اِلَی السَّمَآءِ ثُمَّ لْیَقْطَعْ فَلْیَنْظُرْ هَلْ یُذْهِبَنَّ كَیْدُهٗ مَا یَغِیْظُ ۟
అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇహ లోకంలో,పరలోకంలో సహాయం చేయడని భావించే ప్రతి ఒక్కడు తన ఇంటి పైకపప్పుకు ఒక త్రాడును వ్రేలాడదీసి ఆతరువాత నేల పై వ్రేలాడి ఉరేసుకుని తన ప్రాణమును తీసుకోవాలి.ఆ తరువాత అతను తన మనస్సులో పొందిన కోపమును అది తొలగిస్తుందేమో చూడాలి. అయితే వ్యతిరేకి కోరినా లేదా కోరకపోయినా అల్లాహ్ తన ప్రవక్తకు సహాయపడుతాడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• أسباب الهداية إما علم يوصل به إلى الحق، أو هادٍ يدلهم إليه، أو كتاب يوثق به يهديهم إليه.
సన్మార్గము యొక్క కారకాలు అవి జ్ఞానము కావచ్చు అది సత్యమునకు చేరుస్తుంది లేదా సన్మార్గం చూపే వాడు కావచ్చు అతడు వారిని దాని వైపు మార్గం చూపుతాడు. లేదా నమ్మసఖ్యమైన ఏదైన గ్రంధం కావచ్చు అది వారిని దాని వైపు మార్గ నిర్ధేశం చేస్తుంది.

• الكبر خُلُق يمنع من التوفيق للحق.
గర్వం ఎలాంటి గుణమంటే అది సత్యమును అంగీకరించటం నుండి ఆపుతుంది.

• من عدل الله أنه لا يعاقب إلا على ذنب.
అల్లాహ్ పాపమును బట్టి మాత్రమే శిక్షించటం అల్లాహ్ న్యాయములో నుంచి.

• الله ناصرٌ نبيَّه ودينه ولو كره الكافرون.
అల్లాహ్ తన ప్రవక్తకు,తన ధర్మముకు సహాయం చేస్తాడు ఒక వేళ అవిశ్వాసపరులు ఇష్టపడకపోయినా.

وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ۙ— وَّاَنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یُّرِیْدُ ۟
మేము మరణాంతరం లేపబడటం గురించి మీకు స్పష్టమైన వాదనలను విశదీకరించినట్లే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై స్పష్టమైన ఆయతుల ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ తన అనుగ్రహం ద్వారా తాను కోరుకున్న వారికి సన్మార్గమును అనుగ్రహిస్తాడు.
تفسیرهای عربی:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالصّٰبِـِٕیْنَ وَالنَّصٰرٰی وَالْمَجُوْسَ وَالَّذِیْنَ اَشْرَكُوْۤا ۖۗ— اِنَّ اللّٰهَ یَفْصِلُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟
నిశ్ఛయంగా ఈ జాతిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారు,యూదులు,సాబియులు ( కొంతమంది ప్రవక్తలను అనుసరించే వారు ),క్రైస్తవులు,అగ్నిని పూజించేవారు,విగ్రహారాధకులు ఉన్నారు. నిశ్చయంగా అల్లాహ్ వారి మధ్య ప్రళయదినాన తిర్పునిచ్చి విశ్వాసపరులను స్వర్గములో,ఇతరులను నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల యొక్క మాటల్లో నుండి,వారి కార్యాల్లో నుండి ప్రతీ దానిని పర్యవేక్షిస్తున్నాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటిపరంగా ఆయన వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
تفسیرهای عربی:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یَسْجُدُ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُوْمُ وَالْجِبَالُ وَالشَّجَرُ وَالدَّوَآبُّ وَكَثِیْرٌ مِّنَ النَّاسِ ؕ— وَكَثِیْرٌ حَقَّ عَلَیْهِ الْعَذَابُ ؕ— وَمَنْ یُّهِنِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّكْرِمٍ ؕ— اِنَّ اللّٰهَ یَفْعَلُ مَا یَشَآءُ ۟
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా అల్లాహ్ ఆకాశములో ఉన్న దైవ దూతలు,భూమిలో ఉన్న మానవుల్లోంచి,జిన్నుల్లోంచి విశ్వాసపరులు ఆయనకి విధేయతతో కూడిన సాష్టాంగపడుతున్నారని,ఆయన కొరకు సూర్యుడు సాష్టాంగపడుతున్నాడని,ఆయనకి చంద్రుడు సాష్టాంగపడుతున్నాడని,ఆయనకి ఆకాశములో ఉన్న నక్షత్రాలు,భూమిలో ఉన్న పర్వతాలు,చెట్లు,జంతువులు సాష్టాంగ నమస్కారము చేస్తున్నారని మీకు తెలియదా. ప్రజల్లోంచి చాలామంది ఆయనకి విధేయతతో కూడిన సాష్టాంగం చేస్తున్నారు. మరియు చాలామంది ఆయనకి విధేయతతో కూడిన సాష్టాంగము చేయటం లేదు. అయితే వారి తిరస్కారము వలన అల్లాహ్ శిక్ష వారిపై వాటిల్లుతుంది. మరియు అల్లాహ్ ఎవరినైతే అతని తిరస్కారము వలన అవమానము ద్వారా,పరాభవము ద్వారా తీర్పునిస్తాడో అతనిని గౌరవించేవాడు ఎవడూ ఉండడు. నిశ్ఛయంగా అల్లాహ్ తాను తలచుకున్నది చేసి తీరుతాడు. పరిశుద్ధుడైన ఆయనను బలవంతం చేసేవాడు ఎవడూ లేడు.
تفسیرهای عربی:
هٰذٰنِ خَصْمٰنِ اخْتَصَمُوْا فِیْ رَبِّهِمْ ؗ— فَالَّذِیْنَ كَفَرُوْا قُطِّعَتْ لَهُمْ ثِیَابٌ مِّنْ نَّارٍ ؕ— یُصَبُّ مِنْ فَوْقِ رُءُوْسِهِمُ الْحَمِیْمُ ۟ۚ
ఈ రెండు వర్గములు తమ ప్రభువు విషయంలో వారిలో నుంచి ఎవరు హక్కుదారులని వాదులాడినవారు : విశ్వాసపు వర్గము,అవిశ్వాసపు వర్గము.అవిశ్వాసపు వర్గము వారికి నరకాగ్ని బట్టలను తొడిగేవాడికి బట్టలు ఏవిధంగా చుట్టుముట్టుకుని ఉంటాయో ఆ విధంగా చుట్టుముట్టుకుంటుంది. వారి తలలపై నుండి అత్యంత వేడిదైన నీరు గుమ్మరించబడుతుంది.
تفسیرهای عربی:
یُصْهَرُ بِهٖ مَا فِیْ بُطُوْنِهِمْ وَالْجُلُوْدُ ۟ؕ
దాని వేడి తీవ్రత వలన వారి కడుపుల్లో ఉన్న పేగులు కరిగిపోతాయి. మరియు అది వారి చర్మములకు చేరి వాటినీ కరిగింపజేస్తుంది.
تفسیرهای عربی:
وَلَهُمْ مَّقَامِعُ مِنْ حَدِیْدٍ ۟
మరియు నరకాగ్నిలో వారి కొరకు ఇనుప గదలు (సమిటెలు) ఉంటాయి. దైవ దూతలు వాటి ద్వారా వారి తలలపై మోదుతారు.
تفسیرهای عربی:
كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ یَّخْرُجُوْا مِنْهَا مِنْ غَمٍّ اُعِیْدُوْا فِیْهَا ۗ— وَذُوْقُوْا عَذَابَ الْحَرِیْقِ ۟۠
అందులో వారు పొందిన బాధ తీవ్రత వలన నరకాగ్ని నుండి బయటపడాలని ప్రయత్నించినప్పుడల్లా వారు అందులోకే మరలించబడుతారు. వారితో ఇలా అనబడుతుంది : మీరు దహించివేసే అగ్ని శిక్ష రుచి చూడండి.
تفسیرهای عربی:
اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّلُؤْلُؤًا ؕ— وَلِبَاسُهُمْ فِیْهَا حَرِیْرٌ ۟
మరియు విశ్వాసపు వర్గము వారే ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేస్తారో అల్లాహ్ వారిని స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి,వాటి చెట్ల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తుంటాయి. అల్లాహ్ వారికి బంగారపు కంకణములను తొడిగించి అలంకరిస్తాడు. మరియు వారికి ముత్యాలతో కూడిన ఆభరణములను తొడిగించి అలంకరిస్తాడు. మరియు అందులో వారి వస్త్రములు పట్టువి ఉంటాయి.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• الهداية بيد الله يمنحها من يشاء من عباده.
సన్మార్గం చూపటం అల్లాహ్ చేతిలో ఉన్నది. ఆయన తన దాసుల్లోంచి తలచుకున్న వారికి దాన్ని అనుగ్రహిస్తాడు.

• رقابة الله على كل شيء من أعمال عباده وأحوالهم.
అల్లాహ్ యొక్క పర్యవేక్షణ ఆయన దాసుల కార్యాల్లోంచి,వారి స్థితుల్లోంచి ప్రతీ దానిపై ఉంటుంది.

• خضوع جميع المخلوقات لله قدرًا، وخضوع المؤمنين له طاعة.
సృష్టితాలన్నింటి నిమమ్రత అల్లాహ్ విధివ్రాతతో కూడుకుని ఉన్నది.మరియు విశ్వాసపరుల నిమమ్రత విధేయతతో కూడుకున్నది.

• العذاب نازل بأهل الكفر والعصيان، والرحمة ثابتة لأهل الإيمان والطاعة.
అవిశ్వాసపరులపై,అవిధేయపరులపై శిక్ష కురుస్తుంది. విశ్వాసపరులపై,విధేయపరులపై కారుణ్యం స్థిరంగా ఉంటుంది.

وَهُدُوْۤا اِلَی الطَّیِّبِ مِنَ الْقَوْلِ ۖۗۚ— وَهُدُوْۤا اِلٰی صِرَاطِ الْحَمِیْدِ ۟
అల్లాహ్ వారిని ఇహలోకంలో అల్లాహ్ తప్ప ఇంకెవరూ సత్య ఆరాధ్య దైవం కాదని సాక్ష్యం పలకటం, పెద్దరికమును చాటటం (తక్బీర్ చదవటం),స్థుతులను పలకటం లాంటి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. మరియు వారిని ప్రశంసించబడిన ఇస్లాం యొక్క మార్గము వైపునకు మార్గ దర్శత్వం చేశాడు.
تفسیرهای عربی:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِیْ جَعَلْنٰهُ لِلنَّاسِ سَوَآءَ ١لْعَاكِفُ فِیْهِ وَالْبَادِ ؕ— وَمَنْ یُّرِدْ فِیْهِ بِاِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ اَلِیْمٍ ۟۠
నిశ్చయంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఇతరులను ఇస్లాంలో ప్రవేశించటం నుండి ఆపుతారో మరియు ప్రజలను మస్జిదె హరాం నుండి హుదేబియా సంవత్సరంలో ముష్రికులు చేసిన విధంగా ఆపుతారో వారిని మేము బాధాకరమైన శిక్ష రుచిని చూపిస్తాము. ఈ మస్జిదు దేనినైతే మేము ప్రజల కొరకు వారి నమాజులలో ఖిబ్లాగా, హజ్ మరియు ఉమ్రా ఆచారముల్లోంచి ఒక ఆచారముగా చేశామో అందులో మక్కా ప్రాంతపు నివాసీ అయిన, మక్కా ప్రాంతము వాడు కాకుండా ఇతర ప్రాంతము నుండి వచ్చిన వాడైనా సమానమే. మరియు ఎవరైతే అందులో కావాలని పాపకార్యముల్లోంచి ఏదైన కార్యమునకు పాల్పడి సత్యము నుండి మరలాలనుకుంటే మేము అతనికి బాధాకరమైన శిక్ష రుచిని చూపిస్తాము.
تفسیرهای عربی:
وَاِذْ بَوَّاْنَا لِاِبْرٰهِیْمَ مَكَانَ الْبَیْتِ اَنْ لَّا تُشْرِكْ بِیْ شَیْـًٔا وَّطَهِّرْ بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْقَآىِٕمِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟
ఓ ప్రవక్తా మేము ఇబ్రాహీం అలైహిస్సలాం కొరకు గృహ స్థలము,దాని హద్దులను అవి తెలియకుండా ఉండిన తరువాత స్పష్టపరచినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. మరియు మేము ఆయన వైపునకు మీరు నా ఆరాధనలో దేనినీ సాటి కల్పించకండి,అంతే కాదు మీరు నా ఒక్కడి ఆరాధన చేయండి మరియు మీరు నా గృహమును దాని ప్రదక్షిణలు చేసే వారి కొరకు,అందులో నమాజు చేసేవారి కొరకు ఇంద్రియ,నైతిక అశుద్దతలను పరిశుభ్రం చేయి అని దైవ వాణి ద్వారా తెలియజేశాము.
تفسیرهای عربی:
وَاَذِّنْ فِی النَّاسِ بِالْحَجِّ یَاْتُوْكَ رِجَالًا وَّعَلٰی كُلِّ ضَامِرٍ یَّاْتِیْنَ مِنْ كُلِّ فَجٍّ عَمِیْقٍ ۟ۙ
మరియు మేము మిమ్మల్ని నిర్మించమని ఆదేశించిన ఈ గృహము యొక్క హజ్ చేయమని ప్రజలను పిలుస్తూ మీరు ప్రకటించండి. వారు పాదాచారులుగా లేదా నడవటం నుండి అలసిపోయిన ప్రతీ బలహీనమైన ఒంటెపై సవారీ అయి మీ వద్దకు వస్తారు. ఒంటెలు వారిని ఎత్తుకుని ప్రతీ సుదూర మార్గము నుండి తీసుకుని వస్తాయి.
تفسیرهای عربی:
لِّیَشْهَدُوْا مَنَافِعَ لَهُمْ وَیَذْكُرُوا اسْمَ اللّٰهِ فِیْۤ اَیَّامٍ مَّعْلُوْمٰتٍ عَلٰی مَا رَزَقَهُمْ مِّنْ بَهِیْمَةِ الْاَنْعَامِ ۚ— فَكُلُوْا مِنْهَا وَاَطْعِمُوا الْبَآىِٕسَ الْفَقِیْرَ ۟ؗ
పాప విముక్తి, ప్రతిఫలం పొందటం,కలిమాని ఏకీబవించటం మొదలగు వాటి నుండి వారికి ప్రయోజనం కలిగించే వాటికి వారు హాజరు కావాలి. మరియు వారు నిర్ణీత దినములైన జిల్ హిజ్జా మాసపు పదో తారీకు, దాని తరువాతి మూడు రోజుల్లో అల్లాహ్ కి కృతజ్ఞతగా వారికి ఆయన ప్రసాదించిన ఒంటెల్లోంచి,ఆవుల్లోంచి,గొర్రెల్లోంచి హదీ జంతువుల్లోంచి వారు జిబాహ్ చేసే వాటిపై అల్లాహ్ నామమును వారు స్మరించాలి. అప్పుడు మీరు ఈ హదీ జంతువుల్లోంచి తినండి,మరియు వాటిలో నుండి కఠిన పేదరికంలో ఉన్న వారికి మీరు తినిపించండి.
تفسیرهای عربی:
ثُمَّ لْیَقْضُوْا تَفَثَهُمْ وَلْیُوْفُوْا نُذُوْرَهُمْ وَلْیَطَّوَّفُوْا بِالْبَیْتِ الْعَتِیْقِ ۟
ఆ తరువాత వారు తమపై మిగిలిన తమ హజ్ సాంప్రదాయములను పూర్తి చేసుకోవాలి. మరియు వారు తమ తలలను ముండనంతో,తమ గోళ్ళను కత్తిరించుకోవటంతో, ఇహ్రాం కారణముతో వారిపై పేరుకుపోయిన మురికిని తొలగించటముతో ఇహ్రామ్ ను విప్పుకోవాలి. వారు తమపై అనివార్యం చేసుకున్న హజ్ లేదా ఉమ్రా లేదా బలి పశువును పూర్తి చేసుకోవాలి. మరియు వారు శక్తివంతమైన వారి ఆధిపత్యం నుండి అల్లాహ్ విముక్తి కలిగించిన ఆ గృహమును ప్రదక్షిణ తవాఫె ఇఫాజా చేయాలి.
تفسیرهای عربی:
ذٰلِكَ ۗ— وَمَنْ یُّعَظِّمْ حُرُمٰتِ اللّٰهِ فَهُوَ خَیْرٌ لَّهٗ عِنْدَ رَبِّهٖ ؕ— وَاُحِلَّتْ لَكُمُ الْاَنْعَامُ اِلَّا مَا یُتْلٰی عَلَیْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْاَوْثَانِ وَاجْتَنِبُوْا قَوْلَ الزُّوْرِ ۟ۙ
ఇది ఏదైతే మీకు ఆదేశించబడినదో శిరో ముండనంతో,గోళ్ళను కత్తిరించటంతో, మాలీన్యములను తొలగించటంతో,మొక్కుబడులను పూర్తి చేయటంతో, కాబా ప్రదక్షిణతో ఇహ్రామ్ ను విప్పదీయటం అది అల్లాహ్ మీపై అనివార్యం చేసినది. అయితే మీరు మీపై అల్లాహ్ అనివార్యం చేసిన వాటిని గౌరవించండి. మరియు ఎవరైతే అల్లాహ్ అతని ఇహ్రాం స్థితిలో దూరంగా ఉండమని ఆదేశించిన వాటి నుండి దూరంగా ఉన్నాడో తన తరపు నుండి గౌరవంగా అల్లాహ్ హద్దుల్లో వాటిల్లకుండా ఉండటానికి,ఆయన నిషేదించిన వాటిని హలాల్ చేసుకోకుండ ఉండటానికి అది అతని కొరకు ఇహలోకంలో, పరిశుద్ధుడైన తన ప్రభువు వద్ద పరలోకములో మేలైనది. ఓ ప్రజలారా పశువుల్లోంచి మీ కొరకు ఒంటెలు,ఆవులు,గొర్రెలు అనుమతించబడినవి (సమ్మతించబడినవి). అయితే ఆయన మీపై వాటిలో నుంచి ఏ హామీని గాని ఏ బహీరహ్ ని గాని ఏ వసీలహ్ ని గాని నిషేదించలేదు. వాటిలోంచి ఆయన కేవలం మీపై మీరు ఖుర్ఆన్ లో పొందే మృత జంతువుల నిషేదము మొదలగు వాటిని మాత్రమే నిషేదించాడు. అయితే మీరు మురికి అయిన విగ్రహారాధన నుండి దూరంగా ఉండండి. మరియు మీరు అల్లాహ్ పై లేదా ఆయన సృష్టితాలపై ప్రతీ ఆసత్యపు,అబద్దపు మాటను చెప్పటం నుండి దూరంగా ఉండండి.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• حرمة البيت الحرام تقتضي الاحتياط من المعاصي فيه أكثر من غيره.
పరిశుద్దమైన గృహము పవిత్రత అక్కడ ఇతర ప్రదేశముల కన్న ఎక్కువగా పాపకార్యముల నుండి జాగ్రత్త పడటంను నిర్ణయిస్తుంది.

• بيت الله الحرام مهوى أفئدة المؤمنين في كل زمان ومكان.
అల్లాహ్ యొక్క పవిత్ర గృహము ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశమలో ఉన్న విశ్వాసపరుల హృదయముల నివాస స్థలము.

• منافع الحج عائدة إلى الناس سواء الدنيوية أو الأخروية.
హజ్ యొక్క ప్రయోజనాలు ప్రజలకు చేరుతాయి అవి ప్రాపంచికమైనవి గాని లేదా పరలోకమైనవి గాని సమానము.

• شكر النعم يقتضي العطف على الضعفاء.
అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవటం బలహీనులపై దయ చూపటమును నిర్ణయిస్తుంది.

حُنَفَآءَ لِلّٰهِ غَیْرَ مُشْرِكِیْنَ بِهٖ ؕ— وَمَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَكَاَنَّمَا خَرَّ مِنَ السَّمَآءِ فَتَخْطَفُهُ الطَّیْرُ اَوْ تَهْوِیْ بِهِ الرِّیْحُ فِیْ مَكَانٍ سَحِیْقٍ ۟
ఆయన వద్ధ స్వీకృతమైన ఆయన ధర్మము తప్ప ఇతర ధర్మాలన్నింటి నుండి మీరు మరలుతూ,ఆరాధనలో ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించకుండా ఉంటూ దాని నుండి దూరంగా ఉండండి. ఎవరైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పిస్తాడో అతడు ఆకాశము నుండి పడిపోయినట్లే. పక్షులు అతని మాంసమును,అతని ఎముకలను ఎత్తుకుని పోవచ్చు. లేదా గాలి అతనిని దూర ప్రదేశములో విసిరి వేయవచ్చు.
تفسیرهای عربی:
ذٰلِكَ ۗ— وَمَنْ یُّعَظِّمْ شَعَآىِٕرَ اللّٰهِ فَاِنَّهَا مِنْ تَقْوَی الْقُلُوْبِ ۟
ఇది దేని గురించైతే అల్లాహ్ ఆదేశించాడో ఆయన ఏకత్వము,ఆయన కొరకు చిత్త శుద్ధి,విగ్రహారాధన,అబద్దపు మాటల నుండి దూరంగా ఉండటం లో నుంచి అన్ని. మరియు ఎవరైతే ధార్మిక సూచనలను గౌరవిస్తాడో వాటిలో నుండి పశువుబలి,హజ్ ఆచారాలు నిశ్ఛయంగా వాటిని గౌరవించటం హృదయములు తమ ప్రభువు కొరకు భీతిలో నుంచి.
تفسیرهای عربی:
لَكُمْ فِیْهَا مَنَافِعُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ مَحِلُّهَاۤ اِلَی الْبَیْتِ الْعَتِیْقِ ۟۠
గృహము వద్ద మీరు జుబహ్ చేసే బలి పశువులలో మీ కొరకు సవారీ చేయటం, ఉన్ని, సంతానము,పాలు లాంటి ప్రయోజనాలు శక్తి వంతులైన వారి ఆధిపత్యం నుండి అల్లాహ్ విముక్తి కలిగించిన అల్లాహ్ గృహము వద్ద దగ్గరలోనే వాటి జుబహ్ చేసే ఒక నిర్ణీత గడువు వరకు కలవు.
تفسیرهای عربی:
وَلِكُلِّ اُمَّةٍ جَعَلْنَا مَنْسَكًا لِّیَذْكُرُوا اسْمَ اللّٰهِ عَلٰی مَا رَزَقَهُمْ مِّنْ بَهِیْمَةِ الْاَنْعَامِ ؕ— فَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَلَهٗۤ اَسْلِمُوْا ؕ— وَبَشِّرِ الْمُخْبِتِیْنَ ۟ۙ
మరియు గతించిన ప్రతీ జాతికి అల్లాహ్ కొరకు సాన్నిధ్యంగా రక్తమును చిందించటానికి అల్లాహ్ వారికి ప్రసాదించిన ఒంటెలు,ఆవులు,గొర్రెలపై అల్లాహ్ కి కృతజ్ఞతగా వారు జుబహ్ చేస్తున్న ఈ బలి పశువులను జుబహ్ చేసేటప్పుడు వాటిపై అల్లాహ్ నామమును వారు పటిస్తారని ఆశిస్తూ ఒక ఆచారమును తయారు చేశాము. ఓ ప్రజలారా మీ సత్య ఆరాధ్య దైవము ఒక్కడే,ఆయనకు ఎవరూ సాటి లేరు. ఆయన ఒక్కడి కొరకే నిమమ్రత,విధేయత ద్వారా విధేయత చూపాలి. ఓ ప్రవక్తా మీరు అణుకువతో చిత్తశుద్ధిని చూపేవారిని వారికి సంతోషమును కలిగించే వార్తను తెలియపరచండి.
تفسیرهای عربی:
الَّذِیْنَ اِذَا ذُكِرَ اللّٰهُ وَجِلَتْ قُلُوْبُهُمْ وَالصّٰبِرِیْنَ عَلٰی مَاۤ اَصَابَهُمْ وَالْمُقِیْمِی الصَّلٰوةِ ۙ— وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟
ఎవరైతే అల్లాహ్ స్మరణ జరిగినప్పుడు ఆయన శిక్ష నుండి భయపడుతారో వారు ఆయన ఆదేశమును వ్యతిరేకించటం నుండి దూరంగా ఉంటారు. మరియు నమాజులను పరిపూర్ణంగా పాటిస్తారు. మరియు ఒక వేళ వారికి ఏదైన ఆపద కలిగితే వారు సహనం చూపుతారు. మరియు వారు అల్లాహ్ తమకు ప్రసాదించిన వాటిలో నుండి పుణ్య మార్గముల్లో ఖర్చు చేస్తారు.
تفسیرهای عربی:
وَالْبُدْنَ جَعَلْنٰهَا لَكُمْ مِّنْ شَعَآىِٕرِ اللّٰهِ لَكُمْ فِیْهَا خَیْرٌ ۖۗ— فَاذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَیْهَا صَوَآفَّ ۚ— فَاِذَا وَجَبَتْ جُنُوْبُهَا فَكُلُوْا مِنْهَا وَاَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ ؕ— كَذٰلِكَ سَخَّرْنٰهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
మరియు గృహము వైపునకు (కాబతుల్లాహ్) తిసుకెళ్ళే బలి పశువులైన ఒంటెలను,ఆవులను మేము వాటిని మీ కొరకు ధర్మ సూచనలుగా,దాని చిహ్నాలుగా చేశాము. మీ కొరకు వాటిలో ధార్మిక,ప్రాపంచిక ప్రయోజనాలు కలవు. అయితే మీరు వాటి కాళ్ళ పై తిన్నగా నిలబడిన తరువాత అది చలించకుండా ఉండేందుకు వాటి రెండు చేతుల్లోంచి ఒక దానిని కట్టివేశి అది నిలబడిన స్థితిలో వాటిని జుబాహ్ చేసేటప్పుడు అల్లాహ్ నామమును పలకండి. జుబాహ్ చేసిన తరువాత అది దాని ప్రక్కపై క్రింద పడినప్పుడు ఓ ఖుర్బానీ ఇచ్చేవారా మీరు అందులో నుండి తినండి. మరియు అడగని వారైన పేద వారికి,అందులో నుండి ఇవ్వబడటానికి బహిర్గతం చేసే పేద వాడికి అందులో నుండి మీరు ఇవ్వండి. మీరు వాటిపై బరువు మోయటానికి,వాటిపై సవారీ చేయటానికి మేము వాటిని మీకు ఆదీనంలో చేసినట్లే మేము వాటిని మీకొరకు లోబరచాము. ఏవిధంగా నంటే మీరు వాటిని అల్లాహ్ సాన్నిధ్యం కొరకు ఎక్కడ జుబాహ్ చేయదలచుకుంటే మీకు లోబడి ఉంటాయి. బహుశా మీరు వాటిని మీకొరకు లోబడి ఉన్నట్లుగా చేసి అనుగ్రహించిన వాటిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటారని.
تفسیرهای عربی:
لَنْ یَّنَالَ اللّٰهَ لُحُوْمُهَا وَلَا دِمَآؤُهَا وَلٰكِنْ یَّنَالُهُ التَّقْوٰی مِنْكُمْ ؕ— كَذٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللّٰهَ عَلٰی مَا هَدٰىكُمْ ؕ— وَبَشِّرِ الْمُحْسِنِیْنَ ۟
మీరు సమర్పించుకునే బలిపశువుల మాంసముగాని రక్తముగాని అల్లాహ్ కి చేరవు,ఆయన వైపునకు లేపబడవు. కాని వాటి విషయంలో అల్లాహ్ పట్ల మీ భీతి ఆయన వైపునకు లేపబడుతుంది. ఎందుకంటే మీరు వాటి ద్వారా ఆయన సామిప్యమును పొందటం కొరకు మీరు విధేయత చూపటంలో ఆయన కొరకు చిత్తశుద్ధిని కనబరచారు. ఈ విధంగా అల్లాహ్ వాటిని మీరు ఆల్లాహ్ కే ఆయన మీకు అనుగ్రహించిన సత్యము పై కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన గొప్పతనాన్ని తెలియపరచటానికి మీకు లోబరచాడు. ఓ ప్రవక్తా తమ ప్రభువు కొరకు తమ ఆరాధనల్లో,ఆయన సృష్టితాలతో తాము వ్యవహరించే విషయంలో మంచిగా చేసేవారిని వారికి సంతోషమును కలిగించే వార్తను మీరు తెలియపరచండి.
تفسیرهای عربی:
اِنَّ اللّٰهَ یُدٰفِعُ عَنِ الَّذِیْنَ اٰمَنُوْا ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُوْرٍ ۟۠
నిశ్ఛయంగా అల్లాహ్ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారి నుండి వారి శతృవుల కీడును తొలగిస్తాడు. నిశ్ఛంగా అల్లాహ్ తన అమానత్ లో విశ్వాసఘాతుకానికి పాల్పడే,అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నడుగా ఉండే ప్రతీ వ్యక్తిని ఇష్టపడడు. అతడు వాటిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోడు. అంతే కాదు ఆయన అతడిని ద్వేషిస్తాడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• ضَرْب المثل لتقريب الصور المعنوية بجعلها في ثوب حسي، مقصد تربوي عظيم.
నైతిక రూపాలకు దగ్గర చేయటానికి ఇంద్రియ వస్త్రములో చేయటం ద్వారా ఉపమానములివ్వటం పోషణ చేసే గొప్ప ఉద్దేశము.

• فضل التواضع.
వినయం యొక్క ప్రాముఖ్యత

• الإحسان سبب للسعادة.
ధాతృత్వం ఆనందానికి ఒక కారణం.

• الإيمان سبب لدفاع الله عن العبد ورعايته له.
అల్లాహ్ దాసుడిని సంరక్షించటానికి మరియు అతనిని జాగ్రత్తగా చూసుకోవటానికి విశ్వాసము ఒక కారణం.

اُذِنَ لِلَّذِیْنَ یُقٰتَلُوْنَ بِاَنَّهُمْ ظُلِمُوْا ؕ— وَاِنَّ اللّٰهَ عَلٰی نَصْرِهِمْ لَقَدِیْرُ ۟ۙ
అల్లాహ్ ఆ విశ్వాసపరుల కొరకు ఎవరితోనైతే ముష్రికులు యధ్ధము చేస్తారో యుధ్ధము కొరకు అనుమతించాడు. ఎందుకంటే వారిపై వారి శతృవుల హింస వాటిల్లింది. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ విశ్వాసపరులకు వారి శతృవులకు వ్యతిరేకంగా యుధ్ధము లేకుండానే సహాయం చేయటంపై సామర్ధ్యం కలవాడు. కాని ఆయన విజ్ఞత విశ్వాసపరులను అవిశ్వాసపరులతో యుధ్ధముతో పరిక్షించాలని నిర్ణయిస్తుంది.
تفسیرهای عربی:
١لَّذِیْنَ اُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ بِغَیْرِ حَقٍّ اِلَّاۤ اَنْ یَّقُوْلُوْا رَبُّنَا اللّٰهُ ؕ— وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِیَعٌ وَّصَلَوٰتٌ وَّمَسٰجِدُ یُذْكَرُ فِیْهَا اسْمُ اللّٰهِ كَثِیْرًا ؕ— وَلَیَنْصُرَنَّ اللّٰهُ مَنْ یَّنْصُرُهٗ ؕ— اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ ۟
ఎవరినైతే అవిశ్వాసపరులు దుర్మార్గంగా వారి ఇళ్ళ నుండి గెంటివేశారో. వారు తమ ప్రభువు అల్లాహ్ అని,మా కొరకు ఆయన తప్పా వేరే ప్రభువు లేడని పలకటం మాత్రమే వారు చేసిన పాపము. ఒక వేళ అల్లాహ్ దైవ ప్రవక్తల కొరకు, విశ్వాసపరుల కొరకు తమ శతృవుల పై యుధ్ధమును ధర్మబద్ధం చేయకుండా ఉంటే వారు ఆరాధన ప్రదేశాలపై దాడికి పాల్పడి సన్యాసుల మఠాలను,క్రైస్తవుల చర్చులను,యూదుల ఆరాధనాలయాలను,ముస్లిముల మస్జిదులు ఏవైతే నమాజు చేయటం కొరకు సిధ్ధం చేయబడి వాటిలో ముస్లిములు అల్లాహ్ స్మరణ ఎక్కువగా చేస్తారో నాశనం చేసేవారు. మరియు అల్లాహ్ తన ధర్మమును,తన ప్రవక్తకు సహాయం చేసేవాడికి తప్పక సహాయం చేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన ధర్మమునకు సహాయం చేసే వాడికి సహాయం చేయటంలో బలవంతుడు,ఆయనపై ఎవరూ ఆధిక్యతను కనబరచని ఆధిక్యుడు.
تفسیرهای عربی:
اَلَّذِیْنَ اِنْ مَّكَّنّٰهُمْ فِی الْاَرْضِ اَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ وَاَمَرُوْا بِالْمَعْرُوْفِ وَنَهَوْا عَنِ الْمُنْكَرِ ؕ— وَلِلّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ ۟
సహాయము ద్వారా వాగ్ధానం చేయబడిన వీరందరు వారే ఎవరినైతే ఒక వేళ మేము వారి శతృవులపై సహాయము చేసి భూమిలో వారికి అధికారమును ప్రసాదిస్తే వారు నమాజును పరిపూర్ణ పధ్ధతిలో పాటిస్తారు,తమ సంపదల నుండి జకాతును చెల్లిస్తారు. మరియు ధర్మం ఆదేశించిన దాన్ని ఆదేశిస్తారు. మరియు అది వారించిన దాన్ని వారిస్తారు. వ్యవహారలు వాటి పరంగా ప్రతిఫలం ప్రసాదించే విషయంలో,శిక్షించే విషయంలో మరలి వెళ్లే చోటు అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది.
تفسیرهای عربی:
وَاِنْ یُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّثَمُوْدُ ۟ۙ
ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు సహనం చూపండి ,జాతి వారు తిరస్కరించిన ప్రవక్తల్లోంచి మీరు మొట్ట మొదటి వారు కాదు. మీ జాతి వారి కన్నా ముందు నూహ్ అలైహిస్సలాం జాతి నూహ్ ను తిరస్కరించింది. ఆద్ జాతి హూద్ అలైహిస్సలాంను తిరస్కరించింది. మరియు సమూద్ జాతి సాలిహ్ అలైహిస్సలాంను తిరస్కరించింది.
تفسیرهای عربی:
وَقَوْمُ اِبْرٰهِیْمَ وَقَوْمُ لُوْطٍ ۟ۙ
మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతి ఇబ్రాహీం అలైహిస్సలాం ను తిరస్కరించింది. మరియు లూత్ అలైహిస్సలాం జాతి లూత్ అలైహిస్సలాంను తిరస్కరించింది.
تفسیرهای عربی:
وَّاَصْحٰبُ مَدْیَنَ ۚ— وَكُذِّبَ مُوْسٰی فَاَمْلَیْتُ لِلْكٰفِرِیْنَ ثُمَّ اَخَذْتُهُمْ ۚ— فَكَیْفَ كَانَ نَكِیْرِ ۟
మరియు మద్యన్ వారు షుఐబ్ అలైహిస్సలాంను తిరస్కరించారు. ఫిర్ఔన్,అతని జాతి వారు మూసా అలైహిస్సలాంను తిరస్కరించారు. అప్పుడు నేను వారి జాతుల వారి నుండి శిక్షను క్రమక్రమంగా తీసుకెళ్ళటానికి ఆలస్యం చేశాను. ఆ తరువాత నేను వారిని శిక్షతో పట్టుకున్నాను. నా శిక్ష వారి పై ఎలా ఉన్నదో మీరు యోచన చేయండి. వారి తిరస్కారము వలన నేను వారిని నాశనం చేశాను.
تفسیرهای عربی:
فَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا وَهِیَ ظَالِمَةٌ فَهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا ؗ— وَبِئْرٍ مُّعَطَّلَةٍ وَّقَصْرٍ مَّشِیْدٍ ۟
అయితే మేము చాలా బస్తీల వారిని కూకటి వేళ్ళతో నాశనం చేసే శిక్ష ద్వారా వినాశనమునకు గురి చేశాము. వారు తమ అవిశ్వాసం వలన దుర్మార్గులుగా ఉండేవారు. అప్పుడు వారి నివాస గృహాలు అందులో ఉండే నివాసుల నుండి ఖాళీ అయి ధ్వంసం అయి ఉన్నాయి. వారి వినాశనము వలన చాలా బావులు వాటి వద్దకు వచ్చే వారి నుండి ఖాళీగా పడి ఉన్నాయి. మరియు ఎత్తైన,అలంకరించబడిన చాలా రాజ భవనములు వాటిలో నివాసముండే వారిని శిక్ష నుండి రక్షించలేక పోయినాయి.
تفسیرهای عربی:
اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَتَكُوْنَ لَهُمْ قُلُوْبٌ یَّعْقِلُوْنَ بِهَاۤ اَوْ اٰذَانٌ یَّسْمَعُوْنَ بِهَا ۚ— فَاِنَّهَا لَا تَعْمَی الْاَبْصَارُ وَلٰكِنْ تَعْمَی الْقُلُوْبُ الَّتِیْ فِی الصُّدُوْرِ ۟
ఏమీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వీరందరు వినాశనమునకు గురైన ఈ బస్తీల గుర్తులను కళ్లారా చూడటానికి భూమిలో సంచరించలేదా ?. అప్పుడు వారు గుణపాఠం నేర్చుకోవటానికి తమ బుద్దులతో యోచన చేసేవారు మరియు హితోపదేశం గ్రహించటానికి వారి గాధలను స్వీకరించే ఉద్దేశంతో వినేవారు. ఎందుకంటే అంధత్వం అనేది కళ్ళ అంధత్వం కాదు. కాని వినాశనమునకు గురి చేసే,అంతమొందించే అంధత్వము అంతర్దృష్టి అంధత్వము. ఏ విధంగా నంటే అది కలిగిన వాడికి గుణపాఠము,హితోపదేశం కలగదు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• إثبات صفتي القوة والعزة لله.
అల్లాహ్ కొరకు బలము,ఆధిక్యత రెండు గుణముల నిరూపణ.

• إثبات مشروعية الجهاد؛ للحفاظ على مواطن العبادة.
ఆరాధన స్థలాల రక్షణ కొరకు ధర్మ యుద్ధం ధర్మబద్ధం చేయబడిందని నిరూపణ.

• إقامة الدين سبب لنصر الله لعبيده المؤمنين.
ధర్మ స్థాపన విశ్వాసపరులైన తన దాసులకి అల్లాహ్ సహాయం కొరకు ఒక కారణం.

• عمى القلوب مانع من الاعتبار بآيات الله.
హృదయముల అంధత్వము అల్లాహ్ ఆయతులతో గుణపాఠము నేర్చుకోవటం నుండి ఆటంకమును కలిగిస్తుంది.

وَیَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِ وَلَنْ یُّخْلِفَ اللّٰهُ وَعْدَهٗ ؕ— وَاِنَّ یَوْمًا عِنْدَ رَبِّكَ كَاَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ ۟
ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుండి అవిశ్వాసపరులు ఇహలోకములో తొందరగా వచ్చే శిక్ష గురించి,పరలోకంలో ఆలస్యంగా వచ్చే శిక్ష గురించి వేటి గురించి అయితే వారికి హెచ్చరించబడినదో మీతో తొందరపెడుతున్నారు. మరియు అల్లాహ్ తాను వారితో చేసిన వాగ్దానమును భంగపరచడు. తొందరగా వచ్చేది వారిపై బదర్ రోజులో వచ్చి పడింది. మరియు నిశ్ఛయంగా ఒక రోజు పరలోకములో శిక్ష అందులో ఉన్న శిక్ష కారణంగా మీరు ఇహ లోకములో లెక్క వేేసే వెయ్యి సంవత్సరముల మాదిరిగా ఉంటుంది.
تفسیرهای عربی:
وَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ اَمْلَیْتُ لَهَا وَهِیَ ظَالِمَةٌ ثُمَّ اَخَذْتُهَا ۚ— وَاِلَیَّ الْمَصِیْرُ ۟۠
మరియు చాలా బస్తీల వారిని శిక్ష నుండి గడువునిచ్చాను. వారు తమ అవిశ్వాసం వలన దుర్మార్గులై ఉన్నారు. వారిని క్రమ క్రమంగా తీసుకెళ్ళటానికి నేను దానిని (శిక్షని) వారిపై తొందర చేయలేదు. ఆ తరువాత నేను వారిని కూకటి వ్రేళ్ళతో పెకిలించే శిక్ష ద్వారా పట్టుకున్నాను. ప్రళయదినాన నా ఒక్కడి వైపే వారి మరలటం ఉన్నది. అప్పుడు వారి అవిశ్వాసం వలన నేను వారికి శాస్వతమైన శిక్షను ప్రసాదిస్తాను.
تفسیرهای عربی:
قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنَّمَاۤ اَنَا لَكُمْ نَذِیْرٌ مُّبِیْنٌ ۟ۚ
ఓ ప్రజలారా నేను మాత్రం మిమ్మల్ని హెచ్చరించేవాడిని,నేను ఇచ్చి పంపించబడిన సందేశాలను మీకు చేరవేస్తాను. నా హెచ్చరించటంలో స్పష్టమైన వాడిని.
تفسیرهای عربی:
فَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِیْمٌ ۟
అయితే ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేస్తారో వారి కొరకు వారి పాపముల మన్నింపు వారి ప్రభువు వద్ద ఉన్నది. వారి కొరకు స్వర్గములో అంతం కాని గౌరవప్రదమైన ఆహారము కలదు.
تفسیرهای عربی:
وَالَّذِیْنَ سَعَوْا فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟
మరియు ఎవరైతే మా ఆయతులను తిరస్కరించటంలో.అల్లాహ్ ను అశక్తుడిని చేస్తారని,అతని నుంచి తప్పించుకుంటారని,అప్పుడు ఆయన వారిని శిక్షించడని అనుకుని ప్రయత్నం చేశారో వారందరు నరక వాసులు. ఏ విధంగా ఒక స్నహితుడు తన స్నేహితునికి అట్టిపెట్టుకుని ఉంటాడో ఆ విధంగా వారు దాన్ని అట్టిపెట్టుకుని ఉంటారు.
تفسیرهای عربی:
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ وَّلَا نَبِیٍّ اِلَّاۤ اِذَا تَمَنّٰۤی اَلْقَی الشَّیْطٰنُ فِیْۤ اُمْنِیَّتِهٖ ۚ— فَیَنْسَخُ اللّٰهُ مَا یُلْقِی الشَّیْطٰنُ ثُمَّ یُحْكِمُ اللّٰهُ اٰیٰتِهٖ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟ۙ
ఓ ప్రవక్తా మేము మీకన్న మునుపు ప్రవక్తల్లోంచి గాని సందేశహరుల్లోంచి గాని ఎవరిని పంపించిన అతను అల్లాహ్ గ్రంధమును చదివినప్పుడు షైతాను అతని ఖిరాఅత్ లో కలుషితం చేసేవాడు దాని వలన అది దైవ వాణి అని ప్రజలకు సందేహం కలిగేది. అప్పుడు అల్లాహ్ షైతాను కలుషితం చేసిన కల్తీని వ్యర్ధ పరచి తన ఆయతులను స్థిరపరిచేవాడు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. తన సృష్టించటంలో,తన తఖ్దీరులో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
تفسیرهای عربی:
لِّیَجْعَلَ مَا یُلْقِی الشَّیْطٰنُ فِتْنَةً لِّلَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْقَاسِیَةِ قُلُوْبُهُمْ ؕ— وَاِنَّ الظّٰلِمِیْنَ لَفِیْ شِقَاقٍ بَعِیْدٍ ۟ۙ
షైతాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖిరాఅత్ లో కల్తీ చేస్తాడు అల్లాహ్ అతని కల్తీని కపటుల కొరకు,ముష్రికుల్లోంచి ఎవరి హృదయములు కఠినమైపోయాయో వారి కొరకు అల్లాహ్ పరీక్షగా చేయటానికి. నిశ్ఛయంగా కపటుల్లోంచి,ముష్రికుల్లోంచి దుర్మార్గులైన వారు అల్లాహ్ కొరకు ,ఆయన ప్రవక్త కొరకు శతృత్వములో ఉన్నారు. మరియు సత్యము నుండి,సన్మార్గము నుండి దూరంగా ఉన్నారు.
تفسیرهای عربی:
وَّلِیَعْلَمَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّكَ فَیُؤْمِنُوْا بِهٖ فَتُخْبِتَ لَهٗ قُلُوْبُهُمْ ؕ— وَاِنَّ اللّٰهَ لَهَادِ الَّذِیْنَ اٰمَنُوْۤا اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మరియు అల్లాహ్ ఎవరికైతే జ్ఞానమును ప్రసాదించాడో వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఖుర్ఆన్ ఓ ప్రవక్తా అది అల్లాహ్ మీ వైపు దైవ వాణి ద్వార చేరవేసిన సత్యం అని తెలుసుకోవాలి. అప్పుడు వారు దానిపై విశ్వాసమును అధికం చేసుకుంటారు,వారి హృదయములు దాని కొరకు అణకువభావమును కలిగి ఉండి భీతిపరులై ఉంటాయి. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ దానిపై విశ్వాసమును కనబరచిన వారికి ఎటువంటి వంకరతనం లేని సత్య మార్గమైన సన్మార్గము వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. దాని కొరకు వారి అణుకువభావమునకు వారికి ప్రతిఫలంగా.
تفسیرهای عربی:
وَلَا یَزَالُ الَّذِیْنَ كَفَرُوْا فِیْ مِرْیَةٍ مِّنْهُ حَتّٰی تَاْتِیَهُمُ السَّاعَةُ بَغْتَةً اَوْ یَاْتِیَهُمْ عَذَابُ یَوْمٍ عَقِیْمٍ ۟
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు మీపై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ విషయంలో పదేపదే సందేహంలో పడి ఉంటారు,వారి వద్దకు వారు అదే స్థితిలో ఉన్నప్పుడు ప్రళయం అకస్మాత్తుగా వచ్చేంత వరకు లేదా ఎటువంటి కారుణ్యము,మేలు లేని దినపు శిక్ష వారిపై వచ్చిపడేంత వరకు దానిపైనే ఉంటారు. మరియు అది వారి కొరకు ప్రళయదినము.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• استدراج الظالم حتى يتمادى في ظلمه سُنَّة إلهية.
దుర్మార్గునికి అతడు తన దుర్మార్గంలో పెరిగిపోయేంత వరకు గడువు నివ్వటం దైవ సంప్రదాయము.

• حفظ الله لكتابه من التبديل والتحريف وصرف مكايد أعوان الشيطان عنه.
మార్పు చేర్పుల నుండి,వక్రీకరణ నుండి,షైతాను సహాయకుల కుతంత్రాల జరపటం నుండి అల్లాహ్ తన గ్రంధమునకు రక్షణ కల్పించటం.

• النفاق وقسوة القلوب مرضان قاتلان.
కపటత్వము,హృదయముల కఠినత్వము రెండు వినాశపూరిత రోగాలు.

• الإيمان ثمرة للعلم، والخشوع والخضوع لأوامر الله ثمرة للإيمان.
విశ్వాసము జ్ఞానము కొరకు ఫలం. మరియు అల్లాహ్ ఆదేశములపై అణకువ,నిమమ్రత విశ్వాసము కొరకు ఫలము.

اَلْمُلْكُ یَوْمَىِٕذٍ لِّلّٰهِ ؕ— یَحْكُمُ بَیْنَهُمْ ؕ— فَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟
ఏ రోజైతే శిక్ష గురించి వాగ్దానం చేయబడ్డ వీరందరు వస్తారో ప్రళయ దినం రోజు అధికారము అల్లాహ్ ఒక్కడి కొరకే. అందులో ఆయనతో తగాదాపడేవాడు ఎవడూ ఉండడు. పరిశుధ్ధుడైన ఆయన విశ్వాసపరులకీ,అవిశ్వాసపరులకి మధ్య తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన వారిలో నుండి ప్రతి ఒక్కరి కొరకు వారు దేనికి హక్కుదారులో దాని తీర్పునిస్తాడు. అయితే ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యాలు చేశారో వారి కొరకు గొప్ప పుణ్యము కలదు. అది అంతముకాని శాస్వతమైన అనుగ్రహాలు కల స్వర్గ వనాలు.
تفسیرهای عربی:
وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَا فَاُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۟۠
మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారి కొరకు పరాభవమునకు గురి చేసే శిక్ష కలదు. అల్లాహ్ దాని ద్వారా వారిని నరకములో అవమానమునకు గురి చేస్తాడు.
تفسیرهای عربی:
وَالَّذِیْنَ هَاجَرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ قُتِلُوْۤا اَوْ مَاتُوْا لَیَرْزُقَنَّهُمُ اللّٰهُ رِزْقًا حَسَنًا ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ మన్నతను ఆశిస్తూ,ఆయన ధర్మమునకు ఆధిక్యతను కలిగించటానికి తమ ఇండ్లను,తమ భూములను వదిలి వేశారో, ఆ తరువాత ఆయన మార్గములో యుధ్ధములో అమరగతి పొందబడ్డారో లేదా మరణించారో వారికి అల్లాహ్ తప్పకుండా స్వర్గములో అంతము కాని శాస్వతమైన మంచి ఆహారమును ప్రసాదిస్తాడు. మరియు నిశ్ఛయంగా పరిశుధ్ధుడైన అల్లాహ్ ఆయనే మంచి ఆహారమును ప్రసాదించే వాడు.
تفسیرهای عربی:
لَیُدْخِلَنَّهُمْ مُّدْخَلًا یَّرْضَوْنَهٗ ؕ— وَاِنَّ اللّٰهَ لَعَلِیْمٌ حَلِیْمٌ ۟
అల్లాహ్ వారిని తప్పకుండా వారు సంతుష్టపడే ప్రదేశము అయిన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ వారి కార్యాలను,వారి సంకల్పాలను బాగా తెలిసినవాడు. సహనశీలుడు అందుకనే వారు చేసిన దానికి వారిని శిక్షించటంలో తొందరచేయడు.
تفسیرهای عربی:
ذٰلِكَ ۚ— وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوْقِبَ بِهٖ ثُمَّ بُغِیَ عَلَیْهِ لَیَنْصُرَنَّهُ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ ۟
ఈ ప్రస్తావించబడినది అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన వారిని స్వర్గంలో ప్రవేశింపజేయటం, బాధించిన వాడితో అతడు బాధించినంత ప్రతీకారం తీసుకునే అనుమతి ఆ విషయంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఒక వేళ బాధించేవాడు తన బాధ పెట్టటంను మరల చేస్తే నిశ్ఛయంగా అల్లాహ్ బాధింపబడిన వాడికి సహాయం చేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ విశ్వాసపరుల పాపములను మన్నించేవాడును,వారిని క్షమించేవాడును.
تفسیرهای عربی:
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَیُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ وَاَنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟
బాధితునికి ఆ సహాయముంటుంది ఎందుకంటే అల్లాహ్ తాను కోరిన దానిపై సామర్ధ్యం కలవాడు. రాత్రిని పగలులో మరియు పగలును రాత్రిలో ఒక దానిని ఇంకొక దానిపై అధికం చేయటం ద్వారా ప్రవేశింపజేయటం ఆయన సామర్ధ్యంలో నుంచే. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడును,వారి కర్యాల గురించి బాగా తెలిసిన వాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
تفسیرهای عربی:
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّ مَا یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ هُوَ الْبَاطِلُ وَاَنَّ اللّٰهَ هُوَ الْعَلِیُّ الْكَبِیْرُ ۟
ఈ ప్రస్తావించబడిన అల్లాహ్ రాత్రిని పగలులో,పగలును రాత్రిలో ప్రవేశింపజేయటం అన్నది ఎందుకంటే అల్లాహ్ ఆయనే సత్యము,ఆయన ధర్మము సత్యము, ఆయన వాగ్దానము సత్యము,విశ్వాసపరులకు ఆయన సహాయము సత్యము. మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి వేటినైతే పూజిస్తున్నారో ఆ విగ్రహాలు ఎటువంటి పునాది లేని అసత్యము. మరియు అల్లాహ్ తన సృష్టితాలపై ఉనికిని బట్టి,స్థానమును బట్టి,ఆధిక్యతను బట్టి ఆయనే ఉన్నతుడు. తన కొరకు పెద్దరికము,గొప్పతనము,మహత్యము కల గొప్పవాడు.
تفسیرهای عربی:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؗ— فَتُصْبِحُ الْاَرْضُ مُخْضَرَّةً ؕ— اِنَّ اللّٰهَ لَطِیْفٌ خَبِیْرٌ ۟ۚ
ఓ ప్రవక్తా మీరు చూడలేదా అల్లాహ్ ఆకాశము నుండి వర్షాన్ని కురిపించాడు. అప్పుడు భూమి దానిపై వర్షం కురిసిన తరువాత అది తనపై మొక్కలను మొలకెత్తించటం ద్వారా పచ్చగా అయిపోయింది. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల పట్ల సూక్ష్మగ్రాహి అప్పుడే ఆయన వారి కొరకు వర్షమును కురిపించాడు. మరియు భూమి వారి కొరకు మొలకెత్తింది. వారి ప్రయోజనాల గురించి తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
تفسیرهای عربی:
لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟۠
ఆకాశముల్లో ఉన్నసమస్తము యొక్క అధికారము,భూమిలో ఉన్న సమస్తము యొక్క అధికారము ఆయన ఒక్కడి కొరకే. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ ఆయనే తన సృష్టితాల్లోంచి ఏ సృష్టి అవసరం లేని స్వయం సమృద్ధుడు,అన్ని పరిస్థితుల్లో ప్రశంసనీయుడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• مكانة الهجرة في الإسلام وبيان فضلها.
ఇస్లాంలో హిజ్రత్ (వలసపోటం) యొక్క స్థానము,దాని ఘనత యొక్క ప్రకటన.

• جواز العقاب بالمثل.
సమానంగా శిక్షను విధించటం సమ్మతము.

• نصر الله للمُعْتَدَى عليه يكون في الدنيا أو الآخرة.
అల్లాహ్ యొక్క సహాయం బాధితుడికి ఇహలోకములోను,పరలోకములోను ఉంటుంది.

• إثبات الصفات العُلَا لله بما يليق بجلاله؛ كالعلم والسمع والبصر والعلو.
జ్ఞానము,వినటం,చూడటం,గొప్పతనం లాంటి ఉన్నతమైన గుణాలు అల్లాహ్ కొరకు నిరూపణ అవి ఆయన మహత్యమునకు యోగ్యమైనవి.

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِی الْاَرْضِ وَالْفُلْكَ تَجْرِیْ فِی الْبَحْرِ بِاَمْرِهٖ ؕ— وَیُمْسِكُ السَّمَآءَ اَنْ تَقَعَ عَلَی الْاَرْضِ اِلَّا بِاِذْنِهٖ ؕ— اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా మీరు చూడ లేదా అల్లాహ్ భూమిలో ఉన్న జంతువులను,స్థిర రాసులను మీ ప్రయోజనాల కొరకు,మీ అవసరాల కొరకు మీకు మరియుప్రజలకు ఆదీనంలో చేశాడు. మరియు ఆయన ఓడలను మీ ఆదీనంలో చేశాడు అవి సముద్రంలో ఆయన ఆదేశంతో,ఆయన వశపరచటంతో ఒక నగరము నుండి ఇంకొక నగరమునకు నడుస్తున్నాయి. మరియు ఆయన ఆకాశమును ఆయన ఆదేశముతో తప్ప భూమి పై పడకుండా ఉండటానికి ఆపి ఉంచాడు. ఒక వేళ ఆయన దానిని దానిపై పడమని ఆదేశిస్తే అది పడిపోతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రజల పట్ల కనికరించేవాడు,దయ చూపేవాడును. ఎందుకంటే వారిలో నుండి దుర్మార్గులు ఉన్నా కూడా వారి కొరకు ఆయన ఈ వస్తువులను వశపరచాడు.
تفسیرهای عربی:
وَهُوَ الَّذِیْۤ اَحْیَاكُمْ ؗ— ثُمَّ یُمِیْتُكُمْ ثُمَّ یُحْیِیْكُمْ ؕ— اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ ۟
మరియు అల్లాహ్ ఆయనే మీరు ఉనికిలో లేకపోయినా తరువాత మిమ్మల్ని ఉనికిలోకి తీసుకుని వచ్చి మిమ్మల్ని జీవింపజేశాడు. ఆ తరువాత మీ వయస్సులు పూర్తయినప్పుడు ఆయన మీకు మరణాన్ని కలిగింపజేస్తాడు. ఆ తరువాత ఆయన మీ మరణము తరువాత మీ కర్మలపై మీ లెక్క తీసుకుని వాటిపరంగా ఆయన మీకు ప్రతిఫలమును ప్రసాదించటానికి ఆయన మిమ్మల్ని మరల జీవింపజేస్తాడు. నిశ్ఛయంగా మనిషి అల్లాహ్ అనుగ్రహముల పట్ల - అవి ప్రత్యక్షంగా ఉన్నా కూడా - ఆయనతోపాటు ఇతరలకు తన అరాధన ద్వారాఎక్కువగా కృతఘ్నతా వైఖరి కలవాడు.
تفسیرهای عربی:
لِكُلِّ اُمَّةٍ جَعَلْنَا مَنْسَكًا هُمْ نَاسِكُوْهُ فَلَا یُنَازِعُنَّكَ فِی الْاَمْرِ وَادْعُ اِلٰی رَبِّكَ ؕ— اِنَّكَ لَعَلٰی هُدًی مُّسْتَقِیْمٍ ۟
ప్రతీ సమాజము వారికి మేము ఒక ధర్మ శాసనమును తయారు చేశాము. అయితే వారు తమ ధర్మ శాసనం ప్రకారంగా ఆచరిస్తున్నారు. ఓ ప్రవక్తా ముష్రికులు,ఇతర ధర్మాల వారు మీ ధర్మ విషయంలో ఖచ్చితంగా గొడవపడకూడదు. మీరు వారికంటే నీతిమంతులు. ఎందుకంటే వారు అసత్యపరులు. మరియు మీరు ప్రజలను ఏకత్వమును అల్లాహ్ కొరకు ప్రత్యేకించటం వైపునకు పిలవండి. నిశ్ఛయంగా మీరు మాత్రం ఎటువంటి వంకరతనంలేని సన్మార్గంపై ఉన్నారు.
تفسیرهای عربی:
وَاِنْ جٰدَلُوْكَ فَقُلِ اللّٰهُ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ ۟
మరియు వారు ఒక వేళ ఆధారం స్పష్టమైన తరువాత నీతో వాదులాటకు దిగితే నీవు వారిని హెచ్చెరిస్తూ ఇలా పలుకుతూ వారి వ్యవహారమును అల్లాహ్ కు అప్పజెప్పు : మీరు చేసే ఆచరణ గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
تفسیرهای عربی:
اَللّٰهُ یَحْكُمُ بَیْنَكُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
అల్లాహ్ తన దాసుల మధ్య వారిలో నుండి విశ్వాసపరులైన,అవిశ్వాసపరులైన వారు ఇహలోకములో ధర్మ విషయంలో విభేదించుకున్న వాటి గురించి ప్రళయదినాన తీర్పునిస్తాడు.
تفسیرهای عربی:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمَآءِ وَالْاَرْضِ ؕ— اِنَّ ذٰلِكَ فِیْ كِتٰبٍ ؕ— اِنَّ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرٌ ۟
ఓ ప్రవక్తా ఆకాశములో ఉన్న వాటి గురించి,భూమిలో ఉన్నవాటి గురించి అల్లాహ్ కు తెలుసని,వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా లేదని మీకు తెలియదా ?. నిశ్ఛయంగా ఆ జ్ఞానం లౌహె మహ్ఫూజ్ లో నమోదు చేయబడి ఉన్నది. నిశ్ఛయంగా వాటన్నింటి జ్ఞానము అల్లాహ్ పై సులభము.
تفسیرهای عربی:
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّمَا لَیْسَ لَهُمْ بِهٖ عِلْمٌ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ نَّصِیْرٍ ۟
మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. అల్లాహ్ వాటి ఆరాధన గురించి తన గ్రంధముల్లో ఎటువంటి ఆధారమును అవతరింపజేయలేదు. మరియు వారికి వాటిపై జ్ఞానపరంగా ఎటువంటి ఆధారం లేదు. వారి ఆధారం మాత్రం వారి తాత ముత్తాతలను గుడ్డిగా అనుకరించటం. మరియు దుర్మార్గుల కొరకు వారిపై అల్లాహ్ వద్ద నుండి కలిగే శిక్షను వారి నుండి ఆపే ఎటువంటి సహాయకుడూ ఉండడు.
تفسیرهای عربی:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ تَعْرِفُ فِیْ وُجُوْهِ الَّذِیْنَ كَفَرُوا الْمُنْكَرَ ؕ— یَكَادُوْنَ یَسْطُوْنَ بِالَّذِیْنَ یَتْلُوْنَ عَلَیْهِمْ اٰیٰتِنَا ؕ— قُلْ اَفَاُنَبِّئُكُمْ بِشَرٍّ مِّنْ ذٰلِكُمْ ؕ— اَلنَّارُ ؕ— وَعَدَهَا اللّٰهُ الَّذِیْنَ كَفَرُوْا ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟۠
మరియు ఖుర్ఆన్ లోని స్పష్టమైన మా ఆయతులను వారిపై చదివి వినిపించబడినప్పుడు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ముఖముల్లో వాటిని వారు వినేటప్పుడు తమ నుదుట్లను చిట్లించి వాటిని తిరస్కరించటమును నీవు గుర్తిస్తావు. తీవ్ర కోపము వలన వారు మా ఆయతులను వారికి చదివి వినిపించిన వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు కనబడుతారు. ఓ ప్రవక్తా వారితో అనండి : ఏమీ నేను మీ కోపము కన్న,మీ నుదుట్లను చిట్లించటం కన్న చెడ్డదైన దాని గురించి మీకు తెలియపరచనా ?. అది ఆ నరకాగ్ని దేనిలోనైతే అల్లాహ్ అవిశ్వాసపరులకు వారిని అందులో ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేశాడో. మరియు వారు చేరుకునే గమ్య స్థానం ఎంతో చెడ్డదైనది.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• من نعم الله على الناس تسخير ما في السماوات وما في الأرض لهم.
ప్రజలపై ఆకాశముల్లో ఉన్నవి,భూమిలో ఉన్నవి వారి ఆదీనంలో ఉండటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి.

• إثبات صفتي الرأفة والرحمة لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు దయ,కనికరము రెండు లక్షణాల నిరూపణ.

• إحاطة علم الله بما في السماوات والأرض وما بينهما.
ఆకాశముల్లో ఉన్న వాటిని,భూమిలో ఉన్నవాటిని మరియు ఆ రెండింటి మధ్యలో ఉన్నవాటిని అల్లాహ్ జ్ఞానము పరిదిలో తీసుకోవటం.

• التقليد الأعمى هو سبب تمسك المشركين بشركهم بالله.
అంధ అనుకరణ ముష్రికులు అల్లాహ్ తో పాటు తమ సాటికల్పించటమునకు కట్టుబడి ఉండటానికి ఒక కారణం.

یٰۤاَیُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوْا لَهٗ ؕ— اِنَّ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَنْ یَّخْلُقُوْا ذُبَابًا وَّلَوِ اجْتَمَعُوْا لَهٗ ؕ— وَاِنْ یَّسْلُبْهُمُ الذُّبَابُ شَیْـًٔا لَّا یَسْتَنْقِذُوْهُ مِنْهُ ؕ— ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوْبُ ۟
ఓ ప్రజలారా ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది దాన్ని మీరు శ్రద్దతో వినండి మరియు దాని నుండి మీరు గుణపాఠం నేర్చుకోండి. నిశ్ఛయంగా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే విగ్రహాలు,మొదలుగునవి వాటి అశక్తి వలన ఒక ఈగనూ అది చిన్నదైనప్పటికీ సృష్టించలేరు. ఒక వేళ వారందరు కలిసి దాన్ని సృష్టించాలన్నా సృష్టించలేరు. ఈగ వారిపై ఉన్న ఏదైన మంచి వస్తువును,దాని లాంటి దాన్ని ఎత్తుకెళ్ళినా దాని నుండి దాన్ని రక్షించటమునకు వారికి శక్తి లేదు. ఈగను సృష్టించటం నుండి,దాని నుండి తమ వస్తువులను రక్షించటం నుండి వారి బలహీనత వలన దాని కన్న పెద్ద వాటి గురించి వారి బలహీనత స్పష్టమవుతుంది. అలాంటప్పుడు మీరు వాటి బలహీనత ఉన్నా కూడా అల్లాహ్ ను వదిలి వాటిని ఎలా ఆరాధిస్తున్నారు ?!. ఆరాధించబడిన విగ్రహమై ఈ అర్ధించేవాడు ఎవడైతే తన నుండి ఈగ ఏదైతే లాక్కుటుందో దాన్ని కాపాడుకోడో బలహీనుడైపోయాడు. మరియు ఈ అర్ధించబడేవాడు ఏదైతే ఈగ ఉన్నదో బలహీనమైపోయింది.
تفسیرهای عربی:
مَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ؕ— اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ ۟
వారు అల్లాహ్ తో పాటు ఆయన యొక్క కొన్ని సృష్టితాలను ఆరాధన చేసినప్పుడు వారు అల్లాహ్ ను ఏవిధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించలేదు. నిశ్ఛయంగా అల్లాహ్ ఎంతో బలవంతుడు. భూమ్యాకాశములను,వాటిలో ఉన్న వారిని ఆయన సృష్టించటం ఆయన యొక్క బలము,సామర్ధ్యములో నుంచిది. ఆధిక్యుడు ఆయనను ఎవరూ ఓడించలేరు,దీనికి విరుద్ధంగా ముష్రికుల విగ్రహాలు. అవి బలహీనమైనవి,అవమానించబడినవి.అవి ఏమీ సృష్టించవు.
تفسیرهای عربی:
اَللّٰهُ یَصْطَفِیْ مِنَ الْمَلٰٓىِٕكَةِ رُسُلًا وَّمِنَ النَّاسِ ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟ۚ
పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ దైవ దూతల్లోంచి కొందరిని సందేశహరులుగా ఎన్నుకున్నాడు. మరియు అలాగే ప్రజల్లోంచి కొందరిని సందేశహరులుగా ఎన్నుకున్నాడు. అయితే ఆయన జిబ్రయీల్ లాంటి కొంత మంది దైవ దూతలను దైవ ప్రవక్తల వద్దకు సందేశాలను ఇచ్చి పంపిస్తాడు. ఆయన అతన్ని మానవుల్లోంచి సందేశహరుల వద్దకు పంపించాడు. మరియు ఆయన మానవుల్లోంచి ప్రవక్తలను ప్రజల వద్దకు పంపిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తల విషయంలో ముష్రికులు ఏదైతే చెబుతున్నారో వినేవాడును,తన సందేశాలను చేరవేయటానికి ఆయన ఎంచుకున్న వారిని చూసేవాడును.
تفسیرهای عربی:
یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟
పరిశుద్ధుడైన ఆయనకు దైవ దూతల్లోంచి ఆయన ప్రవక్తలు,ప్రజలు వారి సృష్టించబడటమునకు ముందు,వారి మరణము తరువాత వారు దేనిపైనైతే ఉన్నారో తెలుసు. ప్రళయ దినాన వ్యవహారాలన్ని ఒక్కడైన అల్లాహ్ వైపునకే మరలించబడుతాయి. ఎప్పుడైతే ఆయన తన దాసులను మరణాంతరం లేపుతాడో వారు ముందు చేసుకున్న కర్మల పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
تفسیرهای عربی:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا ارْكَعُوْا وَاسْجُدُوْا وَاعْبُدُوْا رَبَّكُمْ وَافْعَلُوا الْخَیْرَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటి ద్వారా ఆచరించేవారా మీరు మీ నమాజులలో ఒక్కడైన అల్లాహ్ కొరకే రుకూ చేయండి,సాష్టాంగపడండి. మరియు మీరు కోరుకున్న దాని ద్వారా సాఫల్యం పొందుతారని,మీరు భయపడే వాటి నుండి విముక్తి చెందుతారని ఆశిస్తూ మీరు దానధర్మాలు,బంధుత్వాలను కలపటం లాంటి మంచి కార్యాలను చేయండి.
تفسیرهای عربی:
وَجَاهِدُوْا فِی اللّٰهِ حَقَّ جِهَادِهٖ ؕ— هُوَ اجْتَبٰىكُمْ وَمَا جَعَلَ عَلَیْكُمْ فِی الدِّیْنِ مِنْ حَرَجٍ ؕ— مِلَّةَ اَبِیْكُمْ اِبْرٰهِیْمَ ؕ— هُوَ سَمّٰىكُمُ الْمُسْلِمِیْنَ ۙ۬— مِنْ قَبْلُ وَفِیْ هٰذَا لِیَكُوْنَ الرَّسُوْلُ شَهِیْدًا عَلَیْكُمْ وَتَكُوْنُوْا شُهَدَآءَ عَلَی النَّاسِ ۖۚ— فَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاعْتَصِمُوْا بِاللّٰهِ ؕ— هُوَ مَوْلٰىكُمْ ۚ— فَنِعْمَ الْمَوْلٰی وَنِعْمَ النَّصِیْرُ ۟۠
మరియు మీరు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటమును చిత్తశుద్ధితో ఆయన మన్నత కొరకు చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మరియు ఆయన మీ ధర్మమును అందులో ఎటువంటి ఇబ్బంది గాని,కఠినత్వమును గాని లేకుండా సులభతరంగా చేశాడు. ఈ సులభతరమైన ధర్మమే మీ తండ్రి అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మము. మరియు ఆయన పూర్వ గ్రంధాల్లో,ఖుర్ఆన్ లో మిమ్మల్ని ముస్లిములని నామకరణం చేశాడు. ప్రవక్త తనకు ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడినదో వాటిని మీకు చేరవేశారని మీపై సాక్షిగా అవటానికి మరియు మీరు పూర్వ జాతుల వారిపై వారి ప్రవక్తలు వారికి సందేశాలు చేరవేశారని అనటమునకు సాక్షిగా అవటానికి. అయితే మీరు దానిపై నమాజులను పరిపూర్ణ పధ్ధతిలో పాటించటం ద్వారా అల్లాహ్ కి కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు మీరు మీ సంపదల నుండి జకాతును చెల్లించండి. మీరు అల్లాహ్ తో మొరపెట్టుకోండి,మీ వ్యవహారముల్లో ఆయనపైనే నమ్మకమును కలిగి ఉండండి. పరిశుద్ధుడైన ఆయన తాను విశ్వాసపరుల్లోంచి ఎవరినైతే రక్షిస్తాడో వారి కొరకు ఎంతో శ్రేష్టమైన సంరక్షకుడు. మరియు వారిలో నుండి ఆయనను సహాయమును అర్ధించే వారి కొరకు శ్రేష్టమైన సహాయం చేసేవాడు. అయితే మీరు ఆయన రక్షణనే కోరుకోండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మరియు ఆయనతోనే సహాయమును అర్ధించండి ఆయన మీకు సహాయం చేస్తాడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• أهمية ضرب الأمثال لتوضيح المعاني، وهي طريقة تربوية جليلة.
అర్ధాలను స్పష్టపరచటానికి ఉదాహరణలను ఇవ్వటం యొక్క ప్రాముఖ్యత. మరియు ఇది గొప్ప పోషణా పద్దతి.

• عجز الأصنام عن خلق الأدنى دليل على عجزها عن خلق غيره.
అల్పమైన దాన్ని సృష్టించటం లో విగ్రహాల బలహీనత ఇతర వాటిని సృష్టించటంలో వాటి బలహీనతకు ఆధారము.

• الإشراك بالله سببه عدم تعظيم الله.
అల్లాహ్ తో పాటు సాటి కల్పించటమునకు కారణం అల్లాహ్ ను గౌరవించకపోవటం.

• إثبات صفتي القوة والعزة لله، وأهمية أن يستحضر المؤمن معاني هذه الصفات.
అల్లాహ్ కొరకు బలము,ఆధిక్యత రెండు గుణములను నిరూపించటం,ఈ గుణముల అర్ధములను విశ్వాసపరుడు గుర్తుంచుకోవటం యొక్క ప్రాముఖ్యత.

 
ترجمهٔ معانی سوره: سوره حج
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - لیست ترجمه ها

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بستن