Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Mā’idah   Ayah:
وَمِنَ الَّذِیْنَ قَالُوْۤا اِنَّا نَصٰرٰۤی اَخَذْنَا مِیْثَاقَهُمْ فَنَسُوْا حَظًّا مِّمَّا ذُكِّرُوْا بِهٖ ۪— فَاَغْرَیْنَا بَیْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ ؕ— وَسَوْفَ یُنَبِّئُهُمُ اللّٰهُ بِمَا كَانُوْا یَصْنَعُوْنَ ۟
మరియు మేము యూదులతో దృవీకరించబడిన ,దృడమైన ప్రమాణమును తీసుకున్నట్లే తాము ఈసా అలైహిస్సలాంను అనుసరించేవారమని తమకు తాము పరిశుద్ధులమని కొనియాడిన వారితో మేము ప్రమాణమును తీసుకున్నాము. తమ పూర్వికులైన యూదులు చేసినట్లే వారూ తమకు బోధించబడిన దానిలో ఒక భాగమునే ఆచరించారు. మరియు మేము ప్రళయదినం వరకు వారి మధ్య తగువులాటను మరియు ద్వేషమును వేశాము. కావున వారు ఒకరినొకరు అవిశ్వాసపరులని చెప్పుకుంటూ పోరాడుకుంటూ తగువులాడుతూ ఉంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే వారు చేసే దాని గురించి వారికి తెలియపరుస్తాడు. మరియు దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَهْلَ الْكِتٰبِ قَدْ جَآءَكُمْ رَسُوْلُنَا یُبَیِّنُ لَكُمْ كَثِیْرًا مِّمَّا كُنْتُمْ تُخْفُوْنَ مِنَ الْكِتٰبِ وَیَعْفُوْا عَنْ كَثِیْرٍ ؕ۬— قَدْ جَآءَكُمْ مِّنَ اللّٰهِ نُوْرٌ وَّكِتٰبٌ مُّبِیْنٌ ۟ۙ
ఓ తౌరాత్ ను కలిగిన యూదుల్లోంచి మరియు ఇంజీలును కలిగిన క్రైస్తవుల్లోంచి గ్రంధహులారా నిశ్చయంగా మా ప్రవక్త ముహమమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ వద్దకు వచ్చారు మీపై అవతరింపబడిన గ్రంధములో నుంచి మీరు గోప్యంగా ఉంచుతున్న వాటిలో నుంచి చాలా విషయాలను మీ కొరకు ఆయన స్పష్టపరుస్తున్నారు. మరియు ఎటువంటి ప్రయోజనం లేని వాటిలో నుంచి చాలా వాటిని ఆయన ఉపేక్షిస్తున్నారు. కాని మిమ్మల్ని బట్టబయలు చేయటం తప్ప. నిశ్చయంగా ఖుర్ఆన్ మీ వద్దకు అల్లాహ్ వద్ద నుండి గ్రంధముగా వచ్చినది. మరియు అది వెలుగును ప్రసాదించే జ్యోతి. మరియు ప్రజలకు ప్రాపంచిక మరియు పరలోక తమ వ్యవహారాల్లో అవసరమైన ప్రతీ దాన్ని స్పష్టపరిచే ఒక గ్రంధము.
Ang mga Tafsir na Arabe:
یَّهْدِیْ بِهِ اللّٰهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهٗ سُبُلَ السَّلٰمِ وَیُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ بِاِذْنِهٖ وَیَهْدِیْهِمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
అల్లాహ్ ఈ గ్రంధము ద్వారా తనను సంతుష్టపరిచే విశ్వాసము మరియు సత్కర్మలను అవలంబించే వారిని అల్లాహ్ శిక్ష నుండి భద్రపరిచే మార్గముల వైపునకు మార్గ దర్శకత్వం చేస్తాడు. అవి స్వర్గము వైపునకు చేరవేసే మార్గములు. మరియు ఆయన వారిని అవిశ్వాసము,పాప కార్యముల చీకట్ల నుండి విశ్వాసము మరియు విధేయత యొక్క వెలుగు వైపునకు తన ఆదేశముతో వెలికితీస్తాడు. మరియు వారికి సరళమైన,తిన్ననైన మార్గము ఇస్లాం మార్గము వైపునకు భాగ్యమును కలిగిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
لَقَدْ كَفَرَ الَّذِیْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ هُوَ الْمَسِیْحُ ابْنُ مَرْیَمَ ؕ— قُلْ فَمَنْ یَّمْلِكُ مِنَ اللّٰهِ شَیْـًٔا اِنْ اَرَادَ اَنْ یُّهْلِكَ الْمَسِیْحَ ابْنَ مَرْیَمَ وَاُمَّهٗ وَمَنْ فِی الْاَرْضِ جَمِیْعًا ؕ— وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ؕ— یَخْلُقُ مَا یَشَآءُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
"నిశ్చయంగా క్రైస్తవుల్లోంచి, మర్యమ్ కుమారుడైన మసీహ్ ఈసా యే అల్లాహ్!" అని అనే వారు అవిశ్వాసమునకు ఒడిగట్టారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి :- మర్యమ్ కుమారుడగు మసీహ్ ఈసాను తుదిముట్టించటం నుండి మరియు ఆయన తల్లిని తుది ముట్టించటం నుండి మరియు భూమిపై ఉన్న వారందరిని తుదిముట్టించటం నుండి అల్లాహ్ వారిని తుదిముట్టించదలచినప్పుడు అల్లాహ్ను ఆపే శక్తి ఎవరికి ఉన్నది ?. మరియు ఎవరికి దాని నుండి ఆయనను ఆపే శక్తి లేనప్పుడు అది అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఎవరూ లేరని మరియు మర్యమ్ కుమారుడగు ఈసా మరియు ఆయన తల్లి మరియు సమస్త సృష్టి అందరు అల్లాహ్ సృష్టి అన్న దానికి ఆధారము. మరియు భూమ్యాకాశముల రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న దాని రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను తలచుకున్న వారిని సృష్టిస్తాడు. ఆయన తలచి సృష్టించిన వారిలో నుంచి ఈసా అలైహిస్సలాం ఉన్నారు. అతను ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• تَرْك العمل بمواثيق الله وعهوده قد يوجب وقوع العداوة وإشاعة البغضاء والتنافر والتقاتل بين المخالفين لأمر الله تعالى.
అల్లాహ్ ప్రమాణాలపై మరియు ఆయన ఒప్పందాలపై ఆచరణను వదిలివేయటం మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశములను విబేధించే వారి మధ్య శతృత్వమును కలిగి ఉండటం మరియు ద్వేషము.అసమ్మతి మరియు పోరాట వ్యాప్తిని అనివార్యం చేస్తుంది.

• الرد على النصارى القائلين بأن الله تعالى تجسد في المسيح عليه السلام، وبيان كفرهم وضلال قولهم.
మహోన్నతుడైన అల్లాహ్ మసీహ్ అలైహిస్సలాం శరీరంలో ప్రతిబింబించాడని చెప్పే క్రైస్తవులకు ప్రతిస్పందించటం మరియు వారి అవిశ్వాసము,వారి మాటల తప్పిదమును ప్రకటించటం.

• من أدلة بطلان ألوهية المسيح أن الله تعالى إن أراد أن يهلك المسيح وأمه عليهما السلام وجميع أهل الأرض فلن يستطيع أحد رده، وهذا يثبت تفرده سبحانه بالأمر وأنه لا إله غيره.
మహోన్నతుడైన అల్లాహ్ ఒక వేళ మసీహ్ అలైహిస్సలాంను మరియు ఆయన తల్లిని మరియు భూవాసులందరిని నాశనం చేయదలచుకుంటే ఎవరూ ఆయన్ను ఆపే వాడు లేరనటంలో మసీహ్ దైవం అవటం అసత్యమనటానికి ఆధారము. మరియు ఇది పరిశుద్ధుడైన ఆయన ఆదేశించటంలో ఒక్కడే అని మరియు ఆయన తప్ప ఇతరులు వాస్తవ ఆరాధ్య దైవం కాదని నిరూపిస్తుంది.

• من أدلة بطلان ألوهية المسيح أن الله تعالى يُذَكِّر بكونه تعالى ﴿ يَخْلُقُ مَا يَشَاءُ﴾ (المائدة: 17)، فهو يخلق من الأبوين، ويخلق من أم بلا أب كعيسى عليه السلام، ويخلق من الجماد كحية موسى عليه السلام، ويخلق من رجل بلا أنثى كحواء من آدم عليهما السلام.
మసీహ్ యొక్క దైవత్వము అసత్యమవటమునకు ఆధారముల్లోంచి అల్లాహ్ తఆలా తాను మహోన్నతుడని గుర్తు చేయటం يَخْلُقُ مَا يَشَـﺂءُ}[المائدة: 17 (అల్లాహ్ తాను తలచుకున్న వారిని సృష్టిస్తాడు) కావున ఆయన తల్లిదండ్రుల నుండి సృష్టిస్తాడు. మరియు ఈసా అలైహిస్సలాం లాగ తండ్రి లేకుండా తల్లి నుండి సృష్టిస్తాడు. మరియు మూసా అలైహిస్సలాం సర్పములాగ స్థిర రాసి నుండి సృష్టిస్తాడు మరియు హవ్వా ను ఆదం అలైహిస్సలాం నుండి సృష్టించినట్లు స్త్రీ లేకుండా పురుషుని నుండి సృష్టిస్తాడు.

 
Salin ng mga Kahulugan Surah: Al-Mā’idah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara