Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Āl-‘Imrān   Ayah:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَنْ تُغْنِیَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَیْـًٔا ؕ— وَاُولٰٓىِٕكَ هُمْ وَقُوْدُ النَّارِ ۟ۙ
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని ప్రజల సంపద మరియు సంతానం, ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క శిక్ష నుండి వారిని కాపాడలేవు. ప్రళయదినం నాడు అటువంటి అవిశ్వాసులు నరకాగ్ని కొరకు ఇంధనంగా మారతారు మరియు వారితో నరకాగ్ని ముట్టించబడుతుంది.
Ang mga Tafsir na Arabe:
كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ ۙ— وَالَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَذَّبُوْا بِاٰیٰتِنَا ۚ— فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَاللّٰهُ شَدِیْدُ الْعِقَابِ ۟
అటువంటి అవిశ్వాసుల పరిస్థితి అల్లాహ్ ను మరియు ఆయన ఆయతులను తిరస్కరించిన ఫిరౌను మరియు అతడికి పూర్వం జీవించిన అవిశ్వాసుల మాదిరిగా ఉంది. కాబట్టి, వారి పాపాల కారణంగా అల్లాహ్ వారిని శిక్షించాడు. ఆ అవిశ్వాసుల సంపద మరియు సంతానం వారిని ఏమాత్రమూ కాపాడ లేక పోయింది. తనపై మరియు తన ఆయతులపై విశ్వాసం చూపని అవిశ్వాసులను అల్లాహ్ చాలా తీవ్రంగా శిక్షిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
قُلْ لِّلَّذِیْنَ كَفَرُوْا سَتُغْلَبُوْنَ وَتُحْشَرُوْنَ اِلٰی جَهَنَّمَ ؕ— وَبِئْسَ الْمِهَادُ ۟
ఓ ప్రవక్తా! ఏ ధర్మాన్ని అనుసరించే అవిశ్వాసులైనా సరే, వారితో ఇలా చెప్పండి, “విశ్వాసులు మిమ్మల్ని ఓడిస్తారు. మీరు అవిశ్వాసులుగా చనిపోతారు. తరువాత అల్లాహ్ మిమ్మల్ని నరకంలో జమ చేస్తాడు. మీ కొరకు అది ఎంత చెడ్డ నివాస స్థలమో!”
Ang mga Tafsir na Arabe:
قَدْ كَانَ لَكُمْ اٰیَةٌ فِیْ فِئَتَیْنِ الْتَقَتَا ؕ— فِئَةٌ تُقَاتِلُ فِیْ سَبِیْلِ اللّٰهِ وَاُخْرٰی كَافِرَةٌ یَّرَوْنَهُمْ مِّثْلَیْهِمْ رَاْیَ الْعَیْنِ ؕ— وَاللّٰهُ یُؤَیِّدُ بِنَصْرِهٖ مَنْ یَّشَآءُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّاُولِی الْاَبْصَارِ ۟
బదర్ యుద్ధంలో పోరాడటానికి ఎదురు బదురైన రెండు వర్గాలలో ఒక స్పష్టమైన సంకేతం మరియు గుణపాఠం ఉన్నది. అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ఆయన సహచరులతో ఒక వర్గం ఏర్పడినది; వారు అల్లాహ్ కొరకు పోరాడుతున్నారు మరియు అవిశ్వాసుల అసత్యాలకు వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క సత్యసందేశాన్ని స్థాపించడానికి వారు పోరాడుతున్నారు. మక్కాలోని అవిశ్వాసులతో రెండో వర్గం ఏర్పడినది; వారు దురహంకారంతో మరియు ప్రదర్శనా బుద్ధితో పోరాడేందుకు వచ్చారు. విశ్వాసులు తమ సంఖ్య కంటే రెండింతలు అధికంగా ఉన్న అవిశ్వాసులను చూశారు; కానీ, అల్లాహ్ తన వర్గానికి సహాయం చేశాడు. అల్లాహ్ తాను ఎవరికి తలిస్తే వారికి సహాయం చేస్తాడు. సంఖ్యలో తక్కువగా ఉన్నా సరే, ఇందులో అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసులకు చేరుతుందని మరియు సంఖ్యలో అధికంగా ఉన్నప్పటికీ అసత్యంపై ఉన్నవారు ఓడిపోతారనే వాస్తవాన్ని గ్రహించేందుకు అంతర్ దృష్టి గల వారికి ఒక గుణపాఠం మరియు హెచ్చరిక ఉన్నది.
Ang mga Tafsir na Arabe:
زُیِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوٰتِ مِنَ النِّسَآءِ وَالْبَنِیْنَ وَالْقَنَاطِیْرِ الْمُقَنْطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَیْلِ الْمُسَوَّمَةِ وَالْاَنْعَامِ وَالْحَرْثِ ؕ— ذٰلِكَ مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَاللّٰهُ عِنْدَهٗ حُسْنُ الْمَاٰبِ ۟
ప్రజలను పరీక్షించేందుకు, ప్రాపంచిక విషయాలను ఆకర్షణీయంగా, ప్రజలు వాటిని ప్రేమించేలా చేశానని అల్లాహ్ తెలుపు తున్నాడు. వీటిలో స్త్రీలు, పిల్లలు, దినదినాభివృద్ది చెందుతూ కుప్పలు కుప్పలుగా పడి ఉండే సంపద (బంగారం మరియు వెండి రూపాలలో), సుశిక్షితులైన అందమైన గుర్రాలు, పశుసంపద (ఒంటెలు, ఆవులు మరియు గొర్రెలు వంటివి), పంటపొలాలు మొదలైన వన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ ప్రాపంచిక భోగభాగ్యాలు అనుభవించేందుకు కొద్దికాలం వరకు మాత్రమే పనికి వస్తాయి. ఒక విశ్వాసి ఇలాంటి విషయాల వైపు ఆకర్షించ బడకూడదు, ఎందుకంటే అతడి మంచిపనులకు బదులుగా ఎంతో ఉత్తమమైన స్థానాన్ని అల్లాహ్ అతడికి ప్రసాదించ బోతున్నాడు - అది భూమ్యాకాశాలంత విశాలమైన స్వర్గం.
Ang mga Tafsir na Arabe:
قُلْ اَؤُنَبِّئُكُمْ بِخَیْرٍ مِّنْ ذٰلِكُمْ ؕ— لِلَّذِیْنَ اتَّقَوْا عِنْدَ رَبِّهِمْ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا وَاَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضْوَانٌ مِّنَ اللّٰهِ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِالْعِبَادِ ۟ۚ
ఓ ప్రవక్తా! ప్రకటించండి, ఈ వాంఛల కంటే ఉత్తమమైన వాటి గురించి మీకు తెలుప మంటారా ? అల్లాహ్ యొక్క ధర్మాజ్ఞలు పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ సదా అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ జీవితం గడిపే వారి కొరకు చెట్ల క్రింద నుండి ప్రవహించే నదులతో నిండిన ఆహ్లాదకరమైన తోటలు మరియు అందమైన భవనాలు ఉన్నాయి. అక్కడ వారు మరణించరు మరియు నశించిపోరు, శాశ్వతంగా జీవిస్తారు. వారి కొరకు అక్కడ తమ రూపురేఖలలో మరియు గుణగణాలలో ఎలాంటి లోపాలు మరియు కొరతలు లేని, అన్నీ విధాలుగా పరిశుద్ధమైన భార్యలు కూడా ఉంటారు. అదనంగా వారు అల్లాహ్ యొక్క ఇష్టత పొందుతారు. అల్లాహ్ వారిపై ఎన్నటికీ కోపగించుకోడు. అల్లాహ్ తన దాసుల చర్యలు గమనిస్తూ ఉన్నాడు. ఆయన నుండి ఏదీ దాగదు. వారు చేసే పనులకు ఆయన తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• أن غرور الكفار بأموالهم وأولادهم لن يغنيهم يوم القيامة من عذاب الله تعالى إذا نزل بهم.
ఎప్పుడైతే అవిశ్వాసులపై ప్రళయదినం నాడు అల్లాహ్ యొక్క శిక్ష పడుతుందో, తమ సంపద మరియు సంతానం పై వారికున్న అహంకారం అక్కడ వారిని దాని నుండి కాపాడదు.

• النصر حقيقة لا يتعلق بمجرد العدد والعُدة، وانما بتأييد الله تعالى وعونه.
విజయం అనేది సైనికుల సంఖ్యాబలం మరియు యుద్ధసామగ్రి (తయారీ)పై ఆధారపడి ఉండదు. అది కేవలం అల్లాహ్ యొక్క సహాయం మరియు మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది.

• زَيَّن الله تعالى للناس أنواعًا من شهوات الدنيا ليبتليهم، وليعلم تعالى من يقف عند حدوده ممن يتعداها.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రజలను పరీక్షించేందుకు గాను ప్రాపంచిక మనోవాంఛలను ఆకర్షణీయంగా చేసాడు. ఆయన విధించిన హద్దులను ఎవరు గౌరవిస్తారో మరియు ఎవరు అతిక్రమిస్తారో, ఆయన తెలుసుకోవటానికి.

• كل نعيم الدنيا ولذاتها قليل زائل، لا يقاس بما في الآخرة من النعيم العظيم الذي لا يزول.
ప్రపంచంలోని అన్నీ వినోదాలు మరియు ఉల్లాసాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి, అవి క్షణికమైనవి. మరణానంతరం లభించబోయే అనుగ్రహాలతో వాటిని పోల్చలేము ఎందుకంటే అవి ఎన్నటికీ అంతం కానివి మరియు శాశ్వతమైనవి.

 
Salin ng mga Kahulugan Surah: Āl-‘Imrān
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara