Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: طه   آیت:
فَاَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ فَقَالُوْا هٰذَاۤ اِلٰهُكُمْ وَاِلٰهُ مُوْسٰی ۚۙ۬— فَنَسِیَ ۟ؕ
అప్పుడు సామిరీ ఇస్రాయీలు సంతతి వారి కొరకు ఆ నగల నుండి ఏ ఆత్మ లేని,ఆవు గాండ్రింపు లాంటి గాండ్రింపు కల ఒక దూడను వెలికి తీశాడు. అప్పుడు వారిలో నుండి సామిరీ పనికి ఆకర్షితులైనవారు ఇదే మీ ఆరాధ్య దైవము,మూసా ఆరాధ్య దైవము ఆయన దీన్ని మరచిపోయి ఇక్కడ వదిలివేశాడు అన్నారు.
عربي تفسیرونه:
اَفَلَا یَرَوْنَ اَلَّا یَرْجِعُ اِلَیْهِمْ قَوْلًا ۙ۬— وَّلَا یَمْلِكُ لَهُمْ ضَرًّا وَّلَا نَفْعًا ۟۠
ఏమీ దూడకు ఆకర్షితులై దాన్ని పూజించే వీరందరు ఈ దూడ వారితో మట్లాడలేదని,వారికి సమాధానము ఇవ్వలేదని,వారి నుండి,ఇతరుల నుండి ఎటువంటి నష్టమును తొలగించలేదని,వారి కొరకు,ఇతరుల కొరకు ఎటువంటి లాభం తీసుకుని రాలేదని చూడటంలేదా ?!.
عربي تفسیرونه:
وَلَقَدْ قَالَ لَهُمْ هٰرُوْنُ مِنْ قَبْلُ یٰقَوْمِ اِنَّمَا فُتِنْتُمْ بِهٖ ۚ— وَاِنَّ رَبَّكُمُ الرَّحْمٰنُ فَاتَّبِعُوْنِیْ وَاَطِیْعُوْۤا اَمْرِیْ ۟
మరియు నిశ్ఛయంగా హారూను వారితో మూసా వారి వద్దకు మరలక ముందు ఇలా పలికారు : బంగారముతో దూడ సూత్రీకరణలో,దాని గాండ్రించటంలో అవిశ్వాసపరుని నుండి విశ్వాసపరుడిని స్పష్ట పరచటం కొరకు మీకు పరీక్ష మాత్రమే. ఓ నా జాతి వారా నిశ్చయంగా మీ ప్రభువే దయ చూపే అధికారము కలవాడు,మీ కొరకు ఎటువంటి నష్టమును గాని లాభమును గాని కలిగించే అధికారము లేనటువంటి ప్రత్యేకించి మీపై దయచూపనటువంటి వాడు కాదు. అయితే మీరు ఆయన ఒక్కడి ఆరాధన విషయంలో నన్ను అనుసరించండి. ఇతరుల ఆరాధనను వదిలే విషయంలో నా ఆదేశమును పాటించండి.
عربي تفسیرونه:
قَالُوْا لَنْ نَّبْرَحَ عَلَیْهِ عٰكِفِیْنَ حَتّٰی یَرْجِعَ اِلَیْنَا مُوْسٰی ۟
దూడ ఆరాధనకి ఆకర్షితులైనవారు ఇలా పలికారు : మా వద్దకు మూసా మరలేంత వరకు మేము దాని ఆరాధనలో స్థిరంగా ఉంటాము
عربي تفسیرونه:
قَالَ یٰهٰرُوْنُ مَا مَنَعَكَ اِذْ رَاَیْتَهُمْ ضَلُّوْۤا ۟ۙ
మూసా తన సోదరుడు హారునుతో ఇలా పలికారు : అల్లాహ్ ను వదిలి దూడ ఆరాధనతో వారు అపమార్గంలో పడిపోతే మీరు చూసినప్పుడు (వారిని ఆపటం నుండి) మిమ్మల్ని ఏది ఆటంకం కలిగించింది.
عربي تفسیرونه:
اَلَّا تَتَّبِعَنِ ؕ— اَفَعَصَیْتَ اَمْرِیْ ۟
వారిని మీరు వదిలి వేసి నన్ను వచ్చి కలుస్తారా ?!. ఏమీ నేను మిమ్మల్ని వారిపై ప్రతినిధిగా నియమించినప్పుడు మీరు నా ఆదేశమును ఉల్లంఘించారా ?!.
عربي تفسیرونه:
قَالَ یَبْنَؤُمَّ لَا تَاْخُذْ بِلِحْیَتِیْ وَلَا بِرَاْسِیْ ۚ— اِنِّیْ خَشِیْتُ اَنْ تَقُوْلَ فَرَّقْتَ بَیْنَ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَلَمْ تَرْقُبْ قَوْلِیْ ۟
మరియు ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం తన సోదరుని గడ్డమును,ఆయన తలను తన వైపు గింజుతూ ఆయన చేసిన కార్యమునకు ఆయనను మందలిస్తూ పట్టుకున్నారో అప్పుడు హారూన్ అలైహిస్సలాం తనపై దయ చూపమని కోరుతూ ఆయనతో ఇలా పలికారు : మీరు నా గడ్డమును,నా తల వెంట్రుకలను పట్టుకోకండి. ఎందుకంటే నేను వారితోపాటే ఉండిపోవటంలో నా కొరకు ఒక కారణం ఉన్నది. ఒక వేళ నేను వారిని ఒంటరిగా వదిలి వేస్తే వారు విడిపోతారని నేను భయపడ్డాను. అప్పుడు నేను వారిని విడగొట్టానని,వారి విషయంలో మీ మాటను ఖాతరు చేయలేదని మీరు అనేవారు.
عربي تفسیرونه:
قَالَ فَمَا خَطْبُكَ یٰسَامِرِیُّ ۟
మూసా అలైహిస్సలాం సామిరీతో ఇలా పలికారు : ఓ సామిరీ నీ సంగతేమిటి ?. నీవు చేసిన కార్యం వైపునకు ఏ కారణం పురిగొల్పింది ?.
عربي تفسیرونه:
قَالَ بَصُرْتُ بِمَا لَمْ یَبْصُرُوْا بِهٖ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ اَثَرِ الرَّسُوْلِ فَنَبَذْتُهَا وَكَذٰلِكَ سَوَّلَتْ لِیْ نَفْسِیْ ۟
సామిరీ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నీవు చూడనిది నేను చూశాను. నిశ్చయంగా నేను జిబ్రయీలును ఒక గుఱ్రంపై చూశాను,అప్పుడు నేను ఆయన గుఱ్రపు అడుగు క్రింద నుండి ఒక గుప్పిట మట్టిని తీసుకొని దాన్ని నేను కరిగించబడి దూడ రూపములో అచ్చు వేయబడిన నగలుపై విసిరాను. అప్పుడు దాని నుండి గాండ్రింపు శరీరము కల ఒక దూడ పుట్టుకొచ్చింది. ఈ విధంగా నా మనస్సుకు మంచిగా అనిపించింది నేను చేశాను.
عربي تفسیرونه:
قَالَ فَاذْهَبْ فَاِنَّ لَكَ فِی الْحَیٰوةِ اَنْ تَقُوْلَ لَا مِسَاسَ ۪— وَاِنَّ لَكَ مَوْعِدًا لَّنْ تُخْلَفَهٗ ۚ— وَانْظُرْ اِلٰۤی اِلٰهِكَ الَّذِیْ ظَلْتَ عَلَیْهِ عَاكِفًا ؕ— لَنُحَرِّقَنَّهٗ ثُمَّ لَنَنْسِفَنَّهٗ فِی الْیَمِّ نَسْفًا ۟
మూసా అలైహిస్సలాం సామిరీతో ఇలా పలికారు : సరే నీవు వెళ్ళు కాని నీవు జీవించి ఉన్నంత కాలం నీవు నేను ఎవరిని ముట్టుకోను,నన్ను ఎవరు ముట్టుకోకండి అని పలుకూతూ ఉంటావు. అప్పుడు నీవు చండభ్రష్టుడిగా జీవిస్తావు. మరియు నిశ్చయంగా నీ కొరకు ప్రళయ దినాన ఒక వాగ్ధానం చేయబడిన సమయం ఉన్నది. అందులో నీ లెక్క తీసుకోవటం జరుగుతుంది,శిక్షించబడుతావు. ఈ వాగ్ధాన దినమున అల్లాహ్ నిన్ను వదలడు. మరియు నీవు ఆరాధ్యదైవముగా చేసుకుని అల్లాహ్ ను వదిలి నీవు ఆరాధించిన నీ దూడను చూడు. దానిపై మేము అగ్నిని కాలుస్తాము చివరికి అది కరగిపోతుంది. ఆ తరువాత మేము దాన్నిసముద్రంలో విసిరివేస్తాము. చివరికి దాని నామరూపాలు మిగలవు.
عربي تفسیرونه:
اِنَّمَاۤ اِلٰهُكُمُ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— وَسِعَ كُلَّ شَیْءٍ عِلْمًا ۟
ఓ ప్రజలారా మీ వాస్తవ ఆరాధ్యదైవం ఆ అల్లాహ్ ఆయన తప్ప ఎవరు వాస్తవ ఆరాధ్య దైవం కారు. ఆయన ప్రతీ వస్తువును జ్ఞానపరంగా చుట్టుముట్టి ఉన్నాడు. పరిశుద్ధుడైన ఆయన నుండి ఏ వస్తువు యొక్క జ్ఞానము తప్పిపోదు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• خداع الناس بتزوير الحقائق مسلك أهل الضلال.
వాస్తవాలను తారుమారు చేయటం ద్వారా ప్రజలను మోసగించటం అనేది మార్గ భ్రష్టుల పద్దతి.

• الغضب المحمود هو الذي يكون عند انتهاكِ محارم الله.
ప్రశంసించదగిన కోపం అల్లాహ్ యొక్క నిషేధాల్లో పడిపోయినప్పుడు కలుగును.

• في الآيات أصل في نفي أهل البدع والمعاصي وهجرانهم، وألا يُخَالَطوا.
ఆయతుల్లో బిద్అతీలను,పాపాత్ములను తిరస్కరించటంలో,వారిని వదిలివేయటం,వారిని కలవకుండా ఉండటం విషయంలో ఆధారం ఉన్నది.

• في الآيات وجوب التفكر في معرفة الله تعالى من خلال مفعولاته في الكون.
విశ్వంలో మహోన్నతుడైన అల్లాహ్ ప్రభావాల ద్వారా అల్లాహ్ ను గుర్తించటం గురించి ఆలోచించటం తప్పనిసరి అని ఆయతుల్లో ఉన్నది.

 
د معناګانو ژباړه سورت: طه
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول