Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 拉哈迈尼   段:

అర్-రహ్మాన్

每章的意义:
تذكير الجن والإنس بنعم الله الباطنة والظاهرة، وآثار رحمته في الدنيا والآخرة.
అల్లాహ్ యొక్క అంతర్గత మరియు స్పష్టమైన ఆశీర్వాదాలను మరియు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో ఆయన కరుణ యొక్క ప్రభావాలను జిన్ మరియు మానవునికి గుర్తుచేయడం

اَلرَّحْمٰنُ ۟ۙ
విస్తారమైన కారుణ్యము కల అనంత కరుణామయుడు.
阿拉伯语经注:
عَلَّمَ الْقُرْاٰنَ ۟ؕ
ఆయన ప్రజలకు ఖుర్ఆన్ ను దాన్ని కంఠస్తం చేసుకొవటం సులభతరం చేయటం ద్వారా మరియు దాని అర్ధములను సునాయసంగా అర్ధం చేసుకునేట్లుగా నేర్పించాడు.
阿拉伯语经注:
خَلَقَ الْاِنْسَانَ ۟ۙ
అయన మానవుడిని సవ్యంగా సృష్టించాడు. మరియు అతని రూపమును మంచిగా చేశాడు.
阿拉伯语经注:
عَلَّمَهُ الْبَیَانَ ۟
ఆయన అతనికి మాటపరంగా మరియు వ్రాయటం పరంగా తన మనస్సులో ఉన్న దాన్ని ఏ విధంగా స్పష్టపరచాలో నేర్పించాడు.
阿拉伯语经注:
اَلشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ ۟ۙ
సూర్య చంద్రులను వాటికి ఆయన హద్దును నిర్దేశించాడు. అవి పరిపూర్ణ లెక్క ప్రకారం పయనిస్తున్నవి. ప్రజలు సంవత్సరముల గణనను మరియు లెక్కను తెలుసుకోవటానికి.
阿拉伯语经注:
وَّالنَّجْمُ وَالشَّجَرُ یَسْجُدٰنِ ۟
మరియు కాండము లేని మొక్కలు మరియు వృక్షములు పరిశుద్ధుడైన అల్లాహ్ కు ఆయనకు విధేయిలుగా,లొంగిపోతూ సాష్టాంగపడుతున్నాయి.
阿拉伯语经注:
وَالسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ الْمِیْزَانَ ۟ۙ
మరియు ఆకాశమును దాన్ని భూమిపై దాని కొరకు కప్పుగా పైకెత్తి ఉంచాడు. మరియు భూమిలో న్యాయమును స్థాపించి దాని గురించి తన దాసులకు ఆదేశించాడు.
阿拉伯语经注:
اَلَّا تَطْغَوْا فِی الْمِیْزَانِ ۟
ఓ ప్రజలారా మీరు అన్యాయమునకు పాల్పడకూడదని మరియు తూకము వేయటంలో,కొలవటంలో అవినీతికి పాల్పడకూడదని ఆయన న్యాయమును స్థాపించాడు
阿拉伯语经注:
وَاَقِیْمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِیْزَانَ ۟
మరియు మీరు తూకమును మీ మధ్య న్యాయంతో నెలకొల్పండి. మరియు మీరు ఇతరుల కొరకు కొలచినప్పుడు మరియు తూకమేసినప్పుడు తూకము వేయటంలో లేదా కొలవటములో మీరు తగ్గించకండి.
阿拉伯语经注:
وَالْاَرْضَ وَضَعَهَا لِلْاَنَامِ ۟ۙ
మరియు భూమిని దానిపై సృష్టిని స్థిరీకరించటానికి దాన్ని సిద్ధం చేసి పరచాడు.
阿拉伯语经注:
فِیْهَا فَاكِهَةٌ وَّالنَّخْلُ ذَاتُ الْاَكْمَامِ ۟ۖ
అందులో ఫలాలను పండించే వృక్షములు కలవు. మరియు అందులో ఖర్జూర పండ్లను కలిగి ఉండే పుష్పకోశాలు గల ఖర్జూరపు చెట్లు కలవు.
阿拉伯语经注:
وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّیْحَانُ ۟ۚ
మరియు అందులో ఊక గల గోదుమలు మరియు బార్లి వంటి ధాన్యములు కలవు. మరియు అందులో మంచి సువాసన గల మొక్కలు గలవు.
阿拉伯语经注:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
阿拉伯语经注:
خَلَقَ الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ كَالْفَخَّارِ ۟ۙ
ఆయన ఆదం అలైహిస్సలాంను పెంకులాంటి శబ్దము వినిపించే ఎండు బంక మట్టితో సృష్టించాడు అది కాల్చబడిన బంక మట్టిలా ఉన్నది.
阿拉伯语经注:
وَخَلَقَ الْجَآنَّ مِنْ مَّارِجٍ مِّنْ نَّارٍ ۟ۚ
మరియు ఆయన జిన్ను తండ్రిని స్వచ్ఛమైన పొగ జ్వాల నుండి సృష్టించాడు.
阿拉伯语经注:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
阿拉伯语经注:
رَبُّ الْمَشْرِقَیْنِ وَرَبُّ الْمَغْرِبَیْنِ ۟ۚ
శీతాకాలం మరియు ఎండాకాలంలో సూర్యుడు ఉదయించే రెండు చోట్ల,అది అస్తమించే రెండు చోట్ల యొక్క ప్రభువు.
阿拉伯语经注:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• كتابة الأعمال صغيرها وكبيرها في صحائف الأعمال.
కర్మలు అవి చిన్నవైన,పెద్దవైన కర్మల పుస్తకములలో వ్రాయబడి ఉండటం.

• ابتداء الرحمن بذكر نعمه بالقرآن دلالة على شرف القرآن وعظم منته على الخلق به.
అనంత కరుణామయుడు తన అనుగ్రహాలను ప్రస్తావిస్తూ ఖుర్ఆన్ ను ఆరంభించటం ఖుర్ఆన్ గోప్పతనంపై మరియు దాని ద్వారా సృష్టిపై అయన ఉపకార గొప్పతనం పై సూచన ఉన్నది.

• مكانة العدل في الإسلام.
ఇస్లాంలో న్యాయమునకు స్థానం ఏమిటో తెలిసింది.

• نعم الله تقتضي منا العرفان بها وشكرها، لا التكذيب بها وكفرها.
అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మన నుండి వాటిని గుర్తించటమును మరియు వాటి విషయంలో కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తున్నవి. వాటి పట్ల తిరస్కారమును,కృతఘ్నతను కాదు.

 
含义的翻译 章: 拉哈迈尼
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭