Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಸ್ವಾದ್   ಶ್ಲೋಕ:
وَقَالُوْا مَا لَنَا لَا نَرٰی رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِّنَ الْاَشْرَارِ ۟ؕ
తలబిరుసులైన అహంకారులు ఇలా అంటారు : మాకేమయ్యింది మేము ఇహలోకంలో శిక్షకు అర్హులైన వారైన దుష్టుల్లోంచి భావించిన వారైన జనులను మాతో పాటు నరకంలో చూడటం లేదే ?.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَتَّخَذْنٰهُمْ سِخْرِیًّا اَمْ زَاغَتْ عَنْهُمُ الْاَبْصَارُ ۟
ఏమీ వారి గురించి మా పరిహాసము మరియు ఎగతాళి తప్పైనదా అందుకే వారు శిక్షకు అర్హులు కాలేదా ? లేదా వారి గురించి మా పరిహాసము సరై వారు నరకంలో ప్రవేశించారా. మరియు మా దృష్టి వారిపై పడలేదా ?!.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّ ذٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ اَهْلِ النَّارِ ۟۠
నిశ్ఛయంగా మేము మీకు ప్రస్తావించిన నరక వాసుల మధ్య ఈ ఘర్షణ ప్రళయదినాన తప్పకుండా జరిగితీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు మరియు సంశయం లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قُلْ اِنَّمَاۤ اَنَا مُنْذِرٌ ۖۗ— وَّمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ۚ
ఓ ముహమ్మద్ మీరు మీ జాతిలో నుండి అవిశ్వాసపరులతో ఇలా పలకండి : నేను కేవలం మీకు అల్లాహ్ శిక్ష నుండి అది మీపై ఆయన పట్ల మీ అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించటం వలన వాటిల్లుతుందని హెచ్చరించేవాడిని మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ తప్ప ఆరాధనకు యోగ్యుడైన దైవం పొందబడడు. కావున ఆయన తన గొప్పతనంలో,తన గుణాల్లో,తన నామములలో అద్వితీయుడు. మరియు ఆయనే ప్రతీ దానిపై ఆధిక్యతను కనబరిచే ఆధిక్యుడు. కాబట్టి ప్రతీది ఆయనకు లోబడి ఉన్నది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الْعَزِیْزُ الْغَفَّارُ ۟
మరియు ఆయన ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటికి ప్రభువు. మరియు ఆయన తన రాజ్యాధికారములో సర్వాధిక్యుడు,ఆయనను ఎవరు ఓడించలేరు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قُلْ هُوَ نَبَؤٌا عَظِیْمٌ ۟ۙ
ఓ ప్రవక్త ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : నిశ్చయంగా ఖుర్ఆన్ గొప్ప విషయంగల సందేశము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَنْتُمْ عَنْهُ مُعْرِضُوْنَ ۟
మీరు ఈ గొప్ప విషయం గల సందేశము నుండి విముఖులవుతున్నారు. దాని వైపు శ్రద్ధ వహించటం లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
مَا كَانَ لِیَ مِنْ عِلْمٍ بِالْمَلَاِ الْاَعْلٰۤی اِذْ یَخْتَصِمُوْنَ ۟
ఆదమ్ అలైహిస్సలాం సృష్టి విషయంలో దైవదూతల మధ్య జరిగిన చర్చ గురించి నాకు ఎటువంటి జ్ఞానం ఉండేది కాదు ఒక వేళ అల్లాహ్ నాపై దైవవాణి అవతరింపజేసి నాకు తెలియపరచకుండా ఉంటే.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنْ یُّوْحٰۤی اِلَیَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
అల్లాహ్ నాకు దైవ వాణి చేయవలసినది చేశాడు ఎందుకంటే నేను మీకు ఆయన శిక్ష నుండి హెచ్చరించే వాడిని,హెచ్చరికను స్పష్టంగా చేసేవాడిని.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ طِیْنٍ ۟
మీ ప్రభువు దైవదూతలతో ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను. మరియు అతడు ఆదమ్ అలైహిస్సలాం.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
నేను అతని సృష్టిని సరిగా చేసి అతని రూపమును సరిదిద్ది అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరు అతనికి సాష్టాంగపడండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దైవదూతలు తమ ప్రభువు ఆదేశమును చేసి చూపించారు. అప్పుడు వారందరు గౌరవప్రదమైన సాష్టాంగమును చేశారు. వారిలో నుండి ఆదం అలైహిస్సలాంకు సాష్టాంగపడకుండా ఎవరూ మిగలలేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اِسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
కాని ఇబ్లీస్ సాష్టాంగపడటం నుండి అహంకారమును చూపాడు. మరియు అతడు తన ప్రభువు ఆదేశంనకు వ్యతిరేకంగా తన గర్వం వలన అవిశ్వాసపరుల్లోంచి అయిపోయాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ یٰۤاِبْلِیْسُ مَا مَنَعَكَ اَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِیَدَیَّ ؕ— اَسْتَكْبَرْتَ اَمْ كُنْتَ مِنَ الْعَالِیْنَ ۟
అల్లాహ్ ఇలా పలికాడు : ఓ ఇబ్లీస్ నేను నా చేతితో సృష్టించిన ఆదంకు సాష్టాంగపడటం నుండి నిన్ను ఏది ఆపినది ?!. ఏమీ సాష్టాంగపడటం నుండి గర్వం నిన్ను ఆపినదా లేదా ముందు నుండే నీవు నీ ప్రభువుపై గర్వం,అహంకారం కలవాడివా ?!.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ؕ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟
ఇబ్లీస్ ఇలా పలికాడు : నేను ఆదం కన్న గొప్పవాడిని. నిశ్చయంగా నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు ఆదంను మట్టితో సృష్టించావు. మరియు అతని ఉద్దేశం ప్రకారం అగ్ని మట్టికన్న ఎంతో గొప్ప మూలకము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙۖ
అల్లాహ్ ఇబ్లీసుకు ఇలా ఆదేశమిచ్చాడు : నీవు స్వర్గము నుండి వెళ్ళిపో. నిశ్చయంగా నీవు శపించబడ్డావు మరియు ధూషించబడ్డావు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَّاِنَّ عَلَیْكَ لَعْنَتِیْۤ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟
మరియు నిశ్చయంగా నీపై స్వర్గం నుండి ధూత్కారము ప్రతిఫలదినం వరకు ఉంటుంది. మరియు అది ప్రళయదినము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
ఇబ్లీస్ ఇలా పలికాడు : నీవు నాకు గడువునిచ్చి నీ దాసులను నీవు మరల లేపే రోజు వరకు నాకు మరణం కలిగించకు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ
అల్లాహ్ ఇలా పలికాడు : నీవు గడువివ్వబడిన వారిలో వాడివి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟
వినాశనము కొరకు నియమిత,నిర్ధారిత సమయ రోజు వరకు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
ఇబ్లీస్ ఇలా పలికాడు : అయితే నేను నీ సామర్ధ్యము,నీ ఆధిక్యత పై ప్రమాణం చేస్తున్నాను నేను ఆదం సంతతినంతటినీ తప్పకుండా అపమార్గమునకు లోను చేస్తాను.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟
నీవు ఎవరినైతే నా మార్గభ్రష్టత నుండి రక్షించి నీ ఒక్కడి ఆరాధన చేయటం కొరకు ప్రత్యేకించుకున్నావో వారు తప్ప.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• القياس والاجتهاد مع وجود النص الواضح مسلك باطل.
స్పష్టమైన ఆధారం (నస్) ఉండి కూడా ఖియాస్ (తలంపు),ఇజ్తిహాద్ చేయటం అసత్య మార్గము.

• كفر إبليس كفر عناد وتكبر.
ఇబ్లీస్ అవిశ్వాసం మొండి మరియు అహంకార అవిశ్వాసం.

• من أخلصهم الله لعبادته من الخلق لا سبيل للشيطان عليهم.
అల్లాహ్ సృష్టిరాసుల్లోంచి తన ఆరాధనకు ప్రత్యేకించుకున్న వారిపై షైతాన్ కొరకు ఎటువంటి మార్గము ఉండదు.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಸ್ವಾದ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ