Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: ഗാഫിർ   ആയത്ത്:
هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ یُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُیُوْخًا ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّی وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
ఆయనే మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరల ఆయన మిమ్మల్ని దాని తరువాత వీర్యబిందువుతో ఆ పిదప వీర్య బిందువు తరువాత రక్తపు గడ్డతో మిమ్మల్ని సృష్టించాడు. దాని తరువాత ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భముల నుండి చిన్న పిల్లలుగా వెలికి తీస్తాడు. ఆ తరువాత మీరు దృఢమైన శరీరములు కల వయసుకు చేరుకుని ఆ తరువాత మీరు పెద్దవారై వృద్ధులయ్యే వరకు (మిమ్మల్ని పెంచుతాడు). మరియు మీలో నుండి కొందరు దాని కన్న ముందే చనిపోయేవారున్నారు. మరియు (ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు) మీరు అల్లాహ్ జ్ఞానంలో నిర్ణీత కాలమునకు చేరుకోవటానికి. మీరు దాని నుండి తగ్గించలేరు. మరియు మీరు దానికన్న పెంచలేరు. మరియు బహుశ మీరు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఈ వాదనలు,ఆధారల ద్వారా ప్రయోజనం చెందుతారని.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
هُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۚ— فَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠
పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి చేతిలోనే జీవితాన్ని ప్రసాదించటం కలదు. మరియు ఆయన ఒక్కడి చేతిలోనే మరణాన్ని కలిగించటం కలదు. ఆయన ఏదైన చేయదలచుకున్నప్పుడు దాన్ని ఇలా అంటాడు (కున్) నీవు అయిపో. అప్పుడు అది అయిపోతుంది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ ؕ— اَنّٰی یُصْرَفُوْنَ ۟ۙۛ
ఓ ప్రవక్తా అల్లాహ్ ఆయతుల విషయంలో అవి స్పష్టమైన తరువాత కూడా వాటిని తిరస్కరిస్తూ వాదులాడే వారిని మీరు చూడలేదా ?. (ఒక వేళ మీరు చూస్తే) వారి స్థితి నుండి మీరు ఆశ్ఛర్యపోతారు. వాస్తవానికి వారు సత్యము నుండి అది స్పష్టమైనా కూడా వారు విముఖత చూపుతున్నారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
الَّذِیْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ۫— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟ۙ
వారే ఖుర్ఆన్ ను మరియు మేము మా ప్రవక్తలకు ఇచ్చి పంపించిన సత్యమును తిరస్కరించారు. ఈ తిరస్కరించే వారందరు తమ తిరస్కార పరిణామును తొందరలోనే తెలుసుకుంటారు. మరియు వారు చెడ్డ ముగింపును చూస్తారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُ ؕ— یُسْحَبُوْنَ ۟ۙ
వారు దాని పరిణామమును తెలుసుకుంటారు అప్పుడు వారి మెడలలో బేడీలు మరియు వారి కాళ్ళలో సంకెళ్ళు ఉంటాయి. వారిని శిక్ష భటులు ఈడ్చుతుంటారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فِی الْحَمِیْمِ ۙ۬— ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۟ۚ
వారు వారిని తీవ్రమైన వేడి గల నీళ్ళలోకి ఈడ్చుతారు. ఆ తరువాత వారు నరకాగ్నిలో కాల్చబడుతారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ثُمَّ قِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَ ۟ۙ
ఆ తరువాత వారికి చివాట్లు పెడుతూ మరియు మందలిస్తూ ఇలా పలకబడింది : మీరు ఆరోపించిన దైైవుములు ఏరి వేటి ఆరాధన చేయటం ద్వారా మీరు సాటి కల్పించినారో?.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَیْـًٔا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ను వదిలి ఏ విధమైన ప్రయోజనం కలిగించని మరియు నష్టం కలిగించనివైన మీ విగ్రహాలు ఏవి ?!. అవిశ్వాసపరులు ఇలా పలికారు : వారు మా నుండి అదృశ్యమైపోయారు మేము వారిని చూడలేక పోతున్నాము. అంతే కాదు మేము ఆరాధనకు యోగ్యత కలది దేనిని మేము ఆరాధించేవారము కాము. వీరందరిని అపమార్గమునకు లోను చేసినట్లే అల్లాహ్ అవిశ్వాసపరులను సత్యం నుండి ప్రతీ కాలములో,ప్రతీ చోటా అపమార్గమునకు లోను చేస్తాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ذٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۟ۚ
మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు అనుభవిస్తున్న ఈ శిక్ష మీరు దేనిపైనైతే ఉన్నారో షిర్కుతో మీ సంతోషము వలన మరియు మీ సంతోషమును విస్తరింపజేయటం వలన.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
మీరు నరక ద్వారముల్లో దానిలో శాశ్వతంగా ఉండుటకు ప్రవేశించండి. సత్యము నుండి అహంకారము చూపేవారి నివాసము ఎంతో చెడ్డది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు మీ జాతివారు బాధించిన దానిపై మరియు వారి తిరస్కారముపై సహనం చూపండి. నిశ్చయంగా మీకు సహాయం చేసే అల్లాహ్ వాగ్దానం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానైతే బదర్ దినమున సంభవించినదో అలా మీరు జీవించి ఉన్నప్పుడే వారికి మేము వాగ్దానం చేసిన శిక్ష లో నుండి కొంత భాగమును మీకు చూపించినా లేదా దాని కన్న ముందు మేము మీకు మరణమును కలిగించినా వారు ప్రళయదినమున మా ఒక్కరి వైపునకే మరలుతారు. అప్పుడు మేము వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాము. అప్పుడు మేము వారందరిని నరకములో శాశ్వతంగా ఉండేవిధంగా ప్రవేశింపజేస్తాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• التدرج في الخلق سُنَّة إلهية يتعلم منها الناس التدرج في حياتهم.
సృష్టిలో సోపానక్రమము దైవిక సంప్రదాయము దాని నుండి ప్రజలు తమ జీవితములో సోపానక్రమమును నేర్చుకుంటారు.

• قبح الفرح بالباطل.
అసత్యము పట్ల ఆనందము యొక్క చెడ్డతనం.

• أهمية الصبر في حياة الناس، وبخاصة الدعاة منهم.
ప్రజల జీవితాలలో సహనం యొక్క ప్రాముఖ్యత,ముఖ్యంగా వారిలో నుండి సందేశ ప్రచారకుల.

 
പരിഭാഷ അദ്ധ്യായം: ഗാഫിർ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അടക്കുക