Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 艾尔拉夫   段:

అల్-అరాఫ్

每章的意义:
انتصار الحق في صراعه مع الباطل، وبيان عاقبة المستكبرين في الدنيا والآخرة.
అసత్యముతో సత్యము పోరాటంలో సత్యమునకు సహాయం చేయటం మరియు ఇహపరాలలో అహంకారుల పర్యవసానాల ప్రకటన.

الٓمّٓصٓ ۟ۚ
అలిఫ్-లామ్-మీమ్-సాద్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
阿拉伯语经注:
كِتٰبٌ اُنْزِلَ اِلَیْكَ فَلَا یَكُنْ فِیْ صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنْذِرَ بِهٖ وَذِكْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ మీపై అవతరింప జేసిన గ్రంధం ఖుర్ఆన్. దాని గురించి మీ హృదయంలో ఎటువంటి చికాకు గాని,సంకోచముగాని ఉండకూడదు. దాని ద్వారా మీరు ప్రజలకు భయపెట్టటానికి,వాదించటానికి,దాని ద్వారా మీరు విశ్వాసపరులకి హితోపదేశం చేయటానికి ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. వారే (విశ్వాసపరులు) హితోపదేశం ద్వారా లబ్ది పొందుతారు.
阿拉伯语经注:
اِتَّبِعُوْا مَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ؕ— قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ ۟
ఓ ప్రజలారా అల్లాహ్ తఆలా మీ పై ఏ గ్రంధాన్నైతే అవతరింప జేశాడో దాన్ని మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క సంప్రదాయాన్ని అనుసరించండి. మరియు ఎవరినైతే మీరు షైతాన్ యోక్క స్నేహితులుగా భావిస్తున్నారో వారి మరియు చెడ్డ(దారి పై నడిచే)పండితుల కోరికలను మీరు అనుసరించకండి. వారిని మీరు అనుసరిస్తూ వారి కోరికల కొరకు మీపై అవతరించిన దాన్ని వదిలేస్తున్నారు. వాస్తవంగా మీరు హితబోధను చాలా తక్కువగా స్వీకరిస్తున్నారు. ఒక వేళ మీరు హితబోధను స్వీకరించేవారై ఉంటే అల్లాహ్ యోక్క హక్కు పై ఇతరవాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. మరియు మీ ప్రవక్త ను అనుసరించేవారు. మరియు ఆయన సంప్రదాయాల పై ఆచరించేవారు. మరియు దాన్ని మినహాయించి ఇతర వాటిని వదిలేసేవారు.
阿拉伯语经注:
وَكَمْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا فَجَآءَهَا بَاْسُنَا بَیَاتًا اَوْ هُمْ قَآىِٕلُوْنَ ۟
మేము ఎన్నో బస్తీలను వారు తమ అవిశ్వాసము,అపమార్గము పై మొండి వైఖరిని ప్రదర్శించినప్పుడు మా శిక్ష ద్వారా నాశనం చేశాము. రాత్రి లేదా పగలు వారు పరధ్యానంలో ఉన్నప్పుడు మా కఠినమైన శిక్ష వారిపై వచ్చి పడింది. తమపై వచ్చిన శిక్షను తమ నుండి తొలగించుకోలేకపోయారు. వారు ఆరోపించుకున్న వారి దేవుళ్ళు కూడా దానిని వారి నుండి తొలగించలేకపోయారు.
阿拉伯语经注:
فَمَا كَانَ دَعْوٰىهُمْ اِذْ جَآءَهُمْ بَاْسُنَاۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟
అల్లాహ్ శిక్ష వచ్చిన తరువాత వారు అల్లాహ్ తో అవిశ్వాసానికి ఒడిగట్టి దుర్మార్గమునకు పాల్పడ్డారని స్వయంగా అంగీకరించటం తప్ప ఇంకేమి ఉండదు.
阿拉伯语经注:
فَلَنَسْـَٔلَنَّ الَّذِیْنَ اُرْسِلَ اِلَیْهِمْ وَلَنَسْـَٔلَنَّ الْمُرْسَلِیْنَ ۟ۙ
మేము ప్రవక్తలను పంపించిన జాతుల వారిని వారు ప్రవక్తలకు సమాధానమిచ్చిన వైనము గురించి ప్రళయదినాన తప్పకుండా ప్రశ్నిస్తాము. అలాగే ప్రవక్తలను కూడా వారికి ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడ్డారో వాటిని చేరవేయటం గురించి,అలాగే వారికి వారి జాతులవారు ఏ సమాధానమిచ్చారో వాటి గురించి మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
阿拉伯语经注:
فَلَنَقُصَّنَّ عَلَیْهِمْ بِعِلْمٍ وَّمَا كُنَّا غَآىِٕبِیْنَ ۟
మానవులు తాము ఇహలోకంలో చేసుకున్న కర్మల గురించి మేము మా జ్ఞానంతో పూసగుచ్చినట్లు వారికి విప్పి జెబుతాము. వారి కర్మల గురించి మాకు తెలుసు. మాకు వాటిలోంచి ఏది గోప్యంగా లేదు. ఏ సమయంలో కూడా మేము వారి నుండి కనుమరగై లేము.
阿拉伯语经注:
وَالْوَزْنُ یَوْمَىِٕذِ ١لْحَقُّ ۚ— فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
ప్రళయదినాన కర్మల తూకము ఎటువంటి అన్యాయం,దుర్మార్గము లేకుండా న్యాయపూరితంగా ఉంటుంది. తూనిక సమయంలో ఎవరి సత్కర్మల పళ్ళెం పాపాల పళ్ళెం కన్న బరువుగా ఉంటుందో వారందరు తమ ఉద్దేశంలో సఫలీకృతమయ్యారు. మరియు భయం నుండి బయటపడ్డారు.
阿拉伯语经注:
وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَظْلِمُوْنَ ۟
మరియు తూనిక సమయంలో ఎవరి పాపాల పళ్ళెం సత్కర్మల పళ్ళెం కన్న బరువుగా ఉంటుందో వారందరు అల్లాహ్ యొక్క ఆయతులను (సూచనలను) తిరస్కరించటం వలన ప్రళయదినాన వినాశనము యొక్క వనరులను తమ స్వయనిర్ణయం ద్వారా తమకు తామే నష్టాన్ని మూట గట్టుకున్నవారవుతారు.
阿拉伯语经注:
وَلَقَدْ مَكَّنّٰكُمْ فِی الْاَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ ؕ— قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۟۠
ఓ ఆదం సంతతి వారా నిశ్చయంగా మేము మిమ్మల్ని భూమిపై నివసింపజేశాము. మరియు మేము మీ కొరకు అందులో జీవన సామగ్రిని ఏర్పాటు చేశాము. కావున మీరు అందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కాని మీ కృతజ్ఞతలు చాలా తక్కువ.
阿拉伯语经注:
وَلَقَدْ خَلَقْنٰكُمْ ثُمَّ صَوَّرْنٰكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ ۖۗ— فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— لَمْ یَكُنْ مِّنَ السّٰجِدِیْنَ ۟
ఓ ప్రజలారా మీ తండ్రి అయిన ఆదం ను మేము సృష్టించినాము. ఆ పిదప ఆయనకు అందమైన రూపమును ప్రసాధించినాము.ఉత్తమమైన రీతిలో తీర్చి దిద్దాము. ఆ పిదప మేము దైవదూతలను ఆయనకు గౌరవంగా సాష్టాంగపడమని ఆదేశించినాము.అయితే వారు ఆదేశాన్ని పాటించి సాష్టాంగ పడ్డారు. కాని ఇబ్లీస్ గర్వం వలన ,వ్యతిరేకత వలన సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• من مقاصد إنزال القرآن الإنذار للكافرين والمعاندين، والتذكير للمؤمنين.
సత్యతిరస్కారులను,వ్యతిరేకులను హెచ్చరించటం,విశ్వాసపరులను హితోపదేశం చేయటం ఖుర్ఆన్ అవతరణ లక్ష్యం.

• أنزل الله القرآن إلى المؤمنين ليتبعوه ويعملوا به، فإن فعلوا ذلك كملت تربيتهم، وتمت عليهم النعمة، وهُدُوا لأحسن الأعمال والأخلاق.
అల్లాహ్ ఖుర్ఆన్ ను విశ్వాసపరుల వైపునకు దానిని అనుసరించటానికి,ఆచరించటానికి అవతరింపజేశాడు. ఒక వేళ వారు అలా చేస్తే వారి క్రమ శిక్షణ,పోషణ పరిపూర్ణమయ్యింది. వారిపై అనుగ్రహం పూర్తయ్యింది. సత్కర్మల కొరకు,సుగుణాల కొరకు వారికి మార్గం చూపించబడింది.

• الوزن يوم القيامة لأعمال العباد يكون بالعدل والقسط الذي لا جَوْر فيه ولا ظلم بوجه.
ప్రళయదినాన దాసుల కర్మల తూకము న్యాయపూరితంగా,సమానంగా ఉంటుంది. అందులో ఏ విధంగాను దుర్మార్గము కాని అన్యాయము కాని ఉండదు.

• هَيَّأ الله الأرض لانتفاع البشر بها، بحيث يتمكَّنون من البناء عليها وحَرْثها، واستخراج ما في باطنها للانتفاع به.
అల్లాహ్ భూమిని మానవుడు దాని ద్వారా లబ్ది పొందటం కొరకు సిద్ధం చేశాడు. ఏ విధంగా నంటే వారు దానిపై కట్టడములు నిర్మించగలుగుతున్నారు,దానిని దున్నగలుగుతున్నారు,దాని లోపల ఉన్న వస్తువులను వెలికి తీసి దాని ద్వారా లబ్ది పొందుతున్నారు.

 
含义的翻译 章: 艾尔拉夫
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭