Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: ത്തൗബഃ   ആയത്ത്:
یٰۤاَیُّهَا النَّبِیُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِیْنَ وَاغْلُظْ عَلَیْهِمْ ؕ— وَمَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
ఓ ప్రవక్తా అవిశ్వాసపరులతో ఖడ్గముతో పోరాడండి. మరియు కపటులతో నోటి ద్వారా,వాదన ద్వారా పోరాడండి. రెండు వర్గాలపట్ల కఠినంగా వ్యవహరించండి.వారు దీనికి తగినవారు. ప్రళయదినాన వారి నివాసస్థలము నరకము.మరియు వారి గమ్యస్థానము ఎంతో చెడ్డదైన గమ్యస్థానము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
یَحْلِفُوْنَ بِاللّٰهِ مَا قَالُوْا ؕ— وَلَقَدْ قَالُوْا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوْا بَعْدَ اِسْلَامِهِمْ وَهَمُّوْا بِمَا لَمْ یَنَالُوْا ۚ— وَمَا نَقَمُوْۤا اِلَّاۤ اَنْ اَغْنٰىهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗ مِنْ فَضْلِهٖ ۚ— فَاِنْ یَّتُوْبُوْا یَكُ خَیْرًا لَّهُمْ ۚ— وَاِنْ یَّتَوَلَّوْا یُعَذِّبْهُمُ اللّٰهُ عَذَابًا اَلِیْمًا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَمَا لَهُمْ فِی الْاَرْضِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
కపటులు వారితరపు నుండి మీకు కలిగిన తిట్లు,మీ ధర్మమును అపనిందపాలు చేయటం (లోపాలు చూపటం) లాంటి మాటలు వారు పలకలేదని అబధ్ధము పలుకుతూ ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు పలికినవి మీకు చేరినవి మాటలు వారిని అవిశ్వాసపరులని తెలుపుతున్నవి. వారు విశ్వాసమును బహిర్గతం చేసిన తరువాత అవిశ్వాసమును బహిర్గతం చేశారు. మరియు వారికి సాధ్యం కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడీ చేయటమును నిశ్చయించుకున్నారు. వారు నిరాకరించకూడదన్న దాన్ని నిరాకరించారు.మరియు అది అల్లాహ్ యుద్ధ ప్రాప్తుల ద్వారా వారిని సంపన్నులు చేసి వారిపై అనుగ్రహించినది దేనినైతే ఆయన తన ప్రవక్తు అనుగ్రహించాడో అది.ఒకవేళ వారు తమ కపటత్వము నుండి అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడితే దాని నుండి వారి పశ్చాత్తాపము దానిపై వారు ఉండటం కంటే వారి కొరకు ఎంతో మేలైనది.ఒక వేళ వారు అల్లాహ్ యందు పశ్చాత్తాపము నుండి విముఖత చూపితే ఆయన వారికి ఇహలోకములో హతమార్చటం ద్వారా,బంధీలు చేయటం ద్వారా బాధాకరమైన శిక్షను విధిస్తాడు.మరియు పరలోకములో వారికి నరకాగ్ని ద్వారా బాధాకరమైన శిక్షను విధిస్తాడు.వారిని శిక్ష నుండి కాపాడటానికి వారిని రక్షించే సంరక్షకుడు వారి కొరకు ఎవడూ ఉండడు.మరియు వారి నుండి శిక్షను దూరం చేసే సహాయకుడూ ఉండడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَمِنْهُمْ مَّنْ عٰهَدَ اللّٰهَ لَىِٕنْ اٰتٰىنَا مِنْ فَضْلِهٖ لَنَصَّدَّقَنَّ وَلَنَكُوْنَنَّ مِنَ الصّٰلِحِیْنَ ۟
కపటుల్లోంచి అల్లాహ్ పై ప్రమాణము చేసి ఈ విధంగా పలికేవారు ఉన్నారు : ఒకవేళ అల్లాహ్ తన అనుగ్రహమును మాకు ప్రసాదిస్తే మేము తప్పకుండా అవసరం కలవారికి దానం చేస్తాము. మరియు మేము తప్పకుండా తమ ఆచరణల సంస్కరణ అయిన పుణ్యాత్ముల్లోంచి అవుతాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَلَمَّاۤ اٰتٰىهُمْ مِّنْ فَضْلِهٖ بَخِلُوْا بِهٖ وَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ ۟
పరిశుద్ధుడైన అల్లాహ్ వారికి తన అనుగ్రహమును ప్రసాదించినప్పుడు వారు అల్లాహ్ తో ప్రమాణం చేసిన దాన్ని పూర్తి చేయలేదు.అంతేకాక తమ సంపదలనుండి ఏదీ దానం చేయకుండా ఆపివేశారు. వారు విశ్వాసము నుండి విముఖత చూపుతూ వెను తిప్పి వెళ్ళిపోయారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاَعْقَبَهُمْ نِفَاقًا فِیْ قُلُوْبِهِمْ اِلٰی یَوْمِ یَلْقَوْنَهٗ بِمَاۤ اَخْلَفُوا اللّٰهَ مَا وَعَدُوْهُ وَبِمَا كَانُوْا یَكْذِبُوْنَ ۟
వారు అల్లాహ్ తో చేసిన ప్రమాణమునకు వారి వ్యతిరేకము వలన,వారి తిరస్కారము వలన వారికి శిక్షగా ప్రళయదినం వరకు వారి హృదయాల్లో కపటత్వమును నాటుకునేటట్లుగా ఆయన వారి పరిణామమును చేశాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَلَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَعْلَمُ سِرَّهُمْ وَنَجْوٰىهُمْ وَاَنَّ اللّٰهَ عَلَّامُ الْغُیُوْبِ ۟ۚ
ఏమీ వారు తమ సమావేశాల్లో చేసుకునే రహస్య కుట్రల,కుతంత్రాల గురించి వారు అల్లాహ్ కు తెలియదని అనుకుంటున్నారా ?.మరియు వాస్తవానికి అల్లాహ్ అగోచరవిషయాల గురించి జ్ఞానము కలవాడు. వారి ఆచరణల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు ఆయన తొందరలోనే వారికి వాటి పరంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَلَّذِیْنَ یَلْمِزُوْنَ الْمُطَّوِّعِیْنَ مِنَ الْمُؤْمِنِیْنَ فِی الصَّدَقٰتِ وَالَّذِیْنَ لَا یَجِدُوْنَ اِلَّا جُهْدَهُمْ فَیَسْخَرُوْنَ مِنْهُمْ ؕ— سَخِرَ اللّٰهُ مِنْهُمْ ؗ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
చిన్నపాటి దానధర్మాలు చేయటంపై విశ్వాసపరుల్లోంచి స్వఛ్ఛంద సేవకులు ఎవరైతే కేవలం తమ శక్తిమేరకు చాలా తక్కువ వాటిని పొందే వారు వారిని అపనిందపాలు చేసేవారు వారిని ఈ విధంగా పలుకుతూ ఎగతాళి చేస్తారు : వారి దానము ఏవిధంగా ప్రయోజనకరమైనది ?.విశ్వాసపరులకు వారి ఎగతాళికి ప్రతిఫలంగా అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తాడు. మరియు వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• وجوب جهاد الكفار والمنافقين، فجهاد الكفار باليد وسائر أنواع الأسلحة الحربية، وجهاد المنافقين بالحجة واللسان.
అవిశ్వాసపరులతో,కపట విశ్వాసులతో పోరాడటం అనివార్యము.అయితే అవిశ్వాసపరులతో పోరాడటం చేతి ద్వారా,అన్ని రకాల యుద్ధ ఆయుధాల ద్వారా,కపటులతో పోరాడటం వాదన ద్వారా,మాట ద్వారా .

• المنافقون من شرّ الناس؛ لأنهم غادرون يقابلون الإحسان بالإساءة.
కపట విశ్వాసులు ప్రజల్లో చెడ్డవారు.ఎందుకంటే వారు మోసం చేసేవారు,వారు మంచికి బదులుగా చెడు చేస్తారు.

• في الآيات دلالة على أن نقض العهد وإخلاف الوعد يورث النفاق، فيجب على المسلم أن يبالغ في الاحتراز عنه.
ప్రమాణాలను భంగపరచటం,వాగ్దానమును విభేదించటం కపటత్వమునకు వారసులు చేస్తుందని ఆయతుల్లో ఆధారముంది.ఒక ముస్లిము దాని నుండి చాలా ఎక్కువగా జాగ్రత్తపడటం తప్పనిసరి.

• في الآيات ثناء على قوة البدن والعمل، وأنها تقوم مقام المال، وهذا أصل عظيم في اعتبار أصول الثروة العامة والتنويه بشأن العامل.
ఆయతుల్లో శారీరక బలము,కార్యము యొక్క పొగడ్త ఉన్నది.నిశ్చయంగా అది ధనము యొక్క స్థానమును వహిస్తుంది.మరియు ఇది ప్రజా ధనము యొక్క సాధన సంపత్తుల్లను పరిగణలోకి తీసుకోవటంలో,కార్యకుడి స్థానమును కీర్తినివ్వటంలో ఒక గొప్ప సాధన సంపత్తి.

 
പരിഭാഷ അദ്ധ്യായം: ത്തൗബഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർകസ് തഫ്സീർ പുറത്തിറക്കിയത്.

അടക്കുക