Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಸ್ವಾದ್   ಶ್ಲೋಕ:

సాద్

ಅಧ್ಯಾಯದ ಉದ್ದೇಶಗಳು:
ذكر المخاصمة بالباطل وعاقبتها.
అసత్యముతో పోరాటము మరియు దాని పరిణామము ప్రస్తావన.

صٓ وَالْقُرْاٰنِ ذِی الذِّكْرِ ۟ؕ
సూరె బఖరా ఆరంభంలో విడి విడిగా ఉండే అక్షరాల (హురూఫె ముఖత్తఆత్ ల) సారూప్యముపై చర్చ జరిగినది. ప్రజలకు వారి ఇహలోకములో,పరలోకములో వారికి ప్రయోజనం కలిగించే వాటితో హితబోధనతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. ముష్రికులు అల్లాహ్ తో పాటు భాగస్వాములు ఉన్నారని భావిస్తున్నట్లు విషయం లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
بَلِ الَّذِیْنَ كَفَرُوْا فِیْ عِزَّةٍ وَّشِقَاقٍ ۟
కాని అవిశ్వాసపరులు అల్లాహ్ ఏకత్వము నుండి గర్వములో,అహంకారములో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో విభేదాల్లో,ఆయనతో విరోధంలో ఉన్నారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ فَنَادَوْا وَّلَاتَ حِیْنَ مَنَاصٍ ۟
వారికన్న మునుపు తమ ప్రవక్తలను తిరస్కరించినటువంటి ఎన్నో తరాలను నాశనం చేశాము. అప్పుడు వారు తమపై శిక్ష అవతరించేటప్పుడు సహాయమును కోరుతూ పిలిచారు. మరియు ఆయన వద్ద నుండి సహాయం వారికి ప్రయోజనం కలిగించటానికి వారి కొరకు శిక్ష నుండి తప్పించుకునే సమయం లేకపోయింది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَعَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ ؗ— وَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا سٰحِرٌ كَذَّابٌ ۟ۖۚ
మరియు వారి వద్దకు ఒక వేళ వారు తమ అవిశ్వాసములోనే కొనసాగితే అల్లాహ్ శిక్ష నుండి వారిని భయపెడుతూ వారిలో నుండే ఒక ప్రవక్త వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మరియు ఎప్పుడైతే అవిశ్వాసపరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చినది సత్యం అవటంపై ఆధారాలను చూశారో ఇలా పలికారు : ఇతడు ప్రజలను మంత్రజాలానికి గురిచేసే ఒక మంత్రజాలకుడు, తాను అల్లాహ్ ప్రవక్త అని తన వైపు దైవవాణి అవతరింపబడుతుందని తాను వాదించిన విషయంలో అసత్యపరుడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَجَعَلَ الْاٰلِهَةَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ عُجَابٌ ۟
ఏమీ ఈ వ్యక్తి బహుళ దైవాలను ఒకే ఆరాధ్యదైవంగా,ఆయన తప్ప ఇంకో దైవం లేనట్లుగా చేశాడా ?. ఇతని ఈ కార్యము అత్యంత ఆశ్ఛర్యకరము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَانْطَلَقَ الْمَلَاُ مِنْهُمْ اَنِ امْشُوْا وَاصْبِرُوْا عَلٰۤی اٰلِهَتِكُمْ ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ یُّرَادُ ۟ۚ
మరియు వారి నాయకులు,వారి పెద్దలు తమను అనుసరించే వారితో ఇలా పలుకుతూ వెళ్ళారు : మీరు దేనిపైనైతే ఉన్నారో అలాగే నడవండి. మరియు మీరు ముహమ్మద్ ధర్మంలో ప్రవేశించకండి. మీ దైవాల ఆరాధనలో స్థిరంగా ఉండండి. నిశ్చయంగా ముహమ్మద్ మిమ్మల్ని ఒకే ఆరాధ్య దైవ ఆరాధన వైపునకు పిలుస్తున్న విషయం ఎటువంటిదంటే అతడు మనకంటే పైకి ఎదిగి మేము అతన్ని అనుసరించేవారమైపోవాలని కోరుతున్నాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
مَا سَمِعْنَا بِهٰذَا فِی الْمِلَّةِ الْاٰخِرَةِ ۖۚ— اِنْ هٰذَاۤ اِلَّا اخْتِلَاقٌ ۟ۖۚ
ముహమ్మద్ మమ్మల్ని పిలుస్తున్న అల్లాహ్ ఏకేశ్వరోపాసనను మా తాతముత్తాతలను మేము దేనిపైనైతే పొందామో అందులో, ఈసా అలైహిస్సలాం మతంలో మేము వినలేదు. మేము అతని నుండి విన్నది ఇది అబద్దము,బూటకం మాత్రమే.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ءَاُنْزِلَ عَلَیْهِ الذِّكْرُ مِنْ بَیْنِنَا ؕ— بَلْ هُمْ فِیْ شَكٍّ مِّنْ ذِكْرِیْ ۚ— بَلْ لَّمَّا یَذُوْقُوْا عَذَابِ ۟ؕ
ఏమీ మా అందరి మధ్యలో అతనిపైనే ఖుర్ఆన్ అవతరింపబడటం మరియు అతనినే ప్రత్యేకించటం సరైనదా ?. మరియు మాపై అవతరింపబడలేదు. వాస్తవానికి మేము నాయకులము,పెద్దలము. వాస్తవానికి ఈ ముష్రికులందరు మీపై అవతరింపబడిన దైవవాణి విషయంలో సందేహంలో ఉన్నారు. మరియు వారు అల్లాహ్ శిక్షను రుచిచూసినప్పుడు వారు తమకు గడువు ఇవ్వటం వలన మోసపోయారు. ఒక వేళ వారు దాని రుచి చూసి ఉంటే అవిశ్వాసంపై,అల్లాహ్ తోపాటు సాటి కల్పించటంపై,ఆయన మీవైపునకు అవతరింపజేసిన దైవవాణి విషయంలో సందేహ పడటంపై ధైర్యం చేసేవారు కాదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَمْ عِنْدَهُمْ خَزَآىِٕنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِیْزِ الْوَهَّابِ ۟ۚ
లేదా ఈ తిరస్కరించే ముష్రికులందరి వద్ద ఎవరూ ఓడించలేని సర్వశక్తివంతుడైన నీ ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులు కలవా. ఆయనే తాను కోరినదంతా తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహము యొక్క నిధుల్లోంచి దైవదౌత్యము. దాన్ని ఆయన తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. దాన్ని వారు తాము తలచిన వారికి అనుగ్రహించటానికి మరియు తాము కోరిన వారికి దాన్ని అనుగ్రహించటానికి అది వారి కొరకు కాదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَمْ لَهُمْ مُّلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۫— فَلْیَرْتَقُوْا فِی الْاَسْبَابِ ۟
లేదా వారికి ఆకాశములపై,భూమిపై మరియు వాటిలో ఉన్నటువంటి వాటిపై అధికారం ఉన్నదా ? .వారికి ఇచ్చే,ఆపే హక్కు ఉండాటానికి. ఒక వేళ ఇది వారి వాదన అయితే వారు నిర్ణయించుకున్నది ఆపటం లేదా ఇవ్వటం గురించి ఆదేశమునకు సామర్ధ్యం పొందటానికి ఆకాశమునకు చేరవేసే కారకాలను తయారు చేసుకోవాలి. వారికి దాని శక్తి లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
جُنْدٌ مَّا هُنَالِكَ مَهْزُوْمٌ مِّنَ الْاَحْزَابِ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే వీరందరు తమ కన్న ముందు గతించిన తమ ప్రవక్తలను తిరస్కరించిన సైన్యములవలే పరాభవమునకు లోనయిన సైన్యము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّفِرْعَوْنُ ذُو الْاَوْتَادِ ۟ۙ
వీరందరు మొదట తిరస్కరించిన వారు కాదు. వీరికన్న ముందు నూహ్ జాతివారు తిరస్కరించారు. మరియు ఆద్ తిరస్కరించింది. మరియు ఫిర్ఔన్ ఎవరికైతే మేకులు ఉండి వాటితో ప్రజలను యాతనకు గురిచేసేవాడో తిరస్కరించాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَثَمُوْدُ وَقَوْمُ لُوْطٍ وَّاَصْحٰبُ لْـَٔیْكَةِ ؕ— اُولٰٓىِٕكَ الْاَحْزَابُ ۟
మరియు సమూద్ తిరస్కరించింది. మరియు లూత్ జాతి తిరస్కరించింది.మరియు షుఐబ్ జాతి తిరస్కరించింది. వారందరే ఆ వర్గాలు ఎవరైతే తమ ప్రవక్తలను తిరస్కరించటంపై మరియు వారు తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించటంపై వర్గములుగా మారారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنْ كُلٌّ اِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ ۟۠
ఈ వర్గములన్నింటిలో నుంచి ప్రతీ వర్గము నుండి ప్రవక్తలను తిరస్కరించటం మాత్రమే వాటిల్లింది. అప్పుడు వారిపై అల్లాహ్ శిక్ష అనివార్యమయ్యింది. మరియు వారిపై ఆయన శిక్ష దిగింది. ఒక వేళ అది కొంత సమయం వరకు ఆలస్యం అయినా సరే.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَمَا یَنْظُرُ هٰۤؤُلَآءِ اِلَّا صَیْحَةً وَّاحِدَةً مَّا لَهَا مِنْ فَوَاقٍ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే వీరందరు ఎటువంటి మరలింపులేని రెండవ బాకా ఊదబడటమునకు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ వారు తమ తిరస్కార స్థితిలోనే మరణిస్తే వారిపై శిక్ష వాటిల్లి తీరుతుంది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَقَالُوْا رَبَّنَا عَجِّلْ لَّنَا قِطَّنَا قَبْلَ یَوْمِ الْحِسَابِ ۟
మరియు వారు పరిహాసమాడుతూ ఇలా పలికేవారు : ఓ మా ప్రభువా ప్రళయదినం కన్న ముందే ఇహలోకములోనే శిక్ష నుండి మా భాగమును తొందరగా ఇచ్చివేయి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• أقسم الله عز وجل بالقرآن العظيم، فالواجب تَلقِّيه بالإيمان والتصديق، والإقبال على استخراج معانيه.
అల్లాహ్ అజ్జవజల్ల దివ్య ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. కాబట్టి దాన్ని విశ్వాసం,దృవీకరణ మరియు దాని అర్దాలను వెలికితీసే కోరికతో స్వీకరించటం తప్పనిసరి.

• غلبة المقاييس المادية في أذهان المشركين برغبتهم في نزول الوحي على السادة والكبراء.
ముష్రికుల మనస్సుల్లో దైవవాణి అవతరణ నాయకులపై,పెద్దవారిపై కలగాలనే వారి కోరిక వలన భౌతిక ప్రమాణాలు ప్రబలిపోయాయి.

• سبب إعراض الكفار عن الإيمان: التكبر والتجبر والاستعلاء عن اتباع الحق.
సత్యమును అనుసరించటం నుండి గర్వానికి,అహంకారానికి లోనవటం విశ్వాసపరులు విశ్వాసము నుండి విముఖత చూపటానికి కారణం.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಸ್ವಾದ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ