Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Mā’idah   Ayah:
یُرِیْدُوْنَ اَنْ یَّخْرُجُوْا مِنَ النَّارِ وَمَا هُمْ بِخٰرِجِیْنَ مِنْهَا ؗ— وَلَهُمْ عَذَابٌ مُّقِیْمٌ ۟
వారు నరకము నుండి దానిలో వారు ప్రవేశించినప్పుడు వెలుపలికి రావాలనుకుంటారు. అది వారికి ఎలా సాధ్యం ?! వారు దాని నుండి బయటకు రాలేరు. మరియు వారి కొరకు అందులో శాశ్వతమైన శిక్ష కలదు.
Ang mga Tafsir na Arabe:
وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوْۤا اَیْدِیَهُمَا جَزَآءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللّٰهِ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟
ఓ పాలకుడా దొంగతనం చేసిన పురుషుడు,దొంగతనం చేసిన స్త్రీ వారిద్దరికి వారు అన్యాయంగా ప్రజల సొమ్మును కాజేయటం వలన అల్లాహ్ తరుపు నుండి వారికి శిక్షగా,ప్రతిఫలంగా కుడి చేయిని నరికివేయండి. మరియు వారిద్దరిని,ఇతరులను భయపెట్టటానికి. మరియు అల్లాహ్ సర్వాధిక్యుడు ఆయనను ఏదీను ఓడించదు. తన విధివ్రాతలో మరియు తన ధర్మ శాసనం రచించటంలో వివేకవంతుడు.
Ang mga Tafsir na Arabe:
فَمَنْ تَابَ مِنْ بَعْدِ ظُلْمِهٖ وَاَصْلَحَ فَاِنَّ اللّٰهَ یَتُوْبُ عَلَیْهِ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఎవరైతే దొంగతనం చేయటం నుండి అల్లాహ్ యందు పశ్తాతాప్పడి తన కార్మను సంస్కరించుకుంటాడో నిశ్చయంగా అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహంగా అతని పశ్చాత్తాపమును స్వీకరిస్తాడు. ఇది ఎందుకంటే అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడును వారిపై కరుణించేవాడును. కాని విషయం పాలకుల వద్దకు వెళ్ళినప్పుడు పశ్ఛాత్తాపము వలన వారి నుండి శిక్ష విధించే ఆదేశం తప్పిపోదు.
Ang mga Tafsir na Arabe:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— یُعَذِّبُ مَنْ یَّشَآءُ وَیَغْفِرُ لِمَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ ప్రవక్తా భూమ్యాకాశముల రాజ్యాధికారము అల్లాహ్ దే అని మీకు తెలుసు. ఆయన వాటిని తాను తలచిన విధంగా కార్యచరణ చేస్తాడు. మరియు ఆయన తాను తలచిన వారికి తన న్యాయముతో శిక్షిస్తాడు. మరియు తాను తలచిన వారికి తన అనుగ్రహముతో మన్నిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَیُّهَا الرَّسُوْلُ لَا یَحْزُنْكَ الَّذِیْنَ یُسَارِعُوْنَ فِی الْكُفْرِ مِنَ الَّذِیْنَ قَالُوْۤا اٰمَنَّا بِاَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِنْ قُلُوْبُهُمْ ۛۚ— وَمِنَ الَّذِیْنَ هَادُوْا ۛۚ— سَمّٰعُوْنَ لِلْكَذِبِ سَمّٰعُوْنَ لِقَوْمٍ اٰخَرِیْنَ ۙ— لَمْ یَاْتُوْكَ ؕ— یُحَرِّفُوْنَ الْكَلِمَ مِنْ بَعْدِ مَوَاضِعِهٖ ۚ— یَقُوْلُوْنَ اِنْ اُوْتِیْتُمْ هٰذَا فَخُذُوْهُ وَاِنْ لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوْا ؕ— وَمَنْ یُّرِدِ اللّٰهُ فِتْنَتَهٗ فَلَنْ تَمْلِكَ لَهٗ مِنَ اللّٰهِ شَیْـًٔا ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَمْ یُرِدِ اللّٰهُ اَنْ یُّطَهِّرَ قُلُوْبَهُمْ ؕ— لَهُمْ فِی الدُّنْیَا خِزْیٌ ۙ— وَّلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟
ఓ ప్రవక్తా విశ్వాసమును బహిర్గతం చేసి అవిశ్వాసమును దాచి ఉంచిన కపటుల్లోంచి మిమ్మల్ని ఆగ్రహానికి గురి చేయటానికి అవిశ్వాస కార్యాలను బహిర్గతం చేయటంలో త్వరపడేవారు మిమ్మల్ని దుఃఖానికి గురి చేయకూడదు. మరియు తమ పెద్దల అబద్దమును చెవి ఒగ్గి విని దాన్ని స్వీకరించి,మీ నుండి విముఖతతో మీ వద్దకు రాని వారైన తమ నాయకులను అనుకరించేవారైన యూదులు మిమ్మల్ని దుఃఖానికి గురిచేయకూడదు. వారు తౌరాత్ లో ఉన్న అల్లాహ్ వాక్కును తమ మనో వాంఛంలకు అనుగుణంగా మార్చుకునేవారు, తమను అనుసరించేవారితో ఇలా పలికే వారు : ఒక వేళ ముహమ్మద్ ఆదేశము మీ మనోవాంఛలకు అనుగుణంగా ఉంటే దాన్ని మీరు అనుసరించండి. ఒక వేళ అది వాటికి భిన్నంగా ఉంటే దాని నుండి జాగ్రత్తపడండి. మరియు అల్లాహ్ ప్రజల్లోంచి ఎవరిని అపమార్గమునకు గురి చేయదలచుకుంటే ఓ ప్రవక్తా అతని నుండి అపమార్గమును తొలగించి అతన్ని సత్య మార్గము వైపునకు మార్గదర్శకం చేసే వాడిని మీరు పొందరు. యూదుల్లోంచి మరియు కపటుల్లోంచి ఈ గుణములను కలిగిన వారందరే అల్లాహ్ వారి హృదయములను అవిశ్వాసము నుండి పరిశుద్ధపరచటమును కోరలేదు. వారికి ఇహలోకంలో అవమానము మరియు పరాభవము కలదు. మరియు పరలోకంలో పెద్ద శిక్ష కలదు . అది నరకాగ్ని శిక్ష.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• حكمة مشروعية حد السرقة: ردع السارق عن التعدي على أموال الناس، وتخويف من عداه من الوقوع في مثل ما وقع فيه.
దొంగతనం చేసిన దానికి శిక్ష యొక్క ధర్మబద్దత విజ్ఞత : ప్రజల డబ్బుపై అక్రమాలకు పాల్పడకుండా దొంగను అరికట్టడం మరియు అతను పడిన దానిలో పడకుండా ఇతరులను భయపెట్టడం.

• قَبول توبة السارق ما لم يبلغ السلطان وعليه إعادة ما سرق، فإذا بلغ السلطان وجب الحكم، ولا يسقط بالتوبة.
విషయం అధికారి వద్దకు చేరుకోకపోతే దొంగ యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించడం మరియు అతను దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వాలి. ఎప్పుడైతే విషయం అధికారి వద్దకు చేరుతుందో తీర్పు ఆదేశం అనివార్య అవుతుంది. పశ్ఛాత్తాపము వలన దాని ఆదేశం తప్పిపోదు.

• يحسن بالداعية إلى الله ألَّا يحمل همًّا وغمًّا بسبب ما يحصل من بعض الناس مِن كُفر ومكر وتآمر؛ لأن الله تعالى يبطل كيد هؤلاء.
కొంత మంది ప్రజల అవిశ్వాసం,వంచన మరియు కుట్రల వలన కలిగిన దాని వలన బాధని మరియు దుఃఖమును మోయకుండా ఉండటం అల్లాహ్ వైపు అహ్వానమిచ్చే వారికి మంచిది. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ వీరందరి కుట్రలను నిర్వీర్యం చేస్తాడు.

• حِرص المنافقين على إغاظة المؤمنين بإظهار أعمال الكفر مع ادعائهم الإسلام.
కపటవిశ్వాసులు ఇస్లాంను చెప్పుకుంటూ అవిశ్వాస చర్యలను చూపించి విశ్వాసులను ఆగ్రహానికి గురిచేయటానికి ఆసక్తి చూపారు.

 
Salin ng mga Kahulugan Surah: Al-Mā’idah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara