Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಯೂನುಸ್   ಶ್ಲೋಕ:
وَقَالَ فِرْعَوْنُ ائْتُوْنِیْ بِكُلِّ سٰحِرٍ عَلِیْمٍ ۟
మరియు ఫిర్ఔన్ తన జాతివారితో ఇలా ఆదేశించాడు : మీరు మంత్రజాలమును తెలిసి,దానిలో నేర్పరి అయిన ప్రతీ మాంత్రికుడిని నా వద్దకు తీసుకుని రండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالَ لَهُمْ مُّوْسٰۤی اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ ۟
వారు ఫిర్ఔన్ వద్దకు మాంత్రికులను తీసుకుని వచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం వారిపై తన గెలుపు నమ్మకముతో వారితో ఓ మాంత్రికులారా మీరు విసరదలచుకున్న వాటిని విసరండి అని పలికారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَلَمَّاۤ اَلْقَوْا قَالَ مُوْسٰی مَا جِئْتُمْ بِهِ ۙ— السِّحْرُ ؕ— اِنَّ اللّٰهَ سَیُبْطِلُهٗ ؕ— اِنَّ اللّٰهَ لَا یُصْلِحُ عَمَلَ الْمُفْسِدِیْنَ ۟
ఎప్పుడైతే వారు తమ వద్ద ఉన్నమంత్రజాలమును విసిరారో మూసా వారితో ఇలా పలికారు : మీరు ప్రదర్శించినది అది మంత్రజాలము.నిశ్ఛయంగా అల్లాహ్ మీరు తయారు చేసిన దాన్ని ఎటువంటి ప్రభావము లేకుండా భంగపరుస్తాడు.నిశ్ఛయంగా మీరు మీ మంత్రజాలము ద్వారా భూమిలో ఉపద్రవం సృష్టిస్తున్నారు.మరియు అల్లాహ్ ఉపద్రవాలను సృష్టించే వాడి కార్యమును చక్కదిద్దడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَیُحِقُّ اللّٰهُ الْحَقَّ بِكَلِمٰتِهٖ وَلَوْ كَرِهَ الْمُجْرِمُوْنَ ۟۠
మరియు అల్లాహ్ సత్యాన్ని నిరూపిస్తాడు.మరియు దానికి ఆయన తన విధిరాత మాటల ద్వారా,తన ధర్మపరమైన మాటల్లో ఉన్న వాదనలు,ఋజువుల ద్వారా నిరూపిస్తాడు.ఒకవేళ ఫిర్ఔన్ సంతతిలో నుండి ఆ అపరాదులైన అవిశ్వాసపరులు అయిష్టత చూపినా సరే.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَمَاۤ اٰمَنَ لِمُوْسٰۤی اِلَّا ذُرِّیَّةٌ مِّنْ قَوْمِهٖ عَلٰی خَوْفٍ مِّنْ فِرْعَوْنَ وَمَلَاۡىِٕهِمْ اَنْ یَّفْتِنَهُمْ ؕ— وَاِنَّ فِرْعَوْنَ لَعَالٍ فِی الْاَرْضِ ۚ— وَاِنَّهٗ لَمِنَ الْمُسْرِفِیْنَ ۟
జాతివారు విముఖత చూపటంపై కృతనిశ్ఛయం చేసుకున్నారు.అయితే మూసా అలైహిస్సలాం బహిరంగ సూచనలు,స్పష్టమైన వాదనలు తీసుకుని వచ్చినా కూడా ఒకవేళ తమ విషయం బహిర్గతం అయతే ఫిర్ఔన్,అతని జాతి పెద్దలు వారిని శిక్షించి వారి విశ్వాసము నుండి మరలింపజేస్తారని భయపడుతూ ఆయన జాతి వారి అయిన బనీ యిస్రాయీల్ లోంచి కొందరు యువకులు తప్ప విశ్వసించలేదు.నిశ్ఛయంగా ఫిర్ఔన్ అహంకారి,ఈజిప్టు పై,దాని వాసులపై ఆధిపత్యమును చూపేవాడు.మరియు నిశ్ఛయంగా అతడు అవిశ్వాసములో,బనీయిస్రాయీలును హతమార్చటంలో శిక్షించటంలో హద్దును అతిక్రమించేవారిలోంచి ఉన్నాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَقَالَ مُوْسٰی یٰقَوْمِ اِنْ كُنْتُمْ اٰمَنْتُمْ بِاللّٰهِ فَعَلَیْهِ تَوَكَّلُوْۤا اِنْ كُنْتُمْ مُّسْلِمِیْنَ ۟
మరియు మూసా అలైహిస్సలాం తన జాతివారిని ఉద్దేశించి ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఒకవేళ మీరు అల్లాహ్ పై సత్య విశ్వాసమును కలిగి ఉంటే,ఒక వేళ ముస్లిములైతే ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి.అల్లాహ్ పై నమ్మకము మీ నుండి చెడును దూరం చేస్తుంది.మరియు మీ కొరకు మేలును తీసుకుని వస్తుంది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَقَالُوْا عَلَی اللّٰهِ تَوَكَّلْنَا ۚ— رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۟ۙ
అయితే వారు మూసా అలైహిస్సలాంకు ఇలా పలుకుతూ జవాబు ఇచ్చారు : ఒక్కడైన అల్లాహ్ పై మేము నమ్మకమును కలిగి ఉన్నాము.ఓ మా ప్రభువా శిక్షించటం ద్వారా,హత్య చేయటం ద్వారా,రెచ్చగొట్టటం ద్వారా మమ్మల్ని మా ధర్మ విషయంలో వేదించటానికి మాపై దుర్మార్గులకు ఆధిక్యతను ప్రసాధించకు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟
ఓ మాప్రభువా నీ కారుణ్యము ద్వారా అవిశ్వాసపరులైన ఫిర్ఔన్ చెర నుండి మమ్మల్ని విముక్తి కలిగించు.వారు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు.మరియు వారు శిక్షించటం ద్వారా,హతమార్చటం ద్వారా మమ్మల్ని బాధ కలిగించారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰی وَاَخِیْهِ اَنْ تَبَوَّاٰ لِقَوْمِكُمَا بِمِصْرَ بُیُوْتًا وَّاجْعَلُوْا بُیُوْتَكُمْ قِبْلَةً وَّاَقِیْمُوا الصَّلٰوةَ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟
మరియు మేము మూసా,ఆయన సోధరుడు హారూన్ అలైహిమస్సలాం వైపునకు మీరిద్దరూ ఒక్కడైన అల్లాహ్ ఆరాధన కొరకు మీ జాతివారి కొరకు గృహములను ఎంచుకొని నిర్మించుకోండి అని దివ్యజ్ఞానమును పంపాము. మరియు మీరు మీ గృహములను ఖిబ్లాకి (బైతుల్ మఖ్దిస్) అబిముఖంగా చేసుకోండి. మరియు మీరు నమాజులను సంపూర్ణంగా నిర్వర్తించండి. ఓ మూసా విశ్వాసపరులకు వారిని సంతోషము కలిగించే అల్లాహ్ సహాయము,వారికి మద్దతు,వారి శతృవులను తుదిముట్టించటం,వారిని భూమిలో ప్రతినిదులుగా చేయటం లాంటి గురింంచి సమాచారమివ్వండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَقَالَ مُوْسٰی رَبَّنَاۤ اِنَّكَ اٰتَیْتَ فِرْعَوْنَ وَمَلَاَهٗ زِیْنَةً وَّاَمْوَالًا فِی الْحَیٰوةِ الدُّنْیَا ۙ— رَبَّنَا لِیُضِلُّوْا عَنْ سَبِیْلِكَ ۚ— رَبَّنَا اطْمِسْ عَلٰۤی اَمْوَالِهِمْ وَاشْدُدْ عَلٰی قُلُوْبِهِمْ فَلَا یُؤْمِنُوْا حَتّٰی یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَ ۟
మరియు మూసా అలైహిస్సలాం ఇలా విన్నపించుకున్నారు : ఓ మా ప్రభువా నిశ్ఛయంగా నీవు ఫిర్ఔనును,అతని జాతి పెద్దలను ప్రాపంచిక అలంకారమును,దాని వైభవము సొంపును ప్రసాధించావు.మరియు నీవు వారికి ఇహలోకములో చాలా సంపదలను ప్రసాధించావు.వారు నీవు ప్రసాధించిన వాటిపై నిన్ను కృతజ్ఞతలు తెలుపలేదు కానీ వారు వాటి ద్వారా నీ మార్గము నుండి తప్పించటానికి సహాయము తీసుకున్నారు.ఓ మా ప్రభువా వారి సంపదలను తుడిచివేయి,వాటిని పూర్తిగా నాశనంచేయి.మరియు వారి హృదయాలను కఠినంగా చేయి.వారు బాధాకరమైన శిక్షను చూస్తేనే తప్ప విశ్వసించరు.అప్పుడు వారి విశ్వాసము వారికి ప్రయోజనం చేకూర్చదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الثقة بالله وبنصره والتوكل عليه ينبغي أن تكون من صفات المؤمن القوي.
అల్లాహ్ పై,ఆయన సహాయము పై దృడ విశ్వాసము,ఆయనపై నమ్మకము బలమైన విశ్వాసపరుని లక్షణాల్లోంచి ఉండటం అవసరము.

• بيان أهمية الدعاء، وأنه من صفات المتوكلين.
దుఆ యొక్క ప్రాముఖ్యత ప్రకటన.మరియు అది నిశ్ఛయంగా నమ్మకస్తుల గుణము.

• تأكيد أهمية الصلاة ووجوب إقامتها في كل الرسالات السماوية وفي كل الأحوال.
నమాజు ప్రాముఖ్యతను,దాన్ని నెలకొల్పటము అనివార్యమవటమును దివ్య ధర్మాలన్నింటిలో,సంధర్భాలన్నింటిలో నిశ్ఛయపరచడం.

• مشروعية الدعاء على الظالم.
దుర్మార్గున్ని శపించటం (బద్దుఆ చేయటం) ధర్మబద్దత చేయబడింది.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಯೂನುಸ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ