Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 艾尔拉夫   段:
قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لَنُخْرِجَنَّكَ یٰشُعَیْبُ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَكَ مِنْ قَرْیَتِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ— قَالَ اَوَلَوْ كُنَّا كٰرِهِیْنَ ۟ۚ
షుఐబ్ జాతి వారిలోంచి అహంకారానికి లోనైన పెద్దవారు,నాయకులు షుఐబ్ అలైహిస్సలాంతో ఇలా అన్నారు : ఓ షుఐబ్ మేము నిన్ను,నీతోపాటు ఉన్న నిన్ను విశ్వసించిన వారిని మా ఊరి నుండి బహిష్కరిస్తాము. కాని నీవు మా ధర్మం వైపునకు మరలితే తప్ప. షుఐబ్ ఆలోచిస్తూ,ఆశ్ఛర్యపోతూ వారితో ఇలా అన్నారు : ఏమి మేము మీ ధర్మాన్ని,మతాన్ని మా జ్ఞానము ద్వారా దానిని అసత్యం అని తెలుసుకుని అయిష్టత చూపుతూ అనుసరిస్తామా ?.
阿拉伯语经注:
قَدِ افْتَرَیْنَا عَلَی اللّٰهِ كَذِبًا اِنْ عُدْنَا فِیْ مِلَّتِكُمْ بَعْدَ اِذْ نَجّٰىنَا اللّٰهُ مِنْهَا ؕ— وَمَا یَكُوْنُ لَنَاۤ اَنْ نَّعُوْدَ فِیْهَاۤ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ رَبُّنَا ؕ— وَسِعَ رَبُّنَا كُلَّ شَیْءٍ عِلْمًا ؕ— عَلَی اللّٰهِ تَوَكَّلْنَا ؕ— رَبَّنَا افْتَحْ بَیْنَنَا وَبَیْنَ قَوْمِنَا بِالْحَقِّ وَاَنْتَ خَیْرُ الْفٰتِحِیْنَ ۟
మీరు ఉన్న అవిశ్వాసము,షిర్కు నుండి అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మమ్మల్ని రక్షించిన తరువాత కూడ మేము దానిని విశ్వసిస్తే అల్లాహ్ పై మేము అబద్దమును కల్పించిన వారమవుతాము. మరియు మేము మీ అసత్య ధర్మము వైపునకు మేము మరలటం మా కొరకు సముచితం కాదు,సరి కాదు. కాని మా ప్రభువైన అల్లాహ్ తలచుకుంటే తప్ప. అందరు ఆయన సుబహానహు తఆలా చిత్తమునకు లోబడి ఉండాలి. మా ప్రభువు ప్రతి వస్తువును జ్ఞానము ద్వారా చుట్టుముట్టి ఉన్నాడు. ఆయనపై అందులో నుంచి ఏ వస్తువు గోప్యంగా లేదు. మేము సన్మార్గముపై నిలకడగా ఉండటంను ప్రసాదించటం కొరకు,నరక మార్గము నుండి మమ్మల్ని రక్షించటం కొరకు మేము అల్లాహ్ ఒక్కడిపై నమ్మకమును కలిగి ఉన్నాము. ఓ మా ప్రభువా నీవు మా మధ్యన,మా అవిశ్వాస జాతి వారి మధ్యన న్యాయంగా తీర్పునివ్వు. నీవు హింసకు గురైన హక్కుదారునికి వ్యతిరేకుడైన దుర్మార్గుడికి విరుద్ధంగా సహాయం చేయి. ఓ మా ప్రభువా నీవే అందరిలోకెల్ల అత్యుత్తమంగా తీర్పునిచ్చేవాడివి.
阿拉伯语经注:
وَقَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ لَىِٕنِ اتَّبَعْتُمْ شُعَیْبًا اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ ۟
మరియు షుఐబ్ నుండి హెచ్చరిస్తూ తౌహీద్ దావత్ ను తిరస్కరించిన ఆయన జాతి వారిలోంచి అవిశ్వాసపరులైన పెద్దవారు,సర్దారులు ఇలా అన్నారు : ఓ మా జాతి వారా ఒక వేళ మీరు షుఐబ్ ధర్మంలోకి వెళ్ళి మీ ధర్మాన్ని,మీ తాతముత్తాతల ధర్మాన్ని వదిలేస్తే నిశ్చయంగా మీరు నాశనమైపోతారు.
阿拉伯语经注:
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ ۟
వారిని తీవ్రమైన భూకంపం కబళించింది. వారు తమ ఇళ్ళలోనే వినాశనము అయినట్లు,తమ ముఖములపై,తమ మోకాళ్ళపై బోర్లాపడిపోయినట్లు తమ ఇంటిలోనే చనిపోయినట్లు అయిపోయారు.
阿拉伯语经注:
الَّذِیْنَ كَذَّبُوْا شُعَیْبًا كَاَنْ لَّمْ یَغْنَوْا فِیْهَا ۛۚ— اَلَّذِیْنَ كَذَّبُوْا شُعَیْبًا كَانُوْا هُمُ الْخٰسِرِیْنَ ۟
షుఐబ్ ను తిరస్కరించిన వారందరు నాశనమైపోయారు. వారందరు తమ ఇళ్ళలో నివాసము లేనట్లు,వాటి ద్వారా ప్రయోజనం చెందలేదన్నట్లు అయిపోయారు. షుఐబ్ ను తిరస్కరించిన వారే నష్టాన్ని చవిచూసారు. ఎందుకంటే వారు స్వయంగా నష్టాన్ని చవిచూసారు,వారు అధికారమును పొందలేదు. ఈ తిరస్కారులైన అవిశ్వాసపరులందరు పేర్కొన్నట్లు ఆయన జాతి వారిలోంచి విశ్వాసపరులు నష్టాన్ని చవిచూడలేదు.
阿拉伯语经注:
فَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَنَصَحْتُ لَكُمْ ۚ— فَكَیْفَ اٰسٰی عَلٰی قَوْمٍ كٰفِرِیْنَ ۟۠
వారందరు వినాశనమై పోయినప్పుడు వారి ప్రవక్త అయిన షుఐబ్ అలైహిస్సలాం వారి నుండి ముఖము త్రిప్పుకున్నారు,వారిని ఉద్దేశించి ఇలాపలికారు : ఓ నా జాతి వారా నా ప్రభువు నన్ను మిమ్మల్ని చేరవేయమని ఆదేశించిన వాటన్నింటిని మీకు చేరవేశాను. మరియు నేను మిమ్మల్ని ఉపదేశించాను (హితోపదేశం చేసాను). మీరు నా హితోపదేశాన్ని స్వీకరించలేదు. మీరు నా నిర్దేశాలను అనుసరించలేదు. అలాంటప్పుడు అల్లాహ్ ను అవిశ్వసించే జాతి,తమ అవిశ్వాసం పై మొండి వైఖరిని చూపే వారిపై నేను ఎలా దుఃఖించగలను?.
阿拉伯语经注:
وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْیَةٍ مِّنْ نَّبِیٍّ اِلَّاۤ اَخَذْنَاۤ اَهْلَهَا بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ یَضَّرَّعُوْنَ ۟
నగరముల్లోంచి ఏ నగరంలో నైన అల్లాహ్ ప్రవక్తల్లోంచి ఏ ప్రవక్తను మేము పంపినా అక్కడి వాసులు తిరస్కరించారు,అవిశ్వసించారు. కాని మేము వారు అల్లాహ్ కు విధేయులై వారు ఉన్న అవిశ్వాసము,అహంకారమును వదిలి వేస్తారని ఆశిస్తూ వారిని కష్టాలకు,పేదరికానికి,రోగాలకు గురి చేసి పట్టుకున్నాము. తిరస్కారులైన జాతుల్లో అల్లాహ్ సంప్రదాయమును ప్రస్తావించటం ద్వారా ఖురైష్ జాతి వారి కొరకు,అవిశ్వాసమును కనబరచి తిరస్కరించే వారందరికి ఇది ఒక హెచ్చరిక.
阿拉伯语经注:
ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّیِّئَةِ الْحَسَنَةَ حَتّٰی عَفَوْا وَّقَالُوْا قَدْ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَالسَّرَّآءُ فَاَخَذْنٰهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟
ఆ పిదప మేము వారిని కష్టాలకు,రోగాలకు గురి చేసి శిక్షించిన తరువాత మేలుకు,మంచి స్థితికి,శాంతికి గురి చేసి మార్చి వేశాము. తుదకు వారి సంఖ్యా బలం పెరిగింది,వారి సంపద పెరిగింది. ఆ తరువాత వారు ఇలా అన్నారు : చెడు మరియు మంచి మనకు ఏదైతే సంభవించిందో అది ముందు మన పూర్వికులకు సంభవించిన స్థిరమైన అలవాటే. వారికి సంభవించిన శిక్ష ఉద్దేశము గుణపాఠము అని,వారికి కలిగిన అనుగ్రహాలు నెమ్మది నెమ్మదిగా వారిని (శిక్షకు) దగ్గర చేసే ఉద్దేశంతో అన్న విషయాన్ని వారు గుర్తించ లేదు. మేము వారిని అకస్మాత్తుగా శిక్ష ద్వారా పట్టుకున్నాము. వారు శిక్షను గ్రహించలేక పోయారు,దానికి వారు సిద్ధము కాలేదు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• من مظاهر إكرام الله لعباده الصالحين أنه فتح لهم أبواب العلم ببيان الحق من الباطل، وبنجاة المؤمنين، وعقاب الكافرين.
నీతిమంతులైన అల్లాహ్ దాసుల కొరకు ఆయన ప్రసాదించిన గౌరవ మర్యాదల రూపాల్లోంచి ఆయన అసత్యము నుండి సత్యమును వివరించటం ద్వారా,విశ్వాసపరులకు విముక్తి,అవిశ్వాసపరులను శిక్షంచటం ద్వారా వారి కొరకు జ్ఞానము యొక్క ద్వారాలను తెరచి వేశాడు.

• من سُنَّة الله في عباده الإمهال؛ لكي يتعظوا بالأحداث، ويُقْلِعوا عما هم عليه من معاص وموبقات.
అల్లాహ్ యొక్క దాసులు సంఘటనల ద్వారా హితోపదేశం గ్రహించటానికి,వారి వలన జరిగిన పాపాలు,అవిధేయ కార్యాలను వారు విడనాడటం కొరకు అల్లాహ్ వారికి గడువు ఇవ్వటం అల్లాహ్ సంప్రదాయం.

• الابتلاء بالشدة قد يصبر عليه الكثيرون، ويحتمل مشقاته الكثيرون، أما الابتلاء بالرخاء فالذين يصبرون عليه قليلون.
కష్టము ద్వారా పరీక్ష లో సహనం చూపేవారు చాలా మంది ఉంటారు,వాటి బాధలను భరించేవారు చాలా మంది ఉంటారు. అయితే సుఖము ద్వారా పరీక్షలో సహనం చూపేవారు చాలా తక్కువ మంది ఉంటారు.

 
含义的翻译 章: 艾尔拉夫
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭