Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​ * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ម៉ាអ៊ីដះ   អាយ៉ាត់:
وَقَالَتِ الْیَهُوْدُ وَالنَّصٰرٰی نَحْنُ اَبْنٰٓؤُا اللّٰهِ وَاَحِبَّآؤُهٗ ؕ— قُلْ فَلِمَ یُعَذِّبُكُمْ بِذُنُوْبِكُمْ ؕ— بَلْ اَنْتُمْ بَشَرٌ مِّمَّنْ خَلَقَ ؕ— یَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَیُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ— وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ؗ— وَاِلَیْهِ الْمَصِیْرُ ۟
మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: "మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము."[1] (వారితో) ఇలా అను: "అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది."
[1] యూదులు 'ఉజైర్ ('అ.స.)ను మరియు క్రైస్తవులు 'ఈసా ('అ.స.)ను అల్లాహ్; లేక అల్లాహుతా'ఆలా కుమారులు అంటారు. మరియు యూదులు తమను తాము అల్లాహుతా'ఆలా సంతానంగా చెప్పుకుంటారు. ఈ ఆయత్ వారి ఈ వాదాన్ని ఖండిస్తోంది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یٰۤاَهْلَ الْكِتٰبِ قَدْ جَآءَكُمْ رَسُوْلُنَا یُبَیِّنُ لَكُمْ عَلٰی فَتْرَةٍ مِّنَ الرُّسُلِ اَنْ تَقُوْلُوْا مَا جَآءَنَا مِنْ بَشِیْرٍ وَّلَا نَذِیْرٍ ؗ— فَقَدْ جَآءَكُمْ بَشِیْرٌ وَّنَذِیْرٌ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంత కాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశహరుడు (ముహమ్మద్) మీ వద్దకు వచ్చాడు. మీరు : "మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు." అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చి వున్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ جَعَلَ فِیْكُمْ اَنْۢبِیَآءَ وَجَعَلَكُمْ مُّلُوْكًا ۗ— وَّاٰتٰىكُمْ مَّا لَمْ یُؤْتِ اَحَدًا مِّنَ الْعٰلَمِیْنَ ۟
మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు.[1] మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు."
[1] ఉదాహరణకు సులైమాన్ ('అ.స.) ప్రవక్త మరియు సార్వభౌముడు (రాజు) కూడా, దీనితో విశదమయ్యేదేమిటంటే అల్లాహ్ (సు.తా.) యే రాజులను కూడా ఎన్నుకుంటాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یٰقَوْمِ ادْخُلُوا الْاَرْضَ الْمُقَدَّسَةَ الَّتِیْ كَتَبَ اللّٰهُ لَكُمْ وَلَا تَرْتَدُّوْا عَلٰۤی اَدْبَارِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِیْنَ ۟
"నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమి (ఫలస్తీన్) లో ప్రవేశించండి. వెనుకకు మరలి రాకండి, అలా చేస్తే నష్టపడి తిరిగి రాగలరు."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالُوْا یٰمُوْسٰۤی اِنَّ فِیْهَا قَوْمًا جَبَّارِیْنَ ۖۗ— وَاِنَّا لَنْ نَّدْخُلَهَا حَتّٰی یَخْرُجُوْا مِنْهَا ۚ— فَاِنْ یَّخْرُجُوْا مِنْهَا فَاِنَّا دٰخِلُوْنَ ۟
(అప్పుడు) వారన్నారు: "ఓ మూసా! నిశ్చయంగా, అందులో బలిష్ఠులైన ప్రజలు (అమాలేకీయులు) ఉన్నారు. మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోనంత వరకు, మేము అందులో ఏ మాత్రమూ ప్రవేశించము; ఒకవేళ వారు వెళ్ళిపోతే మేము తప్పక ప్రవేశిస్తాము."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ رَجُلٰنِ مِنَ الَّذِیْنَ یَخَافُوْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمَا ادْخُلُوْا عَلَیْهِمُ الْبَابَ ۚ— فَاِذَا دَخَلْتُمُوْهُ فَاِنَّكُمْ غٰلِبُوْنَ ۚ۬— وَعَلَی اللّٰهِ فَتَوَكَّلُوْۤا اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
(అప్పుడు) భయపడేవారిలో నుండి అల్లాహ్ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: "ద్వారం నుండి పోయి వారిపై దాడి చేయండి.[1] మీరు లోనికి ప్రవేశించారంటే నిశ్చయంగా, విజయం మీదే! మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకోండి."
[1] ఆ ఇద్దరు వ్యక్తులు యూషా బిన్-నూన్ మరియు కాలిబ్ బిన్-యూ'హన్నా (Joshua & Caleb). వీరు కానన్ ను పరిశీలించటానికి ఎన్నుకోబడిన పన్నెండు మందిలో నుండి ఇద్దరు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ម៉ាអ៊ីដះ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​ - សន្ទស្សន៍នៃការបកប្រែ

បកប្រែដោយលោកអាប់ឌុររ៉ហុីម ពិន ម៉ូហាំម៉ាត់

បិទ