Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​ * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ម៉ាអ៊ីដះ   អាយ៉ាត់:
قَالُوْا یٰمُوْسٰۤی اِنَّا لَنْ نَّدْخُلَهَاۤ اَبَدًا مَّا دَامُوْا فِیْهَا فَاذْهَبْ اَنْتَ وَرَبُّكَ فَقَاتِلَاۤ اِنَّا هٰهُنَا قٰعِدُوْنَ ۟
వారన్నారు: "ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ رَبِّ اِنِّیْ لَاۤ اَمْلِكُ اِلَّا نَفْسِیْ وَاَخِیْ فَافْرُقْ بَیْنَنَا وَبَیْنَ الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟
(దానికి మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధికారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పు చేయి (మమ్మల్ని ఈ అవిదేయుల నుండి దూరం చేయి)."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَیْهِمْ اَرْبَعِیْنَ سَنَةً ۚ— یَتِیْهُوْنَ فِی الْاَرْضِ ؕ— فَلَا تَاْسَ عَلَی الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟۠
(అల్లాహ్) అన్నాడు: "ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు.[1] కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు."
[1] ఆ భూమి పేరు 'తై' మైదానం. నలభై సంవత్సరాల వరకు యూదులు ఆ మైదానంలో తిరుగుతూ ఉండి, చివరకు ఫలస్తీన్ లోకి ప్రవేశించినప్పుడు మూసా ('అ.స.) అనుచరులలో కేవలం ఈ ఇద్దరు పెద్దలే మిగిలారు. యూషా బిన్-నూన్, మూసా ('అ.స.) తరువాత, అతని స్థానంలో 'ఖలీపా అయ్యారు. కాలిబ్ బిన్-యూ'హన్నా అతనికి కుడిభుజం అయ్యారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ ابْنَیْ اٰدَمَ بِالْحَقِّ ۘ— اِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ اَحَدِهِمَا وَلَمْ یُتَقَبَّلْ مِنَ الْاٰخَرِ ؕ— قَالَ لَاَقْتُلَنَّكَ ؕ— قَالَ اِنَّمَا یَتَقَبَّلُ اللّٰهُ مِنَ الْمُتَّقِیْنَ ۟
మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల[1] (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్ కు) బలి (ఖుర్బానీ) ఇచ్చి నప్పుడు ఒకని (హాబిల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: "నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను." (దానికి హాబీల్) అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు.
[1] హాబిల్ మరియు ఖాబిల్ ఆదమ్ ('అ.స.) యొక్క ఇద్దరు కుమారులు. బైబిల్ లో వీరు ఏబిల్ (Abel) మరియు కేన్ (Cain)గా పేర్కొనబడ్డారు. హాబిల్ (Abel) ను ఖాబిల్ (Cain) చంపాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَىِٕنْۢ بَسَطْتَّ اِلَیَّ یَدَكَ لِتَقْتُلَنِیْ مَاۤ اَنَا بِبَاسِطٍ یَّدِیَ اِلَیْكَ لِاَقْتُلَكَ ۚ— اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ ۟
ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నా చేయి నీ వైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కు భయపడుతున్నాను.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنِّیْۤ اُرِیْدُ اَنْ تَبُوَْاَ بِاِثْمِیْ وَاِثْمِكَ فَتَكُوْنَ مِنْ اَصْحٰبِ النَّارِ ۚ— وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۟ۚ
నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَطَوَّعَتْ لَهٗ نَفْسُهٗ قَتْلَ اَخِیْهِ فَقَتَلَهٗ فَاَصْبَحَ مِنَ الْخٰسِرِیْنَ ۟
చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబీల్ ను) చంపి నష్టం పొందిన వారిలో చేరి పోయాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَبَعَثَ اللّٰهُ غُرَابًا یَّبْحَثُ فِی الْاَرْضِ لِیُرِیَهٗ كَیْفَ یُوَارِیْ سَوْءَةَ اَخِیْهِ ؕ— قَالَ یٰوَیْلَتٰۤی اَعَجَزْتُ اَنْ اَكُوْنَ مِثْلَ هٰذَا الْغُرَابِ فَاُوَارِیَ سَوْءَةَ اَخِیْ ۚ— فَاَصْبَحَ مِنَ النّٰدِمِیْنَ ۟
అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబీల్) : "అయ్యో, నా పాడుగాను! నేను ఈ కాకి పాటి వాణ్ణి కూడా కాలేక పోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతక లేక పోయాను కదా!" అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాప పడే వారిలో చేరి పోయాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ម៉ាអ៊ីដះ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​ - សន្ទស្សន៍នៃការបកប្រែ

បកប្រែដោយលោកអាប់ឌុររ៉ហុីម ពិន ម៉ូហាំម៉ាត់

បិទ